MoviesP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhattaff1cf22-ca51-433b-b2d6-ee00efd5f29b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhattaff1cf22-ca51-433b-b2d6-ee00efd5f29b-415x250-IndiaHerald.jpg2020 చివరకు వచ్చేసింది. ఈ సంవత్సరం మాత్రం ఎంతో సవాలుగా గడిచిందనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఈ సంవత్సరం హిందీ చలన చిత్ర పరిశ్రమ కూడా ఎన్నో పోరాటాలు ఎదురుకొంది. ఇప్పుడు సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది తిరిగి పనిని మొదలుపెట్టారు. చాలామంది ఆర్టిస్టులు ముందస్తు భద్రతా చర్యలు పాటిస్తూ సినిమా సెట్స్ కు అడుగుపెడుతున్నారు.alia bhatt;alia bhatt;rajamouli;rrr movie;industries;cinema;2020;hindi;film industry;interview;vegetable market;letter;nijam;chitramలాక్ డౌన్ లో అలియా ఏం చేసిందో తెలుసా?లాక్ డౌన్ లో అలియా ఏం చేసిందో తెలుసా?alia bhatt;alia bhatt;rajamouli;rrr movie;industries;cinema;2020;hindi;film industry;interview;vegetable market;letter;nijam;chitramTue, 08 Dec 2020 10:40:10 GMT

2020 చివరకు వచ్చేసింది. ఈ సంవత్సరం మాత్రం ఎంతో సవాలుగా గడిచిందనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఈ సంవత్సరం హిందీ చలన చిత్ర పరిశ్రమ కూడా ఎన్నో పోరాటాలు ఎదురుకొంది. ఇప్పుడు సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది తిరిగి పనిని మొదలుపెట్టారు. చాలామంది ఆర్టిస్టులు ముందస్తు భద్రతా చర్యలు పాటిస్తూ సినిమా సెట్స్ కు అడుగుపెడుతున్నారు.

అలియా భట్ తాను లాక్ డౌన్ సమయంలో సమయాన్ని ఎలా వినియోగించుకున్నదో అన్న విషయాన్ని బయట పెట్టింది. అలాగే తిరిగి పనిని మొదలుపెట్టే విషయం గురించి తాను ఎలా ఫీల్ అవుతోందో కూడా చెప్పుకొచ్చింది.

మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా భట్ ఈ విషయాలు చెప్పుకొచ్చింది. 'ఈ సమయమంతా నాకు ఉందని నేను గ్రహించినప్పుడు, నేను దానిని ఉత్పాదకంగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను, వ్యాపారం మరియు మార్కెట్ యొక్క విభిన్న అంశాల గురించి మరింత తెలుసుకున్నాను'. అంటూ లాక్ డౌన్ సమయాన్ని తాను ఎలా ఉపయోగించుకుందో చెప్పింది అలియా.

సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వం వహిస్తోన్న 'గంగూబాయి కతియావాడి' సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది అలియా భట్.

సినిమా షూటింగ్ లో తిరిగి పాల్గొనడం గురించి మాట్లాడుతూ, "సెట్ కి తిరిగి రావడం, టీంతో తిరిగి యూనిట్ అవడం అనేది నిజంగా ఒక గ్రేట్ ఫీలింగే. వాస్తవానికి, ఆంక్షలు మరియు ప్రోటోకాల్స్ వంటివి ఎన్నో మేము ఫాలో అవుతున్నాము, ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాని మేము ఇది క్రొత్తగా జోడైన సాధారణమని అంగీకరించాము అని చెప్పుకొచ్చింది. 

తాను చేస్తోన్న కొత్త సినిమాల గురించి చెప్పుకొచ్చింది అలియా. అలియా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. గంగూబాయి కతియావాడి, బ్రహ్మాస్త్ర, తఖ్త్ సినిమాలు చేస్తోంది. ఇంకా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్ కు అడుగుపెట్టింది అలియా.




రైతు బంద్ కు మద్దతివ్వని మమత దీదీ!

నీకు చీరల గురించి తప్పా ఏం తెలుసు...? బిజెపి నేతపై మహిళా నేత సంచలన వ్యాఖ్యలు

రైతు బంద్.. బ్యాంకుల పరిస్థితేంటి..?

స్పేస్‌ఎక్స్ సంస్థలో తెలుగు కిరణం.. మిషన్ హెడ్ హోదాలో ఉద్యోగం!

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>