MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-chit-chat-with-her-fans-in-social-media76eba5aa-270c-4de9-b445-e2bc5a87ed42-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-chit-chat-with-her-fans-in-social-media76eba5aa-270c-4de9-b445-e2bc5a87ed42-415x250-IndiaHerald.jpgకన్నడ భామ అనుష్క శెట్టి తన సొంత భాషలో కంటే ఇతర భాషలోనే సినిమాలు చేసి ఫేమస్ అయింది. టాలీవుడ్ లో సూపర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం సూపర్ స్టార్ పొజిషన్లో ఉంది. అయితే ఈమె కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈమె మరో చరిత్రాత్మక పాత్రలో నటిస్తోందని అంటున్నారు. నిజానికి ఈమె కొన్నేళ్ల క్రితం గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమదేవి అనే సినిమాలో రాణి రుద్రమదేవి పాత్రలో నటించి మెప్పించింది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా నిరాశ పరిచినా సరే సినిమా పరంగా చూస్తే ఈ సtollywood;anoushka;anushka;bhama;jeevitha rajaseskhar;rani;sekhar;india;karnataka - bengaluru;portugal;tollywood;cinema;rajani kanth;media;tamil;kannada;rudramadeviమరోసారి అదే చేస్తున్న అనుష్క.. వర్కౌట్ అవుతుందామరోసారి అదే చేస్తున్న అనుష్క.. వర్కౌట్ అవుతుందాtollywood;anoushka;anushka;bhama;jeevitha rajaseskhar;rani;sekhar;india;karnataka - bengaluru;portugal;tollywood;cinema;rajani kanth;media;tamil;kannada;rudramadeviMon, 07 Dec 2020 07:00:00 GMTకన్నడ భామ అనుష్క శెట్టి తన సొంత భాషలో కంటే ఇతర భాషలోనే సినిమాలు చేసి ఫేమస్ అయింది. టాలీవుడ్ లో సూపర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం సూపర్ స్టార్ పొజిషన్లో ఉంది. అయితే ఈమె కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈమె మరో చరిత్రాత్మక పాత్రలో నటిస్తోందని అంటున్నారు. నిజానికి ఈమె కొన్నేళ్ల క్రితం గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమదేవి అనే సినిమాలో రాణి రుద్రమదేవి పాత్రలో నటించి మెప్పించింది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా నిరాశ పరిచినా సరే సినిమా పరంగా చూస్తే ఈ సినిమా చాలా మందికి నచ్చింది. 

అయినా పరిమితికి మించి బడ్జెట్ లు పెట్టడంతో కలెక్షన్ల విషయంలో నిర్మాతలు దారుణంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈమె ప్రధాన పాత్రలో మరో చారిత్రాత్మక సినిమా ప్లాన్ చేశారని తెలుస్తోంది. అబ్బక్క అనే పేరుతో మూడు రోజుల క్రితం కన్నడ దర్శకుడు మన్సూర్ ఒక సినిమా ప్రకటించాడు. కర్ణాటక ప్రాంతానికి చెందిన రాణి అబ్బక్క చౌతా జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె మంగుళూరు ప్రాంతాన్ని పరిపాలించిన రాణుల్లో ఒకరు. తొలి తరం స్వాతంత్ర యోధురాలిగా కూడా ఈమెను పేర్కొంటూ ఉంటారు. భారత్ ను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన పోర్చుగల్ వారితో ఈమె దాదాపు నలభై ఏళ్ల పాటు వారిని నిలువరించినదని చెప్పేవారు.

అంతటి మహాయోధురాలి పాత్రలోనే ఇప్పుడు అనుష్క శెట్టి నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకి ఇంకా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అందుకే ఎవరి పేరును ప్రస్తావించకుండా డైరెక్ట్ గా సినిమా అనౌన్స్ చేశారని మరో ప్రచారం కూడా ఉంది. అయితే ఒక సారి చరిత్రాత్మక పాత్ర చేస్తే అది కలిసి రాకపోవడంతో ఈ సినిమా ఆమె చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాను తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దాదాపుగా అనుష్క ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కన్నడ సినీ మీడియా వర్గాల సమాచారం.


మేయర్ పదవికి ఇంతమందా ? అలా ఇరుక్కుపోయిన కేసిఆర్ ?

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>