EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-sabbam-developed-this-much-grudge-on-jaganff5cc47d-500b-48d2-90e3-0cde42ad6916-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-sabbam-developed-this-much-grudge-on-jaganff5cc47d-500b-48d2-90e3-0cde42ad6916-415x250-IndiaHerald.jpgసబ్బం లెక్కేమిటంటే ఏపిలో కూడా జగన్ పై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయిందట. తన అంచనాకు ఆధారాలు ఏమిటయ్యా అంటే మళ్ళీ సమాధానం చెప్పడు. కానీ వ్యతిరేకత మాత్రం పెరిగిపోతోందంటాడు. ఏపిలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే ఇక తిరుగుండదన్నట్లుగా చెప్పేశాడు. ఎల్లోమీడియాతో మాట్లాడుతూ జగన్ పైన తనలోని ఆక్రోసాన్నంతా కక్కేశాడు. కేసీయార్-జగన్లలో గెలుపు గర్వం పెరిగిపోయిందని తేల్చేశాడు. ప్రత్యేకహోదా, అమరావతి, ఇసుక, మద్యం, రాజధాని తదితర నిర్ణయాల వల్ల జగన్ అంటే జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందట. ఇంట్లో నుండి కాలుకూడా బయటపెsabbamhari vizag jagan chandrababu bjp pawan;cbn;kcr;tiru;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;jagan;amaravati;n. chandrababu naidu;janasena;mp;tirupati;kanna lakshminarayana;capital;husband;tdp;janasena party;sabbam hariహెరాల్డ్ ఎడిటోరియల్ : సబ్బంలో ఎంత కసి పేరుకుపోయిందో ?హెరాల్డ్ ఎడిటోరియల్ : సబ్బంలో ఎంత కసి పేరుకుపోయిందో ?sabbamhari vizag jagan chandrababu bjp pawan;cbn;kcr;tiru;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;jagan;amaravati;n. chandrababu naidu;janasena;mp;tirupati;kanna lakshminarayana;capital;husband;tdp;janasena party;sabbam hariMon, 07 Dec 2020 05:00:00 GMTఉత్తరాంధ్రకు చెందిన అక్టోపస్ గా ప్రచారంలో ఉన్న మాజీ ఎంపి సబ్బంహరికి జగన్మోహన్ రెడ్డిపై రోజురోజుకు కసి పేరుకుపోతున్నట్లే ఉంది. జగన్ను ఏదో చేసేయాలన్న కసి సబ్బంలో బాగా పెరిగిపోతోంది. అయితే ఆ కసి ఎలా తీర్చోవాలో తెలీక చివరకు ఎల్లోమీడియాను వేదికగా చేసుకున్నారు. ప్రతిరోజు ఎల్లోమీడియా ఛానళ్ళలలోను, దినప్రతికల్లోను రెచ్చిపోతు జగన్ పైకి జనాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నోరిప్పితే జగన్ పై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోవటమే టార్గెట్ గా పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. తాజగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కేసీయార్ కు వ్యతిరేకంగా జనాలు తీర్పిచ్చిన విషయం తెలిసిందే. జనాలు వేసిన వ్యతిరేక ఓట్లతో టీఆర్ఎస్ కు చావు తప్పి కన్నులొట్టబోయినట్లయ్యింది. గ్రేటర్ ఫలితాన్ని సబ్బం ఏపితో లింక్ పెట్టేయటమే ఆయనలో పెరిగిపోతున్న కసికి నిదర్శనం.




సబ్బం లెక్కేమిటంటే ఏపిలో కూడా జగన్ పై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయిందట. తన అంచనాకు ఆధారాలు ఏమిటయ్యా అంటే మళ్ళీ సమాధానం చెప్పడు. కానీ వ్యతిరేకత మాత్రం పెరిగిపోతోందంటాడు. ఏపిలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే ఇక తిరుగుండదన్నట్లుగా చెప్పేశాడు. ఎల్లోమీడియాతో మాట్లాడుతూ జగన్ పైన తనలోని ఆక్రోసాన్నంతా కక్కేశాడు. కేసీయార్-జగన్లలో గెలుపు గర్వం పెరిగిపోయిందని తేల్చేశాడు. ప్రత్యేకహోదా, అమరావతి, ఇసుక, మద్యం, రాజధాని తదితర నిర్ణయాల వల్ల జగన్ అంటే జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందట. ఇంట్లో నుండి కాలుకూడా బయటపెట్టని సబ్బం తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో వ్యతిరేకత కనబడుతుందని జోస్యం కూడా చెప్పేయటమే విచిత్రం. నియంత ఆలోచనలు కలిగిన, సమస్యలపై అవగాహన లేని, వ్యవస్ధల పట్ల అవగాహన లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు సబ్బం జనాలపైన కూడా మండిపోయారు.




ఇక్కడ సబ్బం మరచిపోయిందేమంటే తాను చెప్పిన లక్షణాలు పెరిగిపోవటం వల్లే జనాలు చంద్రబాబునాయుడును అధికారంలో నుండి దింపేశారు. కూడా ఇవే లక్షణాలు ఉన్నాయని అనుకుంటే జగన్ను కూడా దింపేస్తారు. ఎవరికి అధికారం అప్పగించాలో ఎవరిని ఎప్పుడు దించేయాలో సబ్బం కన్నా జనాలకే బాగా తెలుసు. మొన్నటి ఎన్నికల్లో భీమిలీ నుండి టీడీపీ తరపున పోటీ చేసిన తనను జనాలు ఎందుకు ఓడగొట్టారో సబ్బం ఒకసారి విశ్లేషించుకుంటే బాగుంటుంది. ఆరేళ్ళు అధికారంలో ఉన్న కేసీయార్ ఒంటెత్తు పోకడలు పోతున్నందు వల్లే జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. కానీ జగన్ లో ఆ పోకడ కనబడటం లేదు. జగన్ మీద జనాల్లో వ్యతిరేకత పెరగాల్సిన అవసరం ఇప్పటికిప్పుడైతే లేదు. అయితే ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉండే జనాలు ఎప్పటికీ ఉంటారు. జగన్ పై ఇపుడు వ్యతిరేకత అంతా ఎల్లోమీడియాలోను, చంద్రబాబు+టీడీపీ నేతల్లో మాత్రమే కనబడుతోంది. పాపం సబ్బం మాత్రం ఏదో భ్రమల్లో ఉంటు తమ అధినేత లాగే రోజులు గడిపేస్తున్నారు.






హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జమ్మలమడుగులో ఇంకా ఛాన్స్ లేదా?

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>