PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/traffic-police3dd7b167-2abb-4e80-be98-17cc8ca79e7d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/traffic-police3dd7b167-2abb-4e80-be98-17cc8ca79e7d-415x250-IndiaHerald.jpgఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు నూతన రైతు చట్టాలకు తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ చట్టాలు రైతులకు మేలు చేసే విధంగా కాకుండా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాచేలా ఉన్నాయని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు.traffic police;hyderabad;india;smart phone;police;capital;december;letter;traffic police;central government;corporateభారత్ బంద్ ఎఫెక్ట్: హైదరాబాద్‌ ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు..!భారత్ బంద్ ఎఫెక్ట్: హైదరాబాద్‌ ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు..!traffic police;hyderabad;india;smart phone;police;capital;december;letter;traffic police;central government;corporateTue, 08 Dec 2020 08:00:00 GMTఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు నూతన రైతు చట్టాలకు తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ చట్టాలు రైతులకు మేలు చేసే విధంగా కాకుండా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాచేలా ఉన్నాయని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఇక వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీలో తమ నిరసనను వ్యక్తం చేయాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు రైతులకు రాజకీయ పార్టీల మద్దతు లభిస్తోంది. డిసెంబర్ 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు సైతం పొలిటికల్ పార్టీలు సైతం కదిలొస్తున్నాయి. భారత్‌ బంద్‌కు బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు మద్దతు ప్రకటిస్తూనే ఉన్నాయి. దేశ్యాప్తంగా వివిధ ప్రజాసంఘాలు, ప్రముఖులు సైతం మద్దతు తెలుపుతూనే ఉన్నారు.

ఇక వాహనదారులూ అలర్ట్ అవ్వండి. మంగళవారం నాడు ‘భారత్ బంద్’ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు రహదారులపై ప్రయాణాలు కష్టతరం అవుతాయని పోలీసులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు డిసెంబర్ 8వ తేదీన ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ సహా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు.

దీంతో వాహనదారుల రోజువారీ ప్రయాణాలకు ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారులకు ముందస్తుగా సూచనలు జారీ చేశారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు సాధ్యమైనంత వరకు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇక ఎమర్జెన్సీ సర్వీసులైన అంబులెన్స్‌లు, ఇతర సర్వీసులు యధావిధిగా నడుస్తాయన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎవరికైనా ఇబ్బంది తలెత్తితే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 040-2785 3413, 040-2300 2424, 9490617100, 8500411111 కు ఫోన్ చేయవచ్చని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.


చైనా సాధించిన అద్భుతం... ప్రపంచం ఆశ్చర్యం..?

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>