PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pawan-kalyan-put-deadline-in-front-of-jagan561f01b1-457e-4567-b1a6-0b13b436c750-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pawan-kalyan-put-deadline-in-front-of-jagan561f01b1-457e-4567-b1a6-0b13b436c750-415x250-IndiaHerald.jpgతుఫాన్ కారణంగా నష్టపోయిన ఎపి రైతులను ఆదుకోవాలంటూ పవన్ కళ్యాణ్ నిరసన దీక్ష చేస్తున్నారు. రూ.35 వేలు పరిహారం ఇస్తేనే రైతులు ఊపిరి తీసుకోగలరని ఆయన అన్నారు. వాలిన వరి పనలు తీసుకొనేందుకూ డబ్బులు లేక నిరాశానిస్పృహలతో ఉన్నారు అని ఆయన అన్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రైతుల కోసం కేటాయించాలి అని ఆయన డిమాండ్ చేసారు. నష్టపోయిన రైతాంగానికి అండగా ఉండేందుకే నిరసన దీక్ష చేస్తున్నా అన్నారు. ఈ దీక్షతోనే జైకిసాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అన్నారు. తక్షణ సాయంగా పది‌వేలు ఇవ్వాలన్నా ప్రభుత్వం pawan kalyan;pawan;kalyan;janasena;janasena party;partyనేను అందుకే దీక్ష చేస్తున్నా: పవన్నేను అందుకే దీక్ష చేస్తున్నా: పవన్pawan kalyan;pawan;kalyan;janasena;janasena party;partyMon, 07 Dec 2020 17:22:39 GMTపవన్ కళ్యాణ్ నిరసన దీక్ష చేస్తున్నారు. రూ.35 వేలు పరిహారం ఇస్తేనే రైతులు ఊపిరి తీసుకోగలరని ఆయన అన్నారు. వాలిన వరి పనలు తీసుకొనేందుకూ డబ్బులు లేక నిరాశానిస్పృహలతో ఉన్నారు అని ఆయన అన్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రైతుల కోసం కేటాయించాలి అని ఆయన డిమాండ్ చేసారు. నష్టపోయిన రైతాంగానికి అండగా ఉండేందుకే నిరసన దీక్ష  చేస్తున్నా అన్నారు. ఈ దీక్షతోనే జైకిసాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అన్నారు.

తక్షణ సాయంగా పది‌వేలు ఇవ్వాలన్నా ప్రభుత్వం స్పందించలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలకు పిలుపునిచ్చాం అన్నారు.   “నివర్ తుపాన్ వల్ల దాదాపు 17 లక్షల పైచిలుకు ఎకరాల్లో పంట నష్టం జరిగింది అని ఆయన మండిపడ్డారు. నాలుగు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ప్రతి రైతు ఆవేదనతో ఉన్నారు అని విమర్శలు చేసారు. ఎకరా పంట పెట్టుబడి రూ. 50 వేలు వరకు అవుతుంది. కనీసం నష్టపరిహారంగా రూ. 35 వేలు ఇస్తే ఊపిరి పీల్చుకోగలమని రైతులు తెలిపారు అని ఆయన అన్నారు.

 అందుకే జనసేన పార్టీ తరపున పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ. 35 వేలు ఇవ్వాలని, తక్షణ సాయంగా రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాం అని ఆయన అన్నారు. ఇప్పటి వరకు నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని వ్యాఖ్యానించారు.   సుమారు రూ.16,500 కోట్లు ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది అని అన్నారు. మద్యం మీద ఆదాయం అవసరం లేదని చెప్పిన ప్రభుత్వం  మద్యం ద్వారా వచ్చిన ఆ వేల కోట్ల ఆదాయాన్ని పంట నష్టపోయిన రైతులకు కేటాయించాలి అని డిమాండ్ చేసారు. రైతులకు గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర రావాలన్నదే జనసేన ప్రయత్నం అన్నారు.  దాని కోసమే జైకిసాన్ అనే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు.


గ్రేటర్ యుద్ధం: ఎట్టకేలకు హైకోర్టు నిర్ణయంతో నేరేడ్ మేట్ డివిజన్ ఫలితానికి మార్గం సుగుమం!

రైతు బందుపై హరీష్ రావు గుడ్ న్యూస్

ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

బుడుగు: పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఇవి పెట్టండి..!?

గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ.. కానీ..?

మహేష్ సినిమాకు 10 కోట్లు అడుగుతున్న ఆ స్టార్..!

ఒక రాజధాని కట్టడానికే డబ్బులు లేవు.. మూడు ఎలా కడతారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>