Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/corona-cricket5116a25e-e862-4dbe-b262-f588e0f7c6f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/corona-cricket5116a25e-e862-4dbe-b262-f588e0f7c6f7-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచమే స్తంభించిపోయింది. ఇక క్రీడాపోటీలు అన్న మాటే ఎక్కడా వినిపించలేదు. అయితే కొన్ని నెలల తరువాత ఎలాగోలా ధైర్యం చేసి కొన్ని దేశాలు క్రీడా పోటీలను ప్రారంభించాయి. అలా మొదలైన క్రీడల్లో క్రికెట్ కూడా ఒకటి. ఈ మధ్యనే అనేక దేశాలు..corona cricket;cricket;india;pakistan;south africa;korea, south;england;wales;west indies;bcci;2020;icc t20;coronavirusకరోనా ఎఫెక్ట్: మధ్యలోనే రద్దయిన సౌత్ ఆఫ్రికా- ఇంగ్లాండ్ సిరీస్కరోనా ఎఫెక్ట్: మధ్యలోనే రద్దయిన సౌత్ ఆఫ్రికా- ఇంగ్లాండ్ సిరీస్corona cricket;cricket;india;pakistan;south africa;korea, south;england;wales;west indies;bcci;2020;icc t20;coronavirusMon, 07 Dec 2020 20:57:14 GMT

కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచమే స్తంభించిపోయింది. ఇక క్రీడాపోటీలు అన్న మాటే ఎక్కడా వినిపించలేదు. అయితే కొన్ని నెలల తరువాత ఎలాగోలా ధైర్యం చేసి కొన్ని దేశాలు క్రీడా పోటీలను ప్రారంభించాయి. అలా మొదలైన క్రీడల్లో క్రికెట్ కూడా ఒకటి. ఈ మధ్యనే అనేక దేశాలు మళ్లీ క్రికెట్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇంగ్లాండ్- సౌత్ ఆఫ్రికా మధ్య కూడా ఓ సిరీస్ ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా గడ్డపై టీ20లు, వన్డేలతో సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా చేరుకుంది. ఈ మధ్యనే జరిగిన టీ20 సిరీస్ ను 3-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేసింది. కానీ కరోనా కారణంగా తదుపరి జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయింది. ఇంగ్లాండ్ జట్టు వెంటనే స్వదేశం పయనం అయింది.

టీ20 సిరీస్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వరుసగా కరోనా వైరస్ బారిన పడుతూ వచ్చారు. దాంతో.. డిసెంబరు 4న జరగాల్సిన తొలి వన్డేని డిసెంబరు 6కి తొలుత వాయిదా వేశారు. కానీ.. ఈ మ్యాచ్ ముంగిట మళ్లీ సఫారీ టీమ్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఆ తర్వాత ఆటగాళ్లు బస చేసిన హోటల్‌లోని సిబ్బంది కూడా ఈ మహమ్మారి బారినపడటంతో.. క్రికెటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సిరీస్‌ని రద్దు చేస్తున్నట్లు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి.

ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ పతాక స్థాయిలో వ్యాపిస్తున్న రోజుల్లోనే ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) విజయవంతంగా సిరీస్‌లను నిర్వహించింది. ఇంగ్లాండ్ పర్యటనకి వచ్చిన వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడం దగ్గర నుంచి.. ఇరు జట్ల ఆటగాళ్లని బయో-సెక్యూర్ బబుల్‌లో ఉంచడం.. ట్రావెల్, హోటల్ సిబ్బందితో ఆటగాళ్లకి అటాచ్‌మెంట్ లేకుండా చూడటంతో ఈసీబీ తగు జాగ్రత్తలు తీసుకుంది. భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ కూడా ఐపీఎల్ ను అద్భుతంగా నిర్వహించింది. యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్‌ని బయో- సెక్యూర్ బబుల్ వాతావరణంలో 50 రోజులకు పైగా సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది.


కానీ.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అలా జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం కావడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందనేది విమర్శకుల వాదన. ఈ పరిణామంతో ఇంగ్లాండ్ జట్టు తిరిగి వెళ్లేందుకు సిద్హమైంది. త్వరలోనే ఇంగ్లాండ్ క్రికెటర్లు స్వదేశానికి చేరుకోనున్నట్లు ఈసీబీ ప్రకటించింది. ఆ తర్వాత జనవరిలో ఇంగ్లాండ్ టీమ్ సుదీర్ఘ సిరీస్ కోసం భారత్‌ చేరుకుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా 3 టీ20లు, 3 వన్డేలు, 3 టెస్టు మ్యాచుల సుదీర్ఘ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో ఉంది. కరోన తరువాత మొట్టమొదటి సారిగా ప్రేక్షకులతో నిర్వహిస్తున్న తొలి సిరీస్ భారత్-ఆస్ట్రేలియాదే కావడం విశేషం.


రాజుగారు ఇంత సాఫ్ట్ గా ఉంటే అధికారం కష్టమే..?

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>