PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/internationala0568583-f846-4b7e-a7d3-f0be0012bb1f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/internationala0568583-f846-4b7e-a7d3-f0be0012bb1f-415x250-IndiaHerald.jpgచైనా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. అరుణాచల్‌ ప్రదేశ్‌కు కూతవేటు దూరంలో కొత్తగా మూడు గ్రామాలను నిర్మించింది. భారత్‌, చైనా, భూటాన్‌లకు సరిహద్దుగా ఉన్న బమ్‌లా పాస్‌కు 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామాలను ఏర్పాటుచేసింది. ఈ గ్రామాలలో 960 కుటుంబాలకు చెందిన 3,222 మంది హాన్‌ చైనీయులు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన టిబెటన్లను తరలించేందుకు చైనా సమాయత్తమవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ వాదిస్తోన్న చైనా.. దీనిని స్వాధీనం చేసుకోడానికి పన్నాగాలు కొనసాగిస్తోందిdragon china;view;amala akkineni;pratishta;shimla;india;bhutan;village;february;doctor;army;contract;sea;tibet;gharshana;rekha vedavyasఅరుణాచల్ ప్రదేశ్ దురాక్రమణకు పావులు కదుపుతున్న డ్రాగన్ చైనా!అరుణాచల్ ప్రదేశ్ దురాక్రమణకు పావులు కదుపుతున్న డ్రాగన్ చైనా!dragon china;view;amala akkineni;pratishta;shimla;india;bhutan;village;february;doctor;army;contract;sea;tibet;gharshana;rekha vedavyasMon, 07 Dec 2020 13:30:00 GMTఫిబ్రవరి 17నాటికే ఇక్కడ చైనా 20కి పైగా ఇళ్లను నిర్మించినట్లు ఉపగ్రహాలు తీసిన ఫొటోల్లో వెల్లడైంది.



దక్షిణ చైనా సముద్రంలో మత్స్యకారులను ఉపయోగించినట్లుగా.. చైనా పౌరులు, పశువుల కాపర్లు, గ్రాజర్లను భారత్ సైన్యం గస్తీ నిర్వహించే హిమాలయ ప్రాంతాల్లోకి చొరబడేందుకు ఈ వ్యూహానికి తెరతీసిందని డాక్టర్ బ్రహ్మ అన్నారు. ఇటీవల భూటాన్ భూభాగంలో డోక్లాం ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామాన్ని చైనా నిర్మించినట్టు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించిన రెండు వారాల తర్వాతే తాజాగా అరుణాచల్ వద్ద నిర్మాణాలు బయటపడ్డాయి. ఈ గ్రామాలు తమ భూభాగంలోనే ఉన్నాయని బకాయిస్తోన్న చైనా.. తూర్పు లడఖ్‌లో ఇరు సైన్యాల మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలోనే ఏర్పాటు చేసింది. 1962 తర్వాత తొలిసారిగా భారత్-చైనాల మధ్య ప్రస్తుతం ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. ఎనిమిది దశల్లో చర్చలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం. తాజాగా బయటపడ్డ ఉపగ్రహ చిత్రాల్లో ఒక్కో గ్రామంలో 20 నుంచి 50 వరకు నిర్మాణాలు ఉన్నాయి.



ఈ ప్రాంతంలోని సరిహద్దు చట్టబద్ధ స్థితిని చైనా వివాదం చేస్తోంది.. చైనా మ్యాప్‌లు దక్షిణ టిబెట్ ప్రాంతంలో భాగంగా 65,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని వాస్తవాధీన రేఖకు దక్షిణాన చూపిస్తూనే ఉన్నాయి. 1914 సిమ్లా ఒప్పందంలో బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ సర్ హెన్రీ మెక్‌మోహన్ ప్రతిపాదించిన చారిత్రాత్మక మెక్‌మోహన్ రేఖ ఇక్కడ సరిహద్దును నిర్వచిస్తుందని దశాబ్దాలుగా చైనా చేస్తున్న వాదనను భారత్ తిరస్కరిస్తోంది. భారత భూభాగాన్ని ఆక్రమించుకోడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను 2017 సెప్టెంబర్‌లో ప్రస్తుత సీడీఎస్ చీఫ్, అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించారు. ‘ఉత్తరాన ఉన్న విరోధికి సంబంధించినంత వరకు వారి ప్రయత్నాలను తిప్పికొట్టే చర్య మొదలయ్యింది.. అక్రమణలో ఉన్న భూభాగాన్ని క్రమంగా స్వాధీనం చేసుకోవడం, హద్దులను పాటిస్తూ ఒప్పందాలను గౌరవించాలని జనరల్ రావత్ చైనాకు స్పష్టం చేశారు.




తెలుగు రాష్ట్రాల సమస్యపై సుప్రీం కీలక తీర్పు

బిగ్‌బాస్4లో చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. పిలిచిన నాగ్?

హైదరాబాద్ మేయర్ అయ్యే ఆ లేడీ ఎవరు..?

నిహారిక పెళ్లికి చిరంజీవి గిఫ్ట్..అమ్మో అంత కాస్ట్లీనా ?

బుల్లిపిట్ట: చైనా మొబైల్స్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

బ్రతకడం కష్టం కావడంతో పనిమనిషిగా మారిన నటి కృష్ణవేణి

భర్త సోషల్ డిస్టెంసింగ్.. మగాడు కాదంటూ భార్య కేసు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>