PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrab56fee4-a367-4efb-b93f-ff9a4b5427b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrab56fee4-a367-4efb-b93f-ff9a4b5427b0-415x250-IndiaHerald.jpgఇప్పటికే కేసీఆర్ కి తెలంగాణ లో ఎదురవుతున్న పరాభవాలు టీ ఆర్ ఎస్ పార్టీ తట్టుకోలేకపోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో స్థానాలు తగ్గడం, దుబ్బాక లో ఓటమి, గ్రేటర్ లో భిన్న ఫలితాలు చూస్తుంటే కేసీఆర్ పై ప్రజలకు ఎంతటి వ్యతిరేకత ఉందొ అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ లో ఫలితాలు ఆశాజనకంగా రాకపోవడంతో మునుపటి ఉత్సాహం టీ ఆర్ ఎస్ లో లేదని చెప్పాలి.. బీజేపీ నోరు రోజు రోజు కి పెరిగిపోవడంతో టీ ఆర్ ఎస్ నోరు ఆటోమేటిక్ గా తగ్గిపోయింది.. ఇక పార్టీ లో చేరికలు కూడా బీజేపీ పార్టీ ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.. kcr;kcr;nagarjuna akkineni;ramu;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;parliment;degree;janareddy;college;partyనాగార్జున సాగర్ లో విజయం సాధించాలి. కేసీఆర్ కసరత్తులు..?నాగార్జున సాగర్ లో విజయం సాధించాలి. కేసీఆర్ కసరత్తులు..?kcr;kcr;nagarjuna akkineni;ramu;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;parliment;degree;janareddy;college;partyTue, 08 Dec 2020 20:00:00 GMTకేసీఆర్ కి తెలంగాణ లో ఎదురవుతున్న పరాభవాలు టీ ఆర్ ఎస్ పార్టీ తట్టుకోలేకపోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో స్థానాలు తగ్గడం, దుబ్బాక లో ఓటమి, గ్రేటర్ లో భిన్న ఫలితాలు చూస్తుంటే కేసీఆర్ పై ప్రజలకు ఎంతటి వ్యతిరేకత ఉందొ అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ లో ఫలితాలు ఆశాజనకంగా రాకపోవడంతో మునుపటి ఉత్సాహం టీ ఆర్ ఎస్ లో లేదని చెప్పాలి.. బీజేపీ నోరు రోజు రోజు కి పెరిగిపోవడంతో టీ ఆర్ ఎస్ నోరు ఆటోమేటిక్ గా తగ్గిపోయింది.. ఇక పార్టీ లో చేరికలు కూడా బీజేపీ పార్టీ ఉత్సాహాన్ని పెంచుతున్నాయి..

రాములమ్మ విజయ శాంతి బీజేపీ లో చేరింది.. కేసీఆర్ ని గద్దె దింపాడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారని తెలుస్తుంది.. ఇక ఈ ఓటమి ప్రభావం నాగార్జున సాగర్ లో త్వరలో జరిగే ఉపఎన్నిక లో ఉండకుండా చూసుకోవాలని చూస్తుంది. అయితే కేసీఆర్ భయానికి తగ్గట్లుగానే టీ ఆర్ ఎస్ సాగర్ లో అంత బలంగా అయితే ఏమీ లేదు. అక్కడ బలమైన నేతగా జానారెడ్డి ఉన్నారు. ఆయనను బీజేపీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఇక్కడ తెరాస పార్టీ ప్రభావం చూపడం కష్టంగా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటినుంచే సాగర్ లో కసరత్తులు ప్రారంభించారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో డిగ్రీ కాలేజీ పెడతామని చాలా కాలంగా టీఆర్ఎస్ హామీ ఇస్తూ వస్తోంది. ఇప్పుడు ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీ చేశారు.అలాగే మూసీ నదిపై కేశవాపురం వద్ద కొండ్రపోల్‌ ఎత్తిపోతల పథకానికి రూ.75.93 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే సాగర్‌ ఎగువన ఉన్న నెల్లికల్‌ ఎత్తిపోతల పథకానికీ అనుమతినిచ్చారు. వాడపల్లి ఎత్తిపోతల పథకం రూ.229.25 కోట్లతో నిర్మాణం చేస్తారు. అలాగే చిన్న చిన్న పనులకు సంబంధించిన జీవోలను కూడావిడుదల చేశారు. ఈ ప్రాజెక్టులు, పథకాలన్నీ కూడా నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి ప్రయోజనం చేకూర్చేవే. కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లుగా అక్కడి నేతలు.. గ్రామ గ్రామన కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారు.


భారత్ బంద్ పై కంగనా ఆసక్తికర ట్వీట్ ఏమిటో తెలుసా

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>