MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/is-this-the-last-movie-of-a-superstarabf29725-439c-424d-aef1-08dd6c91d077-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/is-this-the-last-movie-of-a-superstarabf29725-439c-424d-aef1-08dd6c91d077-415x250-IndiaHerald.jpgరజినీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది. ఎట్టకేలకు పార్టీపెడుతున్నట్టు ప్రకటించాడు సూపర్‌స్టార్. రజనీ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు రజినీ సన్నిహితుడు ప్రకటించాడు. రజనీ పొలిటికల్‌ దూకుడు చూస్తుంటే.. ఆయన నటించే చివరి సినిమా "అన్నాత్తే' అవుతుందా? స్టైలిష్‌ సూపర్‌స్టార్‌ సినిమా కెరీర్‌కు అన్నాత్తేతో ఫుల్‌స్టాప్‌ పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. is this the last movie of a superstar;rajinikanth;shiva;meena;cinema;rajani kanth;tamil;lord siva;darbar;kabali;kaala;petta;partyసూపర్ స్టార్ చివరి సినిమా అదేనా..?సూపర్ స్టార్ చివరి సినిమా అదేనా..?is this the last movie of a superstar;rajinikanth;shiva;meena;cinema;rajani kanth;tamil;lord siva;darbar;kabali;kaala;petta;partyMon, 07 Dec 2020 11:21:53 GMTపార్టీ తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు  రజినీ సన్నిహితుడు ప్రకటించాడు. రజనీ పొలిటికల్‌  దూకుడు చూస్తుంటే.. ఆయన నటించే చివరి సినిమా "అన్నాత్తే' అవుతుందా? స్టైలిష్‌ సూపర్‌స్టార్‌ సినిమా కెరీర్‌కు అన్నాత్తేతో ఫుల్‌స్టాప్‌ పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రజినీకాంత్‌ నిన్నటివరకు సినిమా మీద సినిమా చేసేశాడు.  కరోనాతో గడిచిపోయిన 2020ను మినహాయిస్తే..  కబాలి.. కాలా.. లింగా.. పేట.. దర్బార్ అంటూ.. ఐదేళ్లలో ఆరు సినిమాలు చేశాడు. రాజకీయాల్లోకి రాకుండా వుండే.. మరిన్ని సినిమాల్లో నటించి  రిటైర్‌ అయ్యేవాడు రజినీ. అయితే.. ఫ్యాన్స్‌ ఒత్తిడి మేరకు రాజకీయపార్టీ పెట్టక తప్పడం లేదు.

తమిళనాడు ఎన్నికలు 2021 మేలో జరగనున్నాయి. ఎలక్షన్స్‌కు పట్టుమని ఆరునెలలు మాత్రమే వుంది. మరోవైపు ఆయన నటిస్తున్న అన్నాత్తే మూవీ సెట్స్‌పై ఉంది. ఈ సినిమాను డీఎంకేకు చెందిన సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఎన్నికలు ముందే అన్నాత్తేను థియేటర్స్‌లోకి తీసుకురావాలని రజినీ ప్రయత్నిస్తుంటే.. ప్రత్యర్దులు మాత్రం.. సినిమాను అడ్డుకుంటాడర్న ప్రచారం తమిళ మీడియాలో నడుస్తోంది.

రాజకీయాల్లోకి వస్తున్న రజినీకాంత్‌ ఫ్చూచర్‌లో నటిస్తారా? లేదా? ఒకవేళ యాక్టింగ్‌ గుడ్‌బై చెప్పేస్తే.. అన్నాత్తే చివరి సినిమా అవుతుందా? ఇలా కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. శివ రెక్ట్ చేస్తున్న అన్నాత్తేలో కీర్తిసురేష్‌.. మీనా.. ఖుష్బూ ముఖ్యా పాత్రలు పోషిస్తున్నారు. కరోనా  అడ్డుకుందిగానీ.. లేదంటే.. 2021 సంక్రాంతికి అన్నాత్తే రిలీజ్‌ అయ్యేది.  ఎన్నికలముందే రిలీజ్‌ చేస్తే.. తన పొలిటికల్ ఎంట్రీకి ఈ మూవీ ఉపయోగపడుతుందని రజనీ భావిస్తున్నాడు.

మొత్తానికి రజినీకాంత్ రాజకీయాంగేట్రంపై ఉత్కంఠ వీడింది. ఇక సినిమా విషయానికొస్తే ఆయన నటించిన అన్నాత్తే చివరి సినిమా అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు ఎన్నికలకు ముందే ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే ఉత్కంఠ ఆయన అభిమానుల్లో నెలకొంది.





27 ఏళ్ల తరువాత మళ్ళీ ఖల్‌నాయక్‌.. అప్పటి హీరో కొడుకే..

రేపు భారత్ బంద్...వెల్లువెత్తుతున్న విపక్షాల మద్దతు

బాలీవుడ్‌లో మహిళలకు ప్రాధాన్యం పెరిగింది.. వెల్లడించిన నటి

చంద్రబాబుకు మా చెడ్డ ట్రబులొచ్చింది..?

లోకేష్ లో నిజంగా ఇంత చలనం ఎలా వచ్చింది..?

పాకిస్థాన్‌లో ఘోరం.. పెళ్లి చేసుకోనన్న క్రిస్టియన్ మహిళను దారుణంగా..

ఆ రెండు సినిమాలను అక్క‌డే ప్లాన్ చేసిన నితిన్‌..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>