PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr0bd04d19-a75e-49e4-8e14-b34514ab2d26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr0bd04d19-a75e-49e4-8e14-b34514ab2d26-415x250-IndiaHerald.jpgటీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో గులాబీ బాస్ అప్రమత్తమవుతున్నారు. మొన్నటి దుబ్బాక.. నిన్నటి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో సీఎం కేసీఆర్ అసంతృప్తిలో ఉన్నారు. ఇకపై జరిగే ఎన్నికల్లో నేరుగా ఆయనే రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో ఎదురులేకుండా దూసుకెళుతున్న టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుండటంతో సీఎం కేసీఆర్ శ్రేణులను అలర్ట్ చేస్తున్నారుkcr;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;survey;chequeనాగార్జునసాగర్ పై గులాబీ బాస్ ఫోకస్నాగార్జునసాగర్ పై గులాబీ బాస్ ఫోకస్kcr;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;survey;chequeMon, 07 Dec 2020 06:56:16 GMTనాగార్జునసాగర్ పై గులాబీ బాస్ ఫోకస్

టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో గులాబీ బాస్ అప్రమత్తమవుతున్నారు. మొన్నటి దుబ్బాక.. నిన్నటి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో సీఎం కేసీఆర్ అసంతృప్తిలో ఉన్నారు. ఇకపై జరిగే ఎన్నికల్లో నేరుగా ఆయనే రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణలో ఎదురులేకుండా దూసుకెళుతున్న టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుండటంతో సీఎం కేసీఆర్ శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు. ఈమేరకు నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వొద్దని పకడ్బంధీ ప్రణాళికలను ఇప్పటి నుంచే రచిస్తున్నారు.

త్వరలో నాగార్జున్ సాగర్లో ఉప ఎన్నిక జరుగనుండటంతో ఇప్పటికే బీజేపీ ఆ జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైట్టింది. కాంగ్రెస్ నేత జానారెడ్డితో సహా ఆయన కుమారుడిని పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. ఈక్రమంలోనే వీరిద్దరు బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

గత అసెంబ్లీలో ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన నోముల నర్సింహయ్యకు 83,655 ఓట్లు రాగా జానారెడ్డికి 75,884ఓట్లు వచ్చాయి. దీంతో ఈ స్థానంలో నర్సింహయ్య కుటుంబ సభ్యులను బరిలో దింపారా? లేదా అని కేసీఆర్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ఇటీవల దుబ్బాకలో రామలింగారెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికల్లోఆ కుటుంబ సభ్యులను బరిలో దింపినా సానుభూతి పవనాలు పని చేయలేదు. దీంతో నాగార్జున్ సాగర్లో నర్సింహయ్య కుటుంబ సభ్యులకు ఇస్తే ఫలితం ఎలా ఉంటుందనేది నిఘా వర్గాలతో కేసీఆర్ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం.

ఈ సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా  నొముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలా? లేదా పార్టీలోని మరో బలమైన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలా? అనేది కేసీఆర్ డిసైడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి గులాబీ బాస్ నాగార్జున్ సాగర్ పై గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. చెక్




మేయర్ పదవికి ఇంతమందా ? అలా ఇరుక్కుపోయిన కేసిఆర్ ?

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>