PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajanikanth3a6c257b-faf8-47ae-9f61-4c21b9834683-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajanikanth3a6c257b-faf8-47ae-9f61-4c21b9834683-415x250-IndiaHerald.jpgతమిళ సూపర్ స్టార్, తలైవా రజనీ కాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాదిలో జనవరిలో పార్టీ స్థాపిస్తున్నట్లు రజనీ కాంత్ ప్రకటించారు. దీనిపై ప్రస్తుతం తమిళనాట ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ స్పందించారు. భారత దేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని, పార్టీలు పెట్టుకోవచ్చని, అది మన దేశ రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్టాలిన్ చెప్పారు. rajanikanth;kamal hassan;rajinikanth;udhayanidhi stalin;vishwa;india;rajani kanth;tamil;assembly;chennai;stalin;v;partyరజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..rajanikanth;kamal hassan;rajinikanth;udhayanidhi stalin;vishwa;india;rajani kanth;tamil;assembly;chennai;stalin;v;partyTue, 08 Dec 2020 11:30:00 GMTతమిళ సూపర్ స్టార్, తలైవా రజనీ కాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాదిలో జనవరిలో పార్టీ స్థాపిస్తున్నట్లు రజనీ కాంత్ ప్రకటించారు. దీనిపై ప్రస్తుతం తమిళనాట ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ స్పందించారు. భారత దేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని, పార్టీలు పెట్టుకోవచ్చని,  అది మన దేశ రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్టాలిన్ చెప్పారు. రజినీ పార్టీపై ఆయన అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘‘ముందైతే పార్టీ స్థాపించనివ్వండి. వారి రాజకీయ వైఖరి ఏంటో తెలిసిన తర్వాత దానిపై పూర్తి స్థాయిలో స్పందిస్తాన’’ అని స్టాలిన్ కామెంట్ చేశారు.

‘‘ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు. ఎవరైనా రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు. ముందు రజనీ కాంత్‌‌ను పార్టీ పెట్టనివ్వండి. వారి రాజకీయ విధి విధానాలు ఏమిటో తెలియాలి. ఆ తర్వాతే దానిపై నేను స్పందిస్తా. ఇక్కడ నాకు అస్సలు అర్థం కాని విషయం ఒకటుంది. అదేంటంటే.. తమిళరువి మణియమ్‌ను రజినీ కాంత్ రాజకీయ సలహాదారుగా ఎందుకు నియమించుకున్నారా? అని. ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నకు సమాధానం తెలియడం లేదు’’ అని డీఎంకే అధినేత పేర్కొన్నారు.

మరి కొన్ని నెలల్లో తమిళ నాట ఎన్నికల నగారా మోగనుంది. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఉండబోతోందని నిన్న మొన్నటి వరకూ ఊహగానాలు వినిపించాయి. ఇప్పుడు రజనీ కూడా రంగంలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. మరి రజనీ రాజకీయ పార్టీ మూడో శక్తిగా నిలబడగలదా? లేదా? అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. ఇప్పటికే విశ్వ నటుడు కమల్ హాసన్.. మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీ స్థాపించి దెబ్బ తిన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగిన కమల్ పార్టీ.. ఆశించినంత ప్రభావం చూపించలేదు. మరి ఇప్పుడు రంగంలో దిగిన రజనీ ఏ మేరకు ప్రభావం చూపుతారనేది చూడాలి.


ఏపీలో వార్డు వాలంటీర్ల తొలగింపు.. జగన్ కీలక నిర్ణయం..?

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?

నవ్వుతూనే మీడియాకు చురకలు అంటించిన చిరు!

కీలక నేతలకు కేసీఆర్ ఆఫర్లు

ఢిల్లీ వెళ్తున్న కేటిఆర్...?

అవినాష్ ఎలిమినేషన్.. తప్పు చేశామంటున్న ప్రేక్షకులు.. ఎందుకో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>