PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajanikanth0ad963a4-d72b-4fd3-9f50-2e4ed38ff67b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajanikanth0ad963a4-d72b-4fd3-9f50-2e4ed38ff67b-415x250-IndiaHerald.jpgవచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే మక్కల్ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో తృతీయ కూటమి ఏర్పాటు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అన్నాడీఎంకే కూటమి, డీఎంకే కూటమిలో మిత్రపక్షాలుగా ఉందామని ప్రయత్నించాడు. కానీ ఏ పార్టీలతో పొత్తుపెట్టుకోవాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడాడు. ఇప్పుడు కమల్‌హాసన్‌కు రజనీకాంత్‌ చేసిన ఆకస్మిక రాజకీయ అరంగేట్రం ప్రకటన కొండంత బలాన్ని ఇచ్చింది. రజినీకాంత్ పాత మిత్రుడు కావడంతో ఇతడి ఆహ్వానాన్ని తప్పక అంగీకరిస్తాడన్న నమrajanikanth;kamal hassan;rajinikanth;mithra;rajani kanth;assembly;hero;partyరజనీకాంత్, కమల్ హాసన్ కలుస్తున్నారారజనీకాంత్, కమల్ హాసన్ కలుస్తున్నారాrajanikanth;kamal hassan;rajinikanth;mithra;rajani kanth;assembly;hero;partyMon, 07 Dec 2020 16:54:13 GMTరజనీకాంత్, కమల్ హాసన్ కలుస్తున్నారా

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే మక్కల్ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో తృతీయ కూటమి ఏర్పాటు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అన్నాడీఎంకే కూటమి, డీఎంకే కూటమిలో మిత్రపక్షాలుగా ఉందామని ప్రయత్నించాడు. కానీ ఏ పార్టీలతో పొత్తుపెట్టుకోవాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడాడు. ఇప్పుడు కమల్‌హాసన్‌కు రజనీకాంత్‌ చేసిన ఆకస్మిక రాజకీయ అరంగేట్రం ప్రకటన కొండంత బలాన్ని ఇచ్చింది. రజినీకాంత్ పాత మిత్రుడు కావడంతో ఇతడి ఆహ్వానాన్ని తప్పక అంగీకరిస్తాడన్న నమ్మకం కమల్ లో ఉంది.

రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా సీఎం అభ్యర్థిగా అటు రజినీకాంత్, ఇటు కమల్ హాసన్ పోటీపడుతుండడంతో ఈ వ్యవహారం తేలేలా ఉండదని పొత్తుపై ప్రభావం పడొచ్చని అంటున్నారు. ఇక కమల్ నాస్తికవాది.. రజినీకాంత్ ఆధ్యాత్మికవాది కావడంతో ఇరువురి అభిరుచులు కలుస్తాయా? లేదా అన్నది చూడాలి.

రజినీకాంత్ పార్టీ పెట్టినా.. పెట్టకపోయినా అసెంబ్లీ ఎన్నికల్లో అతడి మద్దతు కోరుతానని కమల్ హాసన్ ప్రకటించాడు. ఈ క్రమంలోనే రజినీ రాజకీయ ప్రకటన చేయడంతో ఇప్పుడు కమల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం రజినీకాంత్ వర్గంతో కమల్ వర్గం సీనియర్ నేతలు రహస్య మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. రజినీకాంత్ పార్టీ ప్రకటించినప్పటి నుంచే కమల్ పార్టీ నేతల్లో ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే పార్టీ పెట్టి ప్రభావం చూపని కమల్ ఇప్పుడు తన స్నేహితుడితో కలిసి పోటీచేస్తే ఇక మంచి ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నారు.

బలమైన రజినీకాంత్ తో మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ కలిస్తే ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం వీరిద్దరిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు అని విశ్లేషకులు అంటున్నారు




ఒక రాజధాని కట్టడానికే డబ్బులు లేవు.. మూడు ఎలా కడతారు?

కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?

పెదనాన్న.. నేను.. ఓ సెల్ఫీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>