PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఏలూరులో అస్వస్థతకు గురైన వారిని పరామర్శించిన సీఎం వైఎస్ జగన్... అధికారులకు పలు సూచనలు చేసారు. బాధితులకు ఆయన ధైర్యం చెప్పారు. వైద్యులను అడిగి చికిత్స వివరాలను ఆయన తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి అందిస్తున్న వైద్య సహాయం సహా ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటిపై పరీక్షలు చేయించామని, రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు చెప్పారు. హెవీ మెటల్స్‌ పైన కూడా పరీక్షలు చేశామని అవి కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయని అధికారులు చెప్పారు. వివిధ రోగాలకు కారణ మవుతున్న వైరస్‌ లjagan, eluru, ap;jagan;mandula;eluruఏలూరు ఘటనపై జగన్ ఏం చెప్పారు...?ఏలూరు ఘటనపై జగన్ ఏం చెప్పారు...?jagan, eluru, ap;jagan;mandula;eluruMon, 07 Dec 2020 16:30:00 GMT
వివిధ రోగాలకు కారణ మవుతున్న వైరస్‌ లపై అన్ని పరీక్షలు చేశామని, అవన్నీకూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయని అధికారులు చెప్పారు. బ్లడ్‌ కల్చర్‌ రిపోర్టు రావడానికి కొంత సమయం పడుతుందని, వాటి ఫలితాల కోసం వేచి చూస్తున్నామని జగన్ కు చెప్పారు. సీటీ స్కాన్‌ రిపోర్టులు కూడా సాధారణంగానే ఉన్నాయని అధికారులు చెప్పారు. అస్వస్థతకు కారణాలు తెలియరాలేదని అధికారులు వివరించారు. ఏలూరు అర్బన్‌ ప్రాంతంలోనే కాకుండా ఏలూరు రూరల్, దెందులూరు పరిధిలోకూడా కేసులు గుర్తించామన్న అధికారులు...

పలానా వయస్సు ఉన్నవారికిమాత్రమే అస్వస్థత రావడంలేదని, అన్ని వయస్సులు వారూ ఉన్నారని చెప్పారు. నీళ్లు వేడిచేసుకుని తాగేవారు కూడా అస్వస్థతకు గురవుతున్నారని, అలాగే మినరల్‌వాటర్‌ తాగేవారికీ వస్తుందని చెప్పారు. ఎయిమ్స్‌ నుంచి డాక్టర్ల బృందం వచ్చిందని, ఇవాళ ఐఐసీటీ, ఎన్‌ఐఎన్, ఐసీఎంఆర్‌ నుంచి కూడా బృందాలు వస్తున్నాయని అధికారులు చెప్పారు. డిశ్చార్జిచేసిన వారిలో తిరిగి ఆస్పత్రికి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అని అడిగిన సీఎం ముగ్గురు తిరిగి వచ్చారని అధికారులు చెప్పారు. డిశ్చార్జి చేసిన వారినికూడా అబ్జర్వేషన్‌లో ఉంచాలని చెప్పిన సీఎం... డిశ్చార్జి అయిన వారికి సరైన ఆహారం, మంచి మందులు అందించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఎయిమ్స్‌ సహా  ఐఐసీటీ, ఎన్‌ఐఎన్‌ బృందాలు వచ్చాక వారి పరిశీలనలనూ పరిగణలోకి తీసుకోవాలన్న సీఎం... ఏ ఘటన జరిగినా వెంటనే స్పందించేలా ఉండాలని పేర్కొన్నారు.


బ్రేకింగ్ : బిజెపి లో చేరనున్న నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ....??

కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?

పెదనాన్న.. నేను.. ఓ సెల్ఫీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>