PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr9e0bd2dc-9df2-4342-a91c-6332bcede165-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr9e0bd2dc-9df2-4342-a91c-6332bcede165-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఇప్పుడు తెరాస పార్టీని భారతీయ జనతా పార్టీ ఎక్కువగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెరాస పార్టీ కొన్ని కొన్ని అంశాల్లో చేస్తున్న తప్పులను భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ప్రస్తావిస్తుంది. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెరాస ను టార్గెట్ చేసారు. రైతులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ దార్ల సమస్యలపై ఉద్యమం చేస్తామంటోన్న బండి సంజయ్... బీజేపీ చేయబోయే ఉద్యమాలకు సైతం తెలంగాణ పోలీసులు సహకరించాలి అని ఆయన కోరారు. బంద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి? అని డిమాండ్ చేసాkcr;kcr;amala akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;government;police;chief minister;pistachio;traffic police;house;party;mantraబంద్ లో కేసీఆర్ ఎందుకు లేరు...?బంద్ లో కేసీఆర్ ఎందుకు లేరు...?kcr;kcr;amala akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;government;police;chief minister;pistachio;traffic police;house;party;mantraTue, 08 Dec 2020 17:53:22 GMTతెరాస పార్టీని భారతీయ జనతా పార్టీ ఎక్కువగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెరాస పార్టీ కొన్ని కొన్ని అంశాల్లో చేస్తున్న తప్పులను భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ప్రస్తావిస్తుంది. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెరాస ను టార్గెట్ చేసారు. రైతులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ దార్ల సమస్యలపై ఉద్యమం చేస్తామంటోన్న బండి సంజయ్... బీజేపీ చేయబోయే ఉద్యమాలకు సైతం తెలంగాణ పోలీసులు సహకరించాలి అని ఆయన కోరారు. బంద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి? అని డిమాండ్ చేసారు.

సన్న వడ్లకు రూ. 2వేల 500 చెల్లించే వరకు పోరాటం చేస్తాం అని స్పష్టం చేసారు. తెలంగాణ కౌలు రైతులకు సైతం రైతుబంధు అమలు చేయాలి అని డిమాండ్ చేసారు. సన్న వడ్లు పేరుతో ముఖ్యమంత్రి విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డాడు అని మండిపడ్డారు. టీఎన్జీవో నాయకులు ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళు తాగుతున్నారు ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై టీఎన్జీవో నాయకులు ఎందుకు స్పందించటం‌ లేదు? అని నిలదీశారు. ఐఆర్, పీఆర్సీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తు.. కేంద్రానికి వ్యతిరేకంగా బంద్ చేయటాన్ని ఖండిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులను సస్పెండ్ చేయాలని లీగల్ పోరాటం చేస్తాం అని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు వ్యక్తిగత సంపాదనకే పరిమితమయ్యారు అని విమర్శించారు. ఓటింగ్ ద్వారా మాత్రమే ఉద్యోగ సంఘాల నాయకులను ఎన్నుకోవాలి అని ఆయన సూచించారు. బంద్ చేసిన మంత్రులను ఎందుకు హౌస్ అరెస్టు చేయలేదో పోలీస్ అధికారులు చెప్పాలి అని నిలదీశారు. బీజేపీ ఆందోళనలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు చుక్కులు చూపిస్తాం అన్నారు. వరద భాదితులను ఆదుకునే వరకు ప్రభుత్వంపై బీజేపీ పోరాటం చేస్తోంది అన్నారు.


యాంకర్ ఝాన్సీ జీవితంలో అతి పెద్ద షాక్ అంటే ఇదే..!

మాస్ మహారాజా చేతిలో ఓడిపోయి.. వీడియో షేర్ చేసిన శృతి హాసన్!

నిహారిక పెళ్లిపై మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్..!!

ఆ జిల్లాలో యువనేత తప్పు... బాబు కొంప ముంచుతుందా...?

భిక్షాటన చేస్తున్న ఐఐటీ పూర్వ విద్యార్థి

బ్రేకింగ్: జనసేన బిజెపి అత్యవసర సమావేశం... ఎందుకు...?

స్వార్థం కోసం రైతుల నోట్లో మట్టికొడుతున్నారు: కిషన్ రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>