PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgసిద్దిపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని విపంచి కళ నిలయం లో ఈ నెల 10 నా సీఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేసే 144 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇండ్లు కట్టడానికి నాలుగు ఎండ్ల నుండి 400 సార్లు ఇండ్లను పరిశీలించా అన్నారు. నాకు ఇంతవరకు సొంత ఇల్లు కట్టుకునే అవకాశం రాలేదు అని ఆయన అన్నారు. అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించాం అని వివరించారు. ఏ ఒక్క పేదవాడికి అన్యాయాం జరుగొద్దన్నది, పేదవారు మిగలవద్దన్నది మా ధ్యేయం అని సharish rao;district;minister;central government;siddipetనేను సొంత ఇల్లు కట్టుకోలేదు: హరీష్ రావునేను సొంత ఇల్లు కట్టుకోలేదు: హరీష్ రావుharish rao;district;minister;central government;siddipetTue, 08 Dec 2020 18:00:00 GMTసిద్దిపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని విపంచి కళ నిలయం లో ఈ నెల 10 నా సీఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేసే 144 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇండ్లు కట్టడానికి నాలుగు ఎండ్ల నుండి 400 సార్లు ఇండ్లను పరిశీలించా అన్నారు. నాకు ఇంతవరకు సొంత ఇల్లు కట్టుకునే అవకాశం రాలేదు అని ఆయన అన్నారు. అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించాం అని వివరించారు. ఏ ఒక్క పేదవాడికి అన్యాయాం జరుగొద్దన్నది, పేదవారు మిగలవద్దన్నది మా ధ్యేయం అని స్పష్టం చేసారు.

ఇండ్లు రానివారు అడైర్యపడవద్దు, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. సిద్దిపేట కోసం ఇంకో వెయ్యి ఇండ్ల కోసం సీఎం కెసిఆర్ ను అడుగుతా అన్నారు. సొంతింటి స్థలంలో ఇండ్లు కట్టుకునే కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తాం అని ఆయన స్పష్టం చేసారు. దేశంలో పెద్దవాళ్ళకు కట్టించిన ఇండ్లు ఎక్కడ కూడా ఇంత అద్భుతంగా లేవు అని ఆయన వివరించారు. ఇవి ఆత్మగౌరవ భవనాలు అన్నారు. ఈ నెల 10 న సీఎం కెసిఆర్ చేతుల మీదుగా 144 మందికి గృహ ప్రవేశం జరిపిస్తం అని స్పష్టం చేసారు.

మిగతా వారిని దశల వారీగా గృహ ప్రవేశం చేపిస్తం అని ఆయన అన్నారు. ఏ ఒక్కరూ కూడా ఏ కార్యాలయం చుట్టూ తిరగకుండా అన్ని సర్టిఫికెట్స్ ఇస్తున్నాం అని ఆయన వివరించారు. పేదవారి కోసం మున్సిపల్ ట్యాక్సీ ని ఏడాదికి 100 రూపాయలు మాత్రమే చేసామని చెప్పారు. మా సొంతింటి ఆడపడుచుల తరహాలో బట్టలు కూడా పెడుతున్నాం అని ఆయన అన్నారు. కాలనీ నీ పరిశుభ్రంగా ఉంచుకొని తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి అని సూచించారు. 163 కోట్లతో ఈ కాలని నిర్మాణం చేశాం అన్నారు. ఈ ఇండ్లు అమ్మిన, కొన్న వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం అని ఆయన అన్నారు.


మాస్ మహారాజా చేతిలో ఓడిపోయి.. వీడియో షేర్ చేసిన శృతి హాసన్!

నిహారిక పెళ్లిపై మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్..!!

ఆ జిల్లాలో యువనేత తప్పు... బాబు కొంప ముంచుతుందా...?

భిక్షాటన చేస్తున్న ఐఐటీ పూర్వ విద్యార్థి

బ్రేకింగ్: జనసేన బిజెపి అత్యవసర సమావేశం... ఎందుకు...?

స్వార్థం కోసం రైతుల నోట్లో మట్టికొడుతున్నారు: కిషన్ రెడ్డి

బ్రిటన్ ప్రధానిపై హరీష్ రావు ప్రసంశలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>