MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sridevis-youngest-daughter-pelli-sandadi61ef6166-92a6-40f5-b4c0-e250f7a7c86b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sridevis-youngest-daughter-pelli-sandadi61ef6166-92a6-40f5-b4c0-e250f7a7c86b-415x250-IndiaHerald.jpgశ్రీదేవి పెద్ద కూతురు వస్తోంది.. తెలుగు సినిమా చేస్తుందని చాలా రోజులుగా చెబుతున్నారు. కానీ ఇప్పటికీ జాన్వీ కపూర్‌ ఎంట్రీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అక్క కాదు గానీ, చెల్లి వస్తుందని కొత్త ప్రచారం మొదలయింది. ఖుషీ కపూర్‌ తెలుగు లాంచింగ్‌ కన్ఫార్మ్ అయ్యిందని చెబుతున్నారు సినీజనాలు. sridevis youngest daughter pelli sandadi;boney kapoor;sridevi kapoor;kushi;malavika new;malavika nair;roshan;janvi;cinema;telugu;marriage;father;jhanvi kapoorశ్రీదేవి చిన్న కూతురు 'పెళ్లి సందడి'శ్రీదేవి చిన్న కూతురు 'పెళ్లి సందడి'sridevis youngest daughter pelli sandadi;boney kapoor;sridevi kapoor;kushi;malavika new;malavika nair;roshan;janvi;cinema;telugu;marriage;father;jhanvi kapoorMon, 07 Dec 2020 22:00:00 GMTశ్రీదేవి పెద్ద కూతురు వస్తోంది.. తెలుగు సినిమా చేస్తుందని చాలా రోజులుగా చెబుతున్నారు. కానీ ఇప్పటికీ జాన్వీ కపూర్‌ ఎంట్రీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అక్క కాదు గానీ, చెల్లి వస్తుందని కొత్త ప్రచారం మొదలయింది. ఖుషీ కపూర్‌ తెలుగు లాంచింగ్‌ కన్ఫార్మ్ అయ్యిందని చెబుతున్నారు సినీజనాలు.

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాక, ఈమెని తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. జాన్వీ వచ్చేస్తుంది, తల్లి లెగసీని కంటిన్యూ చేస్తుందనే డైలాగులు కూడా వినిపించాయి. అయితే జాన్వీని హైదరాబాద్‌ తీసుకురావాలని ఎంతమంది ప్రయత్నం చేసినా, వర్కవుట్‌ కాలేదు. తండ్రి బోనీ కపూర్‌ వచ్చి తెలుగు సినిమాలు నిర్మిస్తున్నా, జాన్వీ మాత్రం తెలుగు సినిమాల్లోకి రావడం లేదు.

జాన్వీ కపూర్‌కి హిందీలో పెద్దగా సినిమాల్లేకపోయినా తెలుగుకి రావడం లేదు. నార్త్‌కే ఫిక్స్ అయిపోయింది. అయితే అక్క అడుగుపెట్టని తెలుగు సినిమాల్లోకి చెల్లెలు ఖుషీ కపూర్‌ వస్తుందని ప్రచారం జరుగుతోంది. తల్లి శ్రీదేవికి సూపర్‌ హిట్‌ సినిమాలిచ్చిన రాఘవేంద్రరావు సినిమాతో కూతురు ఖుషీ టాలీవుడ్‌కి వస్తుందట.

రాఘవేంద్రరావు, శ్రీకాంత్‌ కాంబోలో వచ్చిన 'పెళ్లిసందడి'ని శ్రీకాంత్‌ కొడుకు రోషన్ హీరోగా రీమేక్‌ చేస్తున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తోన్న ఈ మూవీలో ఖుషీ కపూర్‌ ఒక హీరోయిన్‌గా చేస్తుందట. ఒరిజినల్‌లో రవళి, దీప్తీ భట్నాగర్‌ ప్లే చేసిన క్యారెక్టర్‌ని రీమేక్‌లో మాళవిక నాయర్, ఖుషీ చేస్తారని టాక్. అయితే ఖుషీ, అతిలోకసుందరి వారసురాలైనా, ఫేస్‌లో ఆ వారసత్వం కనిపించదని చాలా ట్రోల్ వచ్చాయి. మరి ఇలాంటి ఖుషీ హీరోయిన్‌గా చేస్తుందా, చేసినా ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేస్తారా అనేది చూడాలి. మొత్తానికి పెళ్లి సందడిలో శ్రీదేవి చిన్నకూతురు సందడి చేయనుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. 'పెళ్లి సందడి'లో ఒక హీరోయిన్‌గా ఖుషీ కపూర్ నటిస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో.












తమిళ పాలిటిక్స్‌: రజినీతో పొత్తుకు కమల్ ప్లాన్!

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>