PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/wfp2e6b6e6b-e3d9-41b8-95ff-793a49c26701-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/wfp2e6b6e6b-e3d9-41b8-95ff-793a49c26701-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి విజృంభణ వల్ల 2020 సంవత్సరంలో మనుషుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ప్రజలు 2021 జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆ తరువాత దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారు. అయితే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం మాత్రం 2020 సంవత్సరంతో పోలిస్తే 2021 మరింత దుర్భరంగా ఉంటుందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నూతన సంవత్సరంలోకి కొత్త ఆశలతో అడుగు పెట్టాలని అనుకున్న వాళ్ల ఆశలపై వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం నీళ్లు చల్లింది. విపత్తు, మానవతా సంక్షోభాలు 2021లో చూస్తwfp;view;amala akkineni;manu;january;kanna lakshminarayana;20202020 కన్నా దారుణంగా 20212020 కన్నా దారుణంగా 2021wfp;view;amala akkineni;manu;january;kanna lakshminarayana;2020Tue, 08 Dec 2020 07:45:51 GMT

2020 కన్నా దారుణంగా 2021 

డబ్ల్యూఎఫ్‌పీ

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల 2020 సంవత్సరంలో మనుషుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ప్రజలు 2021 జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆ తరువాత దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారు. అయితే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం మాత్రం 2020 సంవత్సరంతో పోలిస్తే 2021 మరింత దుర్భరంగా ఉంటుందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

నూతన సంవత్సరంలోకి కొత్త ఆశలతో అడుగు పెట్టాలని అనుకున్న వాళ్ల ఆశలపై వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం నీళ్లు చల్లింది. విపత్తు, మానవతా సంక్షోభాలు 2021లో చూస్తామని డబ్ల్యూఎఫ్‌పీ తెలిపింది. 2021 సంవత్సరంలో కరువు, ఆకలి కష్టాలు పెరుగుతాయని డబ్ల్యూఎఫ్‌పీ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో డబ్ల్యూఎఫ్‌పీ తరపున బీస్లీ ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 27 కోట్ల మంది ఆకలి బాధలను అనుభవిస్తున్నారు.

2021 సంవత్సరంలో ఈ సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని.. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఈ కొత్త సంక్షోభాలు ఎదురవుతాయని తెలిపారు. 2021 చెత్త మానవతా సంక్షోభ సంవత్సరంగా ఉండబోతుందని డబ్ల్యూఎఫ్‌పీ పేర్కొంది. పలు దేశాలు అమలు చేసిన లాక్ డౌన్ మానవ పురోగతిని ఒక రకంగా తగ్గించిందని డబ్ల్యూఎఫ్‌పీ తరపున బీస్లీ వెల్లడించారు.

సరైన వ్యూహాలను అనుసరిస్తే మాత్రమే పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం సాధ్యమవుతుందని.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే మంచి ఫలితాలను పొందగలమని బీస్లీ తెలిపారు. మరి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి పరిస్థితులు అదుపులోకి వస్తాయో లేదో చూడాల్సి ఉంది




సాప్ట్ వేర్ నుంచి రాజకీయాల్లోకి

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>