Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash-noel0a64c7b7-4106-4ff5-8ea6-69001ad0e813-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash-noel0a64c7b7-4106-4ff5-8ea6-69001ad0e813-415x250-IndiaHerald.jpgఅంతకుముందు మూడు సీజన్లు జరిగినా ఈటివి జబర్దస్త్ నుండి ఒక్కరు కూడా బిగ్ బాస్ షోకి రాలేదు. జబర్దస్త్ కమెడియన్స్ కు భారీ పారితోషికం ఇస్తామని చెప్పినా వారు మాత్రం బిగ్ బాస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అంతేకాదు వారి షోలో బిగ్ బాస్ మీద పంచులు కూడా వేశారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 లో ఆ సెంటిమెంట్ కు బ్రేక్ వేశాడు జబర్దస్త్ మాస్ అవినాష్. అతను బిగ్ బాస్ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు.avinash-noel;dr rajasekhar;devineni avinash;bigboss;jabardasth;episode;comedy;joker;etv;massఅవినాష్ గ్రాఫ్ పడిపోయేలా చేసిన ఆ కామెంట్స్.. లేదంటే సీన్ వేరేలా ఉండేదా..!అవినాష్ గ్రాఫ్ పడిపోయేలా చేసిన ఆ కామెంట్స్.. లేదంటే సీన్ వేరేలా ఉండేదా..!avinash-noel;dr rajasekhar;devineni avinash;bigboss;jabardasth;episode;comedy;joker;etv;massMon, 07 Dec 2020 11:00:00 GMTఈటివి జబర్దస్త్ నుండి ఒక్కరు కూడా బిగ్ బాస్ షోకి రాలేదు. జబర్దస్త్ కమెడియన్స్ కు భారీ పారితోషికం ఇస్తామని చెప్పినా వారు మాత్రం బిగ్ బాస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అంతేకాదు వారి షోలో బిగ్ బాస్ మీద పంచులు కూడా వేశారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 లో ఆ సెంటిమెంట్ కు బ్రేక్ వేశాడు జబర్దస్త్ మాస్ అవినాష్. అతను బిగ్ బాస్ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు.

జోకర్ అంటూ తనని తాను పరిచయం చేసుకుని హౌజ్ లోకి వెళ్లిన అవినాష్ తన కామెడీతో అందరిని మెప్పించాడు. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 4లో బెస్ట్ ఎంటర్టైనర్ గా హోస్ట్ నాగార్జుననే చెప్పడం జరిగింది. రెండో వారం ఎండింగ్ లో వచ్చిన అవినాష్ 13వ వారం వరకు ఉన్నాడు. అయితే అవినాష్ గ్రాఫ్ పెరుగుతున్న టైం లో నోయెల్ వెళ్లేముందు చేసిన వ్యాఖ్యలు షాక్ అనిపించాయి. అవినాష్ చేసేది చిల్లర కామెడీ అనడంపై అవినాష్ బాగా హర్ట్ అయ్యాడు. ఆ తర్వాత అదే విషయంపై హౌజ్ లో కూడా గొడవలు జరిగాయి.

ఎపిసోడ్ తర్వాత నుండి అవినాష్ కూడా ప్రతి విషయానికి చిరాకు పడటం స్టార్ట్ చేశాడు. హౌజ్ లో ఎప్పుడూ కామెడీ చేస్తూ వచ్చిన అవినాష్ నోయెల్ ఎపిసోడ్ తర్వాత ఎక్కువగా సీరియస్ అవుతూ వచ్చాడు. ఏదో బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు మాత్రం నవ్వించాడు. సీజన్ 4 లో టాప్ 5లో ఉంటాడనుకున్న అవినాష్ ముందు వారమే సర్ధేసుకోవాల్సి వచ్చింది. నోయెల్ ఎపిసోడ్ జరగకపోయుంటే మాత్రం అవినాష్ గ్రాఫ్ వేరేలా ఉండేదని చెబుతున్నారు. నోయెల్ వెళ్లే వాడు వెళ్లక అవినాష్, అమ్మా రాజశేఖర్ లను బ్యాడ్ చేసి వెళ్లడం హౌజ్ లో వారి ఆట మీద ఎఫెక్ట్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు.




వచ్చే అసెంబ్లీ కోసం బీజేపీ ఇప్పటినుంచే ఆకర్షించే ప్రయత్నం..?

రేపు భారత్ బంద్...వెల్లువెత్తుతున్న విపక్షాల మద్దతు

బాలీవుడ్‌లో మహిళలకు ప్రాధాన్యం పెరిగింది.. వెల్లడించిన నటి

చంద్రబాబుకు మా చెడ్డ ట్రబులొచ్చింది..?

లోకేష్ లో నిజంగా ఇంత చలనం ఎలా వచ్చింది..?

పాకిస్థాన్‌లో ఘోరం.. పెళ్లి చేసుకోనన్న క్రిస్టియన్ మహిళను దారుణంగా..

ఆ రెండు సినిమాలను అక్క‌డే ప్లాన్ చేసిన నితిన్‌..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>