MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhas6f9b59aa-5bf2-4401-8a49-b8b30f1bba7c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhas6f9b59aa-5bf2-4401-8a49-b8b30f1bba7c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈశ్వర్ సినిమా ద్వారా తొలిసారిగా హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. తన పెద్దనాన్న కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ ద్వారా రంగప్రవేశం చేసిన ప్రభాస్ ఆ సినిమాతో మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత ఆయన కెరీర్ మూడో సినిమాగా వచ్చిన వర్షం సంచలన విజయాన్ని అందుకొని ప్రభాస్ కి కమర్షియల్ సక్సెస్ ను అందించింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన ప్రభాస్ ఆపై కెరీర్లో ఎన్నో గొప్ప విజయాలు అందుకున్నారు. prabhas;baahubali;prabhas;shiva;jayanth;koratala siva;krishna;krishnam raju;naga;prasanth;prashanth neel;rajamouli;varsha;india;apherald;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;mirchi;lord siva;vegetable market;success;yuva;kgf;prasanth neel;prashant kishor;eshwar;jayamవామ్మో... ప్రభాస్ ఆ దర్శకుడి సినిమా కూడా ఓకే చేసారా .....??వామ్మో... ప్రభాస్ ఆ దర్శకుడి సినిమా కూడా ఓకే చేసారా .....??prabhas;baahubali;prabhas;shiva;jayanth;koratala siva;krishna;krishnam raju;naga;prasanth;prashanth neel;rajamouli;varsha;india;apherald;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;mirchi;lord siva;vegetable market;success;yuva;kgf;prasanth neel;prashant kishor;eshwar;jayamTue, 08 Dec 2020 19:58:55 GMTటాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈశ్వర్ సినిమా ద్వారా తొలిసారిగా హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. తన పెద్దనాన్న కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ ద్వారా రంగప్రవేశం చేసిన ప్రభాస్ ఆ సినిమాతో మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత ఆయన కెరీర్ మూడో సినిమాగా వచ్చిన వర్షం సంచలన విజయాన్ని అందుకొని ప్రభాస్ కి కమర్షియల్ సక్సెస్ ను అందించింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన ప్రభాస్ ఆపై కెరీర్లో ఎన్నో గొప్ప విజయాలు అందుకున్నారు.

ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన మిర్చి సినిమా భారీ కమర్షియల్ సక్సెస్ ను అందుకుని ప్రభాస్ కి మరింత పేరు పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇకపోతే దాని తర్వాత దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సిరీస్ లోని రెండు భాగాల సినిమాలు ఒకదానిని మించి మరొకటి వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ ని ఆర్జించి ఒక్కసారిగా ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్రభాస్ కి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా విపరీతమైన మార్కెట్ ఉంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మొత్తం నాలుగు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. కాగా వాటిలో రాధేశ్యామ్ సినిమా అతి త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనుండగా దాని అనంతరం నాగ అశ్విన్ సినిమా, బాలీవుడ్ దర్శకడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న ఆదిపురుష్ అలానే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీయనున్న సలార్ సినిమాలు ప్రభాస్ చేయనున్నాడు. ఇక మరొక రెండు నెలల్లో ఒకేసారి ఇవి మూడు సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూడు సినిమాలకు గాను పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేసి కాల్ షీట్లు కూడా ఇచ్చారట ప్రభాస్. అందుతున్న సమాచారాన్ని బట్టి వచ్చే ఏడాది వేసవి కానుకగా రాధేశ్యామ్ రిలీజ్ అవుతుందని, ఆపై 2022లో నాగ అశ్విన్ సినిమా అలానే ఆదిపురుష్ సినిమాలు విడుదలవుతాయని ఇక 2023 జనవరిలో సలార్ సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇటీవల ప్రభాస్ మరొక సినిమాను కూడా ఓకే చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో మంచి సక్సెస్ లతో కొనసాగుతున్న ఒక యువ దర్శకుడి కథకి ప్రభాస్ పచ్చజెండా ఊపారని అతి త్వరలో దానికి సంబంధించిన అధికారిక అనౌన్స్ మెంట్ కూడా రానుందని అంటున్నారు. మొత్తంగా ఈ సినిమాతో కలిపితే ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్లు అనే చెప్పాలి. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే...!!




తెరాస వ్యూహం తెలిసింది...

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>