MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-konidela-weddingfe0b9299-5f51-4143-88d2-a4b0d44d12e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-konidela-weddingfe0b9299-5f51-4143-88d2-a4b0d44d12e4-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ డిసెంబర్ 9వ తేదిన రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక పెళ్లి జరగనుంది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ లో జరగబోయే ఈ వేడుకకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తైపోయాయి.దానికితోడు మెగా కుటుంబం, అల్లు కుటుంబం, జొన్నలగడ్డ కుటుంబం అంతా అక్కడికి చేరుకున్నారు.మెగా హీరోలు అల్లు అర్జున్ తన కుటుంబం తో కలిసి ఓ చార్టెట్ విమానంలో రాజస్థాన్ చేరుకున్నారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు రామ్ చరణ్ కూడా niharika konidela wedding;chiranjeevi;venkatesh;rana;ram charan teja;nithin;allu arjun;naga chaitanya;nageshwara rao akkineni;niharika konidela;ram pothineni;uday kiran;varun;varun sandesh;varun tej;rajasthan;tollywood;upasana;konidela production;marriage;december;dance;wife;hero;daggubati venkateswara rao;heroine;yuva;arjun 1;nithin reddy;v;loverనిహారిక పెళ్లికి టాలీవుడ్ తరుపున హాజరయ్యే హీరోయిన్లు ఇద్దరేనట.. వాళ్లేవారంటే..??నిహారిక పెళ్లికి టాలీవుడ్ తరుపున హాజరయ్యే హీరోయిన్లు ఇద్దరేనట.. వాళ్లేవారంటే..??niharika konidela wedding;chiranjeevi;venkatesh;rana;ram charan teja;nithin;allu arjun;naga chaitanya;nageshwara rao akkineni;niharika konidela;ram pothineni;uday kiran;varun;varun sandesh;varun tej;rajasthan;tollywood;upasana;konidela production;marriage;december;dance;wife;hero;daggubati venkateswara rao;heroine;yuva;arjun 1;nithin reddy;v;loverTue, 08 Dec 2020 19:00:00 GMTనిహారిక కొణిదెల పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ డిసెంబర్ 9వ తేదిన రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక పెళ్లి జరగనుంది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ లో జరగబోయే ఈ వేడుకకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తైపోయాయి.దానికితోడు మెగా కుటుంబం, అల్లు కుటుంబం, జొన్నలగడ్డ కుటుంబం అంతా అక్కడికి చేరుకున్నారు.మెగా హీరోలు అల్లు అర్జున్ తన కుటుంబం తో కలిసి ఓ చార్టెట్ విమానంలో రాజస్థాన్ చేరుకున్నారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు రామ్ చరణ్ కూడా భార్య ఉపాసన తో రాజస్థాన్ బయలుదేరి వెళ్ళారు.ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సోమవారం రాత్రి నిహారిక చైతుల సంగీత్ కార్యక్రమం జరిగింది.

ఈ సంగీత్‌లో చిరంజీవి సాంగ్స్‌కు నిహారిక, చైతులు కలిసి స్టెప్పులు అదరగొట్టారు. వీరితో పాటు మెగా, అల్లు ఫ్యామిలీలోని చిన్నారులు కూడా చిరంజీవి పాటలకు డ్యాన్సులు చేసి అలరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం నిహారిక-చైతు వివాహానికి మెగా కుటుంబం కాకుండా కేవలం వారు 120 మందిని మాత్రమే ఆహ్వానించారట. పైగా వారికి ప్రత్యేకంగా చేయించిన పట్టు వస్త్రాలతో వారంతా రానున్నారని తెలుస్తుంది. ఈ పెళ్లి కి సంబంధించిన పూర్తి బాధ్యతలు నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ దగ్గరుండి మరి చూసుకుంటున్నాడు.

అలాగే నిహారిక పెళ్లికి టాలీవుడ్ నుంచి ఓ ఇద్దరు హీరోయిన్లకు ఆహ్వానం అందిందట. వారెవరో కాదు.. ప్రముఖ హీరోయిన్స్ లావణ్య త్రిపాఠి, రీతూ వర్మలు. వారిద్దరూ కూడా నిహారిక వివాహానికి హాజరు కానున్నారని తెలుస్తోంది.మరి వీళ్ళిద్దరే కాకుండా హీరోయిన్లలో ఇంకెవరైనా ఈ పెళ్లికి అటెండ్ అవుతారా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక యువ హీరోలలో మాత్రం వరుణ్ తేజ్ ఆహ్వానం మేరకు లవర్ బాయ్ నితిన్, దగ్గుబాటి హీరో రాణా, అక్కినేని వారసుడు నాగచైతన్యలు తమ తమ ఫ్యామిలీస్ తో ఈ పెళ్లికి వచ్చి కనువిందు చేయనున్నారని సమాచారం.అంతేకాకుండా ఇండ్రస్టీ నుంచి పలువురు దర్శకులు, నిర్మాతలు సైతం ఈ వివాహ వేడుకకు హాజరు కానున్నారు...!!


ఏలూరు ఘటనపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్న పవన్

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>