PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news-updates396c88ac-21b4-4ad9-abb7-16450ab233d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news-updates396c88ac-21b4-4ad9-abb7-16450ab233d1-415x250-IndiaHerald.jpgభారత్ బంద్‌కు దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక, వ్యాపార, విద్యార్ధి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో బంద్ విజయవంతంగా జరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి బంద్ కొనసాగుతున్నా.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే రహదార్లను నిర్బంధిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. కార్యాలయాలకు వెళ్లేవారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయిbharat bandh;mamata benerjee;benarjee;poorna;mumbai;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;india;west bengal - kolkata;mamata banerjee;ola;congress;bhuma akhila priya;chief minister;job;shiv sena;central government;punjab;mamta mohandasభారత్ బంద్: ఉదయం 11 నుంచి 3 గంటల వరకు మాత్రమే రహదారుల నిర్బంధం - రైతు సంఘాలుభారత్ బంద్: ఉదయం 11 నుంచి 3 గంటల వరకు మాత్రమే రహదారుల నిర్బంధం - రైతు సంఘాలుbharat bandh;mamata benerjee;benarjee;poorna;mumbai;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;india;west bengal - kolkata;mamata banerjee;ola;congress;bhuma akhila priya;chief minister;job;shiv sena;central government;punjab;mamta mohandasTue, 08 Dec 2020 11:25:00 GMTబీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్షకులు చేపట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. రైతులిచ్చిన భారత్ బంద్‌కు దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక, వ్యాపార, విద్యార్ధి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో బంద్ విజయవంతంగా జరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి బంద్ కొనసాగుతున్నా.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే రహదార్లను నిర్బంధిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. కార్యాలయాలకు వెళ్లేవారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయి.


అత్యవసర, నిత్యావసర వాహనాలకు ఆటంకం కలిగించబోమని, మూడు గంటల కంటే ఎక్కువ సేపు చిక్కుకున్న వారికి పండ్లు, పాలు అందజేయనున్నట్టు రైతులు ప్రకటించారు. భారత్ బంద్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సూచనలు చేసింది. అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం, అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘాలు భారత్ బంద్‌కు సంఘీభావం తెలిపినా.. అందులో పాల్గొనడం లేదు. కాబట్టి బ్యాంకు సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయి.


అఖిల భారత రవాణాదారుల సంక్షేమ సంఘం ఈ బంద్‌కు మద్దతు ఇవ్వడంలేదు. అలాగే, వాణిజ్య సంఘం సీఏఐటీతో కలిసి దీనిపై సంయుక్త ప్రకటన చేసింది. రవాణ, వాణిజ్య సంఘాలు పాల్గొనడం లేదని పేర్కొన్నారు. బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ ట్రాన్స్‌పోర్ట్ సేవలు యథావిధగా సాగుతున్నాయి. ఢిల్లీలో మెట్రో సహా ప్రజా రవాణా, మార్కెట్లు కొనసాగుతున్నాయి. అత్యవసర సేవలు, అంబులెన్స్‌లు, ఆస్పత్రులపై బంద్ ప్రభావం ఉండదని రైతులు ప్రకటించారు. అలాగే, వివాహ కార్యక్రమాలను కూడా అడ్డుకోబోమని స్పష్టం చేశారు. పంజాబ్, హరియాణాలో రవాణా యూనియన్లు సంపూర్ణ మద్దతు తెలిపి, భారత్‌ బంద్‌లో పాల్గొంటున్నాయి. అక్కడ పాలు, కూరగాయల రవాణా కూడా నిలిచిపోయింది. పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లోని మండీలు మూసివేశారు. ఢిల్లీ ఆజాద్ మండీ కూడా మూతపడింది. పంజాబ్‌లో హోటల్, రెస్టారెంట్ సంఘాలు కూడా బంద్‌లో పాల్గొనడంతో అన్నీ మూతబడ్డాయి. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఉబర్, ఓలా సేవలు కూడా నిలిచిపోయాయి. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఈ బంద్ కు మద్దతు పలకటం లేదని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, శివసేన, టీఆర్ఎస్ మరియు లెఫ్ట్ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి.


ఏపీలో వార్డు వాలంటీర్ల తొలగింపు.. జగన్ కీలక నిర్ణయం..?

రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?

నవ్వుతూనే మీడియాకు చురకలు అంటించిన చిరు!

కీలక నేతలకు కేసీఆర్ ఆఫర్లు

ఢిల్లీ వెళ్తున్న కేటిఆర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>