PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijayasanti-joins-bjp-and-slams-cm-kcrfb4728c4-4aff-4968-a86c-464947727de8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijayasanti-joins-bjp-and-slams-cm-kcrfb4728c4-4aff-4968-a86c-464947727de8-415x250-IndiaHerald.jpgసినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కొద్ది సేపటి క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి ఢీల్లీ వెళ్లిన ఆమె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్న వెంటనే విజయశాంతి మీడియాతో మాట్లాడారుvijayasanthi;soniagandhi;kcr;vijayashanti;jeevitha rajaseskhar;thirtha;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;january;kanna lakshminarayana;fire;u turn;partyకేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతికేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతిvijayasanthi;soniagandhi;kcr;vijayashanti;jeevitha rajaseskhar;thirtha;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;january;kanna lakshminarayana;fire;u turn;partyMon, 07 Dec 2020 16:16:50 GMTఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కొద్ది సేపటి క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి ఢీల్లీ వెళ్లిన ఆమె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్న వెంటనే విజయశాంతి మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ జీవితం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఎదురైన సంఘటనలు, అనుభూతుల గురించి ఆమె వివరించారు.  ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి చెప్పారు. కానీ ఆయన యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణలో కొట్లాడే నేతలు ఉండకూడదన్న యోచనలో  కేసీఆర్ అందర్నీ ఆ పార్టీలో చేర్చుకున్నారు.

కానీ ప్రస్తుతం తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ఆయన అవినీతిని బయటపెడతాను. తప్పకుండా కేసీఆర్‌ను గద్దె దించుతాం. తెలంగాణలో అత్యధికంగా అవినీతి జరుగుతోంది. రేపు తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. విజయశాంతి ఎక్కడ ఉన్నా కీలక పాత్రే పోషిస్తుంది.1998 జనవరి 26న బీజేపీలో నా రాజకీయ జీవితం ప్రారంభించాను. తెలంగాణ కోసం చాలా కష్ట పడ్డాను. కొన్ని కారణాల వల్ల బీజేపీని వదిలి బయటకు వచ్చాను. 2005 మే నెలలో బయటకు వచ్చి తెలంగాణ లక్ష్యంగా తల్లి తెలంగాణ పార్టీ నెలకొల్పాను. నా రాజకీయ జీతంలో అనేక అంశాలపై పోరాడాను. టీఆర్ఎస్ కోసం ఎవరు ఉండకూడదు. ఏ పార్టీ ఉండకూడదన్న దురుద్దేశ్యంతో సీఎం కేసీఆర్ వ్యవహరించారు. పార్టీని విలీనం చేయమని నాపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారు.

కేసీఆర్ కన్నా నేను ముందుగా తెలంగాణ కోసం పోరాడుతూ వచ్చాను. కేసీఆర్‌ తన కుటుంబమే ఉద్యమంలో ఉండాలనుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఇద్దరం ఎంపీలుగా గెలిచాం. 2013లో జూలైలో అదే రాత్రి నన్ను సస్పెండ్ చేశారు. ముందు నుంచే నాపై కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరించారు. నేనే పార్టీ నుంచి బయటకు వెళ్లానని ప్రచారం చేశారు’ అని విజయశాంతి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.


జగన్ అమూల్ తీసుకొచ్చే కారణం అదేనా...?

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?

పెదనాన్న.. నేను.. ఓ సెల్ఫీ..

ఎన్నికల సంఘంపై బీజేపీ ఫిర్యాదు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>