MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/with-prabhas-not-ntr-prashanth-neel81eadfd6-aabb-4239-a4ef-3383c3d266c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/with-prabhas-not-ntr-prashanth-neel81eadfd6-aabb-4239-a4ef-3383c3d266c8-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రశాంత్‌ నీల్ మాత్రం తారక్ ప్రాజెక్ట్‌ని పక్కనపెట్టి ప్రభాస్‌తో సినిమా అనౌన్స్‌ చేశాడు. మరి పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌ ఉందనే ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌తో సినిమా అనౌన్స్‌ చేశాడా? లేకపోతే తారక్‌ కంటే బాహుబలితో సినిమా చేయడమే బెటర్‌ అనుకున్నాడా అనే అనుమానం కలుగుతోంది. with prabhas not ntr prashanth neel;ntr;prabhas;jr ntr;kranthi;kranti;prasanth;prashanth neel;makar sakranti;cinema;sankranthi;bahubali;director;hero;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishor;massఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!with prabhas not ntr prashanth neel;ntr;prabhas;jr ntr;kranthi;kranti;prasanth;prashanth neel;makar sakranti;cinema;sankranthi;bahubali;director;hero;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishor;massMon, 07 Dec 2020 20:00:00 GMTజూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రశాంత్‌ నీల్ మాత్రం తారక్ ప్రాజెక్ట్‌ని పక్కనపెట్టి ప్రభాస్‌తో సినిమా అనౌన్స్‌ చేశాడు. మరి పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌ ఉందనే ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌తో సినిమా అనౌన్స్‌ చేశాడా? లేకపోతే తారక్‌ కంటే బాహుబలితో సినిమా చేయడమే బెటర్‌ అనుకున్నాడా అనే అనుమానం కలుగుతోంది.  

ప్రశాంత్ నీల్‌ 'కె.జి.ఎఫ్.2' తర్వాత జూ.ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాడని, మైత్రీ మూవీ మేకర్స్‌లో ఈ సినిమా ఉంటుందని ఫిల్మ్‌ సర్కిల్స్‌లో చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ప్రశాంత్‌ నీల్ కూడా తారక్‌ బర్త్‌డే టైమ్‌లో న్యూక్లియర్ ప్లాంట్‌ని కలిశానని, నెక్ట్స్‌ టైమ్‌ రేడియేషన్‌ సూట్‌తో మీట్‌ అవుతానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీళ్లిద్దరి కాంబోలో సినిమా కన్ఫార్మ్ అని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ప్రభాస్‌తో 'సలార్' అనే మూవీ అనౌన్స్‌ చేశాడు ప్రశాంత్ నీల్.

ప్రశాంత్‌ నీల్‌కి సెకండ్‌ మూవీ 'కె.జి.ఎఫ్'తోనే సూపర్‌ క్రేజ్ వచ్చింది. మాస్ యాక్షన్‌ డైరెక్టర్ అనే ప్రశంసలు వచ్చాయి. ఇక ప్రభాస్‌ 'బాహుబలి'తో సూపర్‌ హీరోగా మారిపోయాడు. యాక్షన్‌ స్టోరీస్‌కి పర్ఫెక్ట్‌ కటౌట్ అనే కామెంట్స్ వచ్చాయి. అందుకే యాక్షన్‌ జానర్‌లో సినిమాలు చేసే ప్రశాంత్ నీల్‌, యంగ్‌ రెబల్‌ స్టార్‌తో సినిమాని ఓకే చేసుకున్నాడట. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి సెట్స్‌కి వెళ్లబోతోంది.

'సలార్' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తోనే ఈ సినిమా 'కె.జి.ఎఫ్.' రేంజ్‌లో ఉంటుందని చెప్పేశాడు ప్రశాంత్ నీల్. సబ్జెక్ట్ మాత్రమే కాదు, హీరో లుక్‌ కూడా సిమిలర్‌గా ఉంటుందని హింట్స్‌ ఇచ్చాడు. 'కె.జి.ఎఫ్'లో యశ్‌ గుబురు గడ్డం, మీసాలతో కనిపించినట్లే, 'సలార్‌'లో ప్రభాస్‌ కూడా గుబురు మీసాలతో కనిపిస్తున్నాడు. మరి హీరో మేకోవర్ నుంచి సబ్జెక్ట్‌ వరకు అంతా ప్రశాంత్‌ నీల్‌ స్కూల్‌లోనే కనిపిస్తోన్న ఈ 'సలార్'తో ప్రభాస్‌ ఎలాంటి మేజిక్స్‌ చేస్తాడో చూడాలి.


రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?

శీతాకాలంలో ఈ సూప్ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..?

ఖమ్మం జిల్లా మీద కేటిఅర్ ఫోకస్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>