PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/janasena1ac2ea9d-9780-4a99-9659-cc4e11a3a278-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/janasena1ac2ea9d-9780-4a99-9659-cc4e11a3a278-415x250-IndiaHerald.jpgఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెతను గుర్తు చేసే విధంగా వ్యవహరిస్తున్నాయి బిజెపి జనసేన పార్టీలు. ఏపీలో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఆపొత్తు కు అనుగుణంగా కొంత కాలం కలిసి ఉన్నట్టుగా వ్యవహరించినా, ప్రస్తుతం ఎవరికి వారే అన్నట్టుగా సొంత నిర్ణయాలు తీసుకుంటూ , సొంతంగా కార్యక్రమాలు విడివిడిగానే చేసుకుంటూ వస్తున్నారు.దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయమై అందరికీ అనేక అనుమానాలు నెలకొన్నాయి. అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం మొదటి నుంచి అనేక అనుమానాలకు తావిస్తూ వస్తోందిbjp jansena tirupathi parlament elections;auto;pawan;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;husband;letter;ycp;janasena partyఆలూ లేదు చూలు లేదు ! కొడుకు పేరు సోమలింగం అంటే ఇదే ?ఆలూ లేదు చూలు లేదు ! కొడుకు పేరు సోమలింగం అంటే ఇదే ?bjp jansena tirupathi parlament elections;auto;pawan;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;husband;letter;ycp;janasena partyTue, 08 Dec 2020 07:24:15 GMT
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెతను గుర్తు చేసే విధంగా వ్యవహరిస్తున్నాయి బిజెపి జనసేన పార్టీలు. ఏపీలో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఆపొత్తు కు అనుగుణంగా కొంత కాలం కలిసి ఉన్నట్టుగా వ్యవహరించినా, ప్రస్తుతం ఎవరికి వారే అన్నట్టుగా సొంత నిర్ణయాలు తీసుకుంటూ , సొంతంగా కార్యక్రమాలు విడివిడిగానే చేసుకుంటూ వస్తున్నారు.దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయమై అందరికీ అనేక అనుమానాలు నెలకొన్నాయి. అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం మొదటి నుంచి అనేక అనుమానాలకు తావిస్తూ వస్తోంది. 




పవన్ ను బిజెపి అగ్రనేతలు ఎవరు పట్టించుకోవట్లేదు అనట్టుగానే వ్యవహరిస్తూనే పవన్ వచ్చారు. అలాగే దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి పవన్ రావాల్సిందిగా కోరినా, బీజేపీ నేతలు ఎవరూ పట్టించుకోలేదు. గ్రేటర్ పరిధిలో సొంతంగా ఎన్నికల బరిలోకి దిగారు. కానీ బిజెపి నేతల ఒత్తిడితో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.  ఇప్పుడు ఏపీలో తిరుపతి పార్లమెంటు ఎన్నికల హడావుడి ఉండడం తో ఈ రెండు పార్టీలు అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. వాస్తవంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండడంతో కలిసికట్టుగా పోరాటం చేసి సీట్లు సర్దుబాటు చేసుకుంటారు అని అనుకున్నా, విడిగానే పోరాడుతున్నారు. ప్రస్తుతం నివర్ బాధితులకు అండగా నిలిచేందుకు జిల్లాల పర్యటన చేపట్టి రైతుల కోసం దీక్ష చేపట్టారు. ఇక బీజేపీ కూడా విడిగానే తుఫాన్ బాధితులకు అండగా ఆందోళనలు నిర్వహిస్తోంది. 




ఏపీ లోని రోడ్ల దుస్థితి పై బీజేపీ ఆందోళన నిర్వహిస్తోంది. అయితే ఈ రెండు పార్టీలు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పై పోరాటానికి దిగాయి. ఎట్టి పరిస్థితుల్లో అయినా తిరుపతి లో పోటీ చేయాలనే కసితో బిజెపి, జనసేన లు భావిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల మధ్య విభేదాలతో ఆ అవకాశం ఉండేలా కనిపించడంలేదు. టికెట్ విషయమై బిజెపి ఒక కమిటీని కూడా నియమించింది . అది తేలకుండా రెండు పార్టీలు విడివిడిగా పోరాటాలకు దిగడం తో ఈ రెండు పార్టీల పొత్తుపై సవాలక్ష సందేహాలు అలుముకున్నాయి.




ఏలూరు వ్యాధికి కారణం అదే...? చెప్పేసిన ఎంపీ...!

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>