PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cafeday66d49897-e414-4742-96dc-65d784a1aed6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cafeday66d49897-e414-4742-96dc-65d784a1aed6-415x250-IndiaHerald.jpgకెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెడ్గే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కాఫీ డే సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. ఆయన మరణం తర్వాత గతేడాది జూలైలో స్వతంత్ర బోర్డు సభ్యుడు ఎస్‌.వి. రంగనాథ్‌ని తాత్కలిక చైర్మన్‌గా నియమించారు. ఈcafeday;auto;editor mohan;krishna;malavika new;siddhartha;tara;2019;december;karnataka 1;wife;coffee;mangalore;sakshi;v;raghavendraకెఫే డే సీఈఓగా మాళవికకెఫే డే సీఈఓగా మాళవికcafeday;auto;editor mohan;krishna;malavika new;siddhartha;tara;2019;december;karnataka 1;wife;coffee;mangalore;sakshi;v;raghavendraTue, 08 Dec 2020 09:54:29 GMTకాఫీ డే సీఈఓగా మాళవిక

కెఫే కాఫీ డే
 ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెడ్గే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కాఫీ డే సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. ఆయన మరణం తర్వాత గతేడాది జూలైలో స్వతంత్ర బోర్డు సభ్యుడు ఎస్‌.వి. రంగనాథ్‌ని తాత్కలిక చైర్మన్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో నిన్న ఆయన భార్య మాళవిక హెగ్డేని సీఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
మాళవిక
కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కుమార్తె. అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆమె గతంలోనే చెప్పారు. కాగా కంపెనీ అదనపు డైరెక్టర్లుగా సీహెచ్ వసుంధరా దేవి, గిరి దేవనూర్, మోహన్ రాఘవేంద్ర కొండిలను నియమిస్తూ బోర్డు డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ ముగ్గురూ 2025 డిసెంబర్ 31 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల హోదాలో కొనసాగుతారు. 2019 జూలైలో వీజీ సిద్ధార్థ మృతి చెందగా.. ఆత్మహత్యే ఆయన మరణానికి కారణమని అంతా భావిస్తున్నారు. సిద్ధార్థ మరణించే సమయానికే కంపెనీకి అప్పుల భారం మొదలుకాగా... ఆయన చనిపోయిన నాటి నుంచి గత ఏడాదిగా అప్పులు తీర్చే ప్రయత్నాల్లో సీడీఈఎల్ తలమునకలవుతూ వస్తోంది




రైతు బంద్.. బ్యాంకుల పరిస్థితేంటి..?

స్పేస్‌ఎక్స్ సంస్థలో తెలుగు కిరణం.. మిషన్ హెడ్ హోదాలో ఉద్యోగం!

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>