PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi-formers-straik50b7e171-954a-48a7-9ca4-96ceb4f61a66-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi-formers-straik50b7e171-954a-48a7-9ca4-96ceb4f61a66-415x250-IndiaHerald.jpgవ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు గత కొద్ది రోజులు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే.. పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వాతావరణం సహకరించకపోయినా కూడా లెక్క చెయ్యకుండా నిరసనను కొనసాగించారు. ఇప్పటికే కొందరు రైతులు నిరసనలో ప్రాణాలను కూడా కోల్పోయారు. ఈ రోజు నిరసనలో భాగంగా భారత్ బంద్ ను ప్రకటించారు. వారికి మద్దతు తెలుపుతూ రాష్ట్రాల మంత్రులు స్వచ్ఛందంగా బంద్ కు పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు చోట్ల నిరసనలు ఉద్రిక్తంగా మారాయి.. delhi formers straik;amit shah;pratishta;delhi;india;minister;central government;mantraమొత్తానికి దిగొచ్చిన కేంద్రం.. చర్చలకు రమ్మని రైతులకు పిలుపు..మొత్తానికి దిగొచ్చిన కేంద్రం.. చర్చలకు రమ్మని రైతులకు పిలుపు..delhi formers straik;amit shah;pratishta;delhi;india;minister;central government;mantraTue, 08 Dec 2020 16:30:00 GMTభారత్ బంద్ ను ప్రకటించారు. వారికి మద్దతు తెలుపుతూ రాష్ట్రాల మంత్రులు స్వచ్ఛందంగా బంద్ కు పిలుపు నిచ్చారు. ఇప్పటికే పలు చోట్ల నిరసనలు ఉద్రిక్తంగా మారాయి..



ఈ మేరకు కేంద్రం దిగొచ్చింది.. నిరసనలు కొనసాగిస్తున్న రైతుల్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చర్చలకు పిలిచారు.. మంగళవారం సాయంత్రం 7గంటలకు రైతులు చర్చలకు రావాలని అమిత్‌షా తమను ఆహ్వానించారని.. రైతు సంఘాల నాయకుడు రాకేశ్‌ టికైట్‌ తాజాగా వెల్లడించారు.. మంత్రి అమిత్  షా తమను ఫోన్‌ కాల్‌ ద్వారా సంప్రదించినట్లు రాకేశ్‌ చెప్పారు. ' చర్చలకు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌ చేశారు. 7 గంటలకు సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు. ఢిల్లీ సమీపంలో జాతీయ రహదారులపై నిరసనలు కొనసాగిస్తున్న రైతులు సమావేశానికి హాజరు కానున్నారని రాకేశ్‌ తెలిపారు.



ఓ వైపు రైతు సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంద్‌ కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి రైతులను అత్యవసరంగా చర్చలకు ఆహ్వానించడం ఆసక్తిగా మారింది.. చర్చలు జరిపి రైతుల నిరసనలకు ముగింపు పలకాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 13 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఐదో విడత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో డిసెంబర్‌ 8న రైతు సంఘాలు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో బంద్ ఇప్పటికీ కొనసాగుతోంది.. రైతుల కష్టాలు తెలిసిన ప్రతి ఒక్కరూ బంద్ లో పాల్గొంటున్నారు..




జమిలి ఎన్నికల వెనుక అసలు రాజకీయం ఇదే

ఏపీలో కేంద్రంపై కొత్త నిరసన... ఎందుకంటే

అమాయకంగా ఆ హీరోను నమ్మి చివరికి ఒంటరిగా మిగిలిపోయింది నటి నిర్మల

సరిగ్గా ఇదే రోజు.. భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం..?

గుడ్ న్యూస్ : స్మార్ట్ ఫోన్ తో కరోనా టెస్ట్.. నిమిషాల్లో ఫలితం..?

ముత్యాల ముగ్గు శ్రీధర్ కెరీర్ నాశనం కావడానికి ఎన్టీఆర్ ఎలా కారణం..?

"సలార్" మూవీ లో హీరోయిన్స్ వీళ్ళే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>