PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/similarities-between-eluru-and-vizag-incidentfaf4b717-d641-4203-898c-106fb7714c0a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/similarities-between-eluru-and-vizag-incidentfaf4b717-d641-4203-898c-106fb7714c0a-415x250-IndiaHerald.jpgఏలూరులో వింత అనారోగ్యం ఇప్పుడు ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు ప్రజలు అందరూ కూడా ఇప్పుడు ఏలూరులో ఉండాలి అంటేనే ఆందోళనకు గురి అవుతున్నారు. నిన్న ఏలూరు అర్బన్ కి మాత్రమే ఇది పరిమితం అయినా సరే నేడు మాత్రం రూరల్, అలాగే దెందులూరు సహా ఇతర ప్రాంతాలకు వచ్చింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అధికారులతో మంత్రి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా అస్వస్థతకు గురైన పన్నెండు మందిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు అధeluru;suhasini;vijayawada;collector;minister;doctor;central government;eluru;vఅంతా బాగుంది: ఏలూరు డాక్టర్లుఅంతా బాగుంది: ఏలూరు డాక్టర్లుeluru;suhasini;vijayawada;collector;minister;doctor;central government;eluru;vMon, 07 Dec 2020 18:40:13 GMTమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా అస్వస్థతకు గురైన పన్నెండు మందిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు అధికారులు.

కొత్త ప్రభుత్వ‌ ఆసుపత్రి లో మొదటి అంతస్తులో  ప్రత్యేక ‌వార్డు కేటాయించిన అధికారులు... చిన్నారులకు పాత ప్రభుత్వ ఆసుపత్రి లో‌ వైద్యం చేస్తున్నారు. డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఏలూరు లో అంతు‌చిక్కని వ్యాధితో అనేక మంది అనారోగ్యానికి గురయ్యారని ఆమె చెప్పారు. అక్కడి ఆసుపత్రి లో వైద్యులు   చికిత్స చేస్తున్నారు అని వారు పేర్కొన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి లో పన్నెండు మందికి చికిత్స అందిస్తున్నాం అని అన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతుంది అని ఆమె వెల్లడించారు.

కరోనా పరీక్షలు కూడా నిర్వహించాం అని సుహాసినీ మీడియాకు చెప్పారు. కలెక్టర్ ఆదేశాలతో  రాష్ట్ర ‌వైద్య బృందం ఏలూరు వెళ్లింది అని ఆమె అన్నారు. రేపు కేంద్ర వైద్య  బృందం ఏలూరులో పర్యటించ నుంది అని చెప్పారు. వివిధ రకాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ లకు పంపాము అని ఆమె అన్నారు. అన్ని రకాల రిపోర్ట్ లు వచ్చాక... అనారోగ్యానికి అసలైన కారణం తెలుస్తుంది అని ఆమె అన్నారు. ఇటువంటి వింత పరిస్థితి ఎప్పుడూ చూడలేదు అన్నారు. ఏలూరు నుంచి ఎంత మంది వచ్చినా.. చికిత్స చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం అని చెప్పారు.


చార్టర్డ్ ప్లేన్‌లో ఉదయ్‌పూర్‌కు అల్లు ఫ్యామిలీ

రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్

చంద్రబాబు ఒక శని: కొడాలి నానీ సంచలన వ్యాఖ్యలు

కరోనా టీకాకు కౌంట్‌డౌన్ !

22 ఏళ్ల తర్వాత బాలయ్యతో జోడీ కడుతున్న ఆ సీనియర్ హీరోయిన్..!!

ఉపాధ్యాయలోకానికి పాఠశాల విద్యాశాఖ భారీ షాక్...

ఒక్క రాజధానికే డబ్బులు లేవు..మరి మూడు రాజధానులకు ఎక్కడివి ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>