PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/when-the-corona-vaccine-comes-to-us-9a7d8274-58ea-45fd-83ad-afc0dccf2658-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/when-the-corona-vaccine-comes-to-us-9a7d8274-58ea-45fd-83ad-afc0dccf2658-415x250-IndiaHerald.jpgభారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ వచ్చేందుకు ఇక ఎంతో కాలం పట్టదా? వారాల వ్యవధిలో.. వైరస్‌ నుంచి విముక్తి కలిగించే టీకా రాబోతోందా? టీకా ధర కేవలం 250 రూపాయలే ఉండబోతోందా? వ్యాక్సిన్‌ విషయంలో జరుగుతున్న కొత్త ప్రచారంలో నిజమెంత అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. when the corona vaccine comes to us;business;india;narendra modi;prime minister;population;central governmentకరోనా వ్యాక్సిన్ మన దగ్గరకు వచ్చేదెప్పుడంటే..!కరోనా వ్యాక్సిన్ మన దగ్గరకు వచ్చేదెప్పుడంటే..!when the corona vaccine comes to us;business;india;narendra modi;prime minister;population;central governmentTue, 08 Dec 2020 21:30:00 GMT
కరోనా కోరల నుంచి విముక్తి కోసం యావత్ దేశం ఆశగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్‌ అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతినివ్వాలంటూ ఇప్పటికే ఫైజర్‌, సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు.. దరఖాస్తు చేసుకోగా.. దీనిపై డీసీజీఐ 2వారాల్లోగా సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఫైజర్‌, సీరం, భారత్‌ బయోటెక్‌ కంపెనీల విజ్ఞప్తులను సీడీఎస్‌సీవోలోని నిపుణుల కమిటీ బుధవారం పరిశీలించి.. టీకా పనితీరు, పంపిణీ వంటి అంశాలపై చర్చలు జరుపనుంది. ఈ కమిటీ రిపోర్టు అందించిన రెండు వారాల్లోగా కొవిడ్‌ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దివారాల్లోనే దేశంలో కొవిడ్‌ టీకా అందుబాటులోకి వస్తుందని.. ఇటీవల అఖిలపక్ష సమవేశంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా తెలిపారు. దీంతో తాజా ప్రచారానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే అధిక జనాభా కలిగిన భారత్ అవసరాలు తీర్చేందుకు సీరం ఇన్‌స్టిట్యూటే అనువైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరిపడా టీకా ఉత్పత్తి చేసేందుకు కేంద్రం కూడా సీరం‌ పైనే ఆశలు పెట్టుకుంది. దీంతో, కరోనా టీకాను కేవలం 250కే అందిస్తామంటూ సీరం ఇన్‌స్టిట్యూట్ కేంద్రానికి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. టీకాల కోసం ప్రభుత్వాలు భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న వేళ.. ధరలు దిగివచ్చే అవకాశం ఉందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. మరి టీకా మార్కెట్‌లోకి వచ్చాక.. పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి కరోన వ్యాక్సిన్ భారత్ కు ఎప్పుడు వస్తుందోనని యావత్ ప్రజానీకం ఆతురతగా ఎదురు చూస్తోంది. అపుడే ప్రశాంతమైన జీవనం గడపవచ్చని చెబుతోంది.






ఏలూరు ఘటనపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్న పవన్

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>