MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajendra-prasad-bjp-partye563c97b-db90-4797-9028-3b91422ffb93-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajendra-prasad-bjp-partye563c97b-db90-4797-9028-3b91422ffb93-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో తనదైన ఆకట్టుకునే నటన, హాస్యంతో నటకిరీటి గా గొప్ప పేరు దక్కించుకుని ఎందరో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. కొన్నేళ్ల క్రితం సినిమా పరిశ్రమలోకి చిన్న నటుడిగా పరిచయం అయిన రాజేంద్ర ప్రసాద్ తొలిసారిగా బాపు దర్శకత్వంలో రూపొందిన స్నేహం సినిమా ద్వారా అరంగేట్రం చేసారు. ఆ తరువాత కృష్ణ నటించిన రామరాజ్యంలో భీమరాజులో ఆయన పోషించిన పాత్రకు మంచి పేరు దక్కింది. అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన రాజేంద్ర ప్రసాద్ ఆపై rajendra prasad;bjp party;modi;krishna;prasad;rajendra prasad;vamsi;bharatiya janata party;somu veerraju;andhra pradesh;narendra modi;tollywood;cinema;smart phone;prime minister;comedy;allu sneha;babu rajendra prasad;party;jandhyala ravishankar;narendraబ్రేకింగ్ : బిజెపి లో చేరనున్న నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ....??బ్రేకింగ్ : బిజెపి లో చేరనున్న నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ....??rajendra prasad;bjp party;modi;krishna;prasad;rajendra prasad;vamsi;bharatiya janata party;somu veerraju;andhra pradesh;narendra modi;tollywood;cinema;smart phone;prime minister;comedy;allu sneha;babu rajendra prasad;party;jandhyala ravishankar;narendraMon, 07 Dec 2020 16:38:16 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో తనదైన ఆకట్టుకునే నటన, హాస్యంతో నటకిరీటి గా గొప్ప పేరు దక్కించుకుని ఎందరో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. కొన్నేళ్ల క్రితం సినిమా పరిశ్రమలోకి చిన్న నటుడిగా పరిచయం అయిన రాజేంద్ర ప్రసాద్ తొలిసారిగా బాపు దర్శకత్వంలో రూపొందిన స్నేహం సినిమా ద్వారా అరంగేట్రం చేసారు. ఆ తరువాత కృష్ణ నటించిన రామరాజ్యంలో భీమరాజులో ఆయన పోషించిన పాత్రకు మంచి పేరు దక్కింది. అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన రాజేంద్ర ప్రసాద్ ఆపై వంశీ, జంధ్యాల, ఇవివి సత్యనారాయణ, రేలంగి నరసింహారావు వంటి దర్శకులతో ఎన్నో గొప్ప హాస్యభరిత సినిమాలు చేసి భారీ విజయాలు అందుకున్నారు.

ఇక అక్కడి నుండి మరింత వేగవంతంగా కెరీర్ పరంగా దూసుకెళ్లిన రాజేంద్ర ప్రసాద్ ఆపై కొన్ని ఫ్యామిలీ, కమర్షియల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు కూడా చేసారు. ఇక ఇటీవల పలు సినిమాల్లో మంచి ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేస్తూ కొనసాగుతున్న రాజేంద్ర ప్రసాద్, అతి త్వరలో బీజేపీ పార్టీలో చేరనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. నేడు ఆయనను తన స్వగృహంలో ప్రముఖ నటి హేమతో కలిసి ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రత్యేకంగా కలిసి కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. కొద్దిరోజల నుండి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న పలు కార్యక్రమాల పట్ల ఎంతో సంతృప్తి చెందిన రాజేంద్ర ప్రసాద్, ఇటీవల సోము వీర్రాజుని ఫోన్ లో సంప్రదించారని, అందువల్లనే ఆయన నేడు రాజేంద్ర ప్రసాద్ ని స్వయంగా కలుసుకోవడానికి వారి ఇంటికి వచ్చారని అంటున్నారు.

ఇక వీరిద్దరి మధ్య పార్టీ విషయమై చర్చ రావడం, అలానే మాటల సందర్భంలో రాజేంద్రప్రసాద్ ని బిజెపిలోకి వీర్రాజు ఆహ్వానించినట్లు చెప్తున్నారు. అయితే కొందరు రాజేంద్ర ప్రసాద్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి నేడు వీర్రాజు కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే రాజేంద్ర ప్రసాద్ ని కలవడానికి ఇంటికి వెళ్లారని, అలానే వారిద్దరి మధ్యన ఎటువంటి రాజకీయ చర్చలు జరుగలేదని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వీరిద్దరి కలయిక పలు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు తావిస్తోంది.....!! 


కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?

పెదనాన్న.. నేను.. ఓ సెల్ఫీ..

ఎన్నికల సంఘంపై బీజేపీ ఫిర్యాదు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>