PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mallareddy6a4cb35f-00b8-44f9-9d04-58ad6e609e9c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mallareddy6a4cb35f-00b8-44f9-9d04-58ad6e609e9c-415x250-IndiaHerald.jpgతెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు అయింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేసారు. సూరారంలోని తన 20 గుంటల భూమిని మంత్రి మల్లారెడ్డి మరి కొంత మందితో కబ్జా చేశారంటూ ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. mallareddy;women;telangana rashtra samithi trs;telangana;district;police;court;assembly;survey;minister;woman;letter;tdp;medchal;syamalaతెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై కేసుతెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై కేసుmallareddy;women;telangana rashtra samithi trs;telangana;district;police;court;assembly;survey;minister;woman;letter;tdp;medchal;syamalaTue, 08 Dec 2020 23:05:08 GMTతెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీసులు మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు చేసారు. కుత్బుల్లాపూర్ మండలం సూరారంకు చెందిన  శ్యామల దేవి అనే మహిళ మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేసింది. సూరారంలోని సర్వే నెంబర్ 115, 116, 117 లో తనకు 2 ఎకరాల 13 గుంటల భూమి ఉందని... అందులో 20 గుంటల భూమిని మంత్రి మల్లారెడ్డి మరి కొంత మందితో కబ్జా చేశారంటూ ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి అనుకొని ఉన్న భూమిని కబ్జా చేసారని, దానిని విక్రయించాలంటూ బెదిరిస్తున్నారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ భూ కబ్జాకు సంబంధించి బాధితురాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే  అప్పట్లో ఇది తప్పుడు ఫిర్యాదు అని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బాధితురాలు శ్యామల దేవి భూ కబ్జాకు సంబంధించి లాయర్‌ ను సంప్రదించి కోర్టులో పిటిషన్ వేసింది. అయితే లాయర్‌ మంత్రి మల్లారెడ్డితో కుమ్మక్కై... తెల్ల కాగితంపై తన సంతకాలు తీసుకొని తప్పుడు డాకుమెంట్స్ సృష్టించారంటూ బాధితురాలు ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రికి అనుకుని ఉన్న 20 గుంటల భూమిని కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించారని ఫిర్యాదులో  తెలిపారు.

బాధితురాలు ఫిర్యాదు మేరకు  మంత్రి మల్లారెడ్డి, అతడి కుమారుడు భద్రారెడ్డితో పాటు మరో ఐదుగురిపై 446, 506 ఆర్‌/డబ్ల్యూ, 34 ఐపీసీ సెక్షన్ల కింద దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా 2014లో మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన మల్లారెడ్డి విజయం సాధించారు. అనంతరం టీడీపీని వీడి అధికార టీఆర్ఎస్ లో చేరారు. ఇక 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ  స్థానం టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొంది... మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు.




నిమ్మగడ్డకు ఛాన్స్ దొరికినట్లేనా...!

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>