PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajani23c7d80e-812f-411d-886b-8a7e1fb84080-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajani23c7d80e-812f-411d-886b-8a7e1fb84080-415x250-IndiaHerald.jpgరజనీకాంత్ దక్షిణాది సూపర్ స్టార్. ఒక బస్ కండక్టర్ ముఖానికి రంగు వేసుకుని నటుడు కాగలనా. తాను కూడా వెండి తెర మీద వెలుగులు చిందించగలనా అనుకున్న దాని నుంచి అద్భుతాలు సృష్టించేదాకా రజనీ సినీ ప్రయాణం సాగింది. ఇక రజనీ రాజకీయాల్లోకి రావాలన్నది అభిమాన జనం మాట. ఆ కోరిక వయసు పాతికేళ్ళు. 1995 నుంచి అలా పోరుతూంటే 2021 జనవరి ఒకటిన పార్టీ ప్రకటించడానికి రజనీ డిసైడ్ అయ్యారు. rajani;modi;amit shah;rajinikanth;shruti;bhavana;jayalalitha;kirti;sruthi;bharatiya janata party;m. karunanidhi;rajani kanth;january;tamil;assembly;conductor;silver;service;silver screen;partyరాజకీయాల్లో రజనీ దారి...?రాజకీయాల్లో రజనీ దారి...?rajani;modi;amit shah;rajinikanth;shruti;bhavana;jayalalitha;kirti;sruthi;bharatiya janata party;m. karunanidhi;rajani kanth;january;tamil;assembly;conductor;silver;service;silver screen;partyMon, 07 Dec 2020 22:00:00 GMTరజనీకాంత్ దక్షిణాది సూపర్ స్టార్. ఒక బస్ కండక్టర్  ముఖానికి రంగు వేసుకుని నటుడు కాగలనా. తాను కూడా వెండి తెర మీద వెలుగులు చిందించగలనా అనుకున్న దాని నుంచి అద్భుతాలు సృష్టించేదాకా రజనీ సినీ ప్రయాణం సాగింది. ఇక రజనీ రాజకీయాల్లోకి రావాలన్నది అభిమాన జనం మాట. ఆ కోరిక వయసు పాతికేళ్ళు. 1995 నుంచి అలా పోరుతూంటే 2021 జనవరి ఒకటిన పార్టీ ప్రకటించడానికి రజనీ డిసైడ్ అయ్యారు.

అప్పటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చేశాయి. తమిళనాట ఇద్దరు ఉద్దండులు జయలలిత, కరుణానిధి లేకుండా తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో రజనీకాంత్ పాల్గొంటున్నాడు. ఇది ఆయనకు కలసి వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక తన రాజకీయం ఆధ్యాత్మికం అంటున్నాటు రజనీ.  సేవ చేయడం అంటేనే  ఒక పవిత్రమైన భావన. అది ఆధ్యాత్మికంగా చూడడంలో తప్పు ఏమాత్రం లేదు.

కానీ అందరూ అలా ఉంటేనే, అన్ని విలువలూ సక్రమంగా పాటిస్తేనే రాజకీయాలు పవిత్రంగా మారుతాయి. ఇపుడున్న రాజకీయం చూస్తే ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు. వ్యక్తిగత విషయాలు కూడా తవ్వి తీసుకుంటున్నారు. చాలా దారుణమైన భాషను అసెంబ్లీ లోపలా బయటా కూడా వాడేస్తున్నారు. రజనీ వైపు నుంచి చూస్తే  ఇలాంటి తిట్లు ఉండకపోవచ్చు. కానీ అవతల వారు అదే పనిగా విమర్శలు చేస్తే జవాబు చెప్పాలి కదా.

అది శృతి మించితే ఆధ్యాత్మికం ఎగిరిపోయి అసలు కధ బయటకు వచ్చినా రావచ్చు. ఏది ఏమైనా రజనీకాంత్ ఆలోచనలు మంచివే కానీ ఆధ్యాత్మికం అనగానే బీజేపీతో ఏమైనా కలుస్తారా అని కూడా అంటున్నారుట. దైవ భక్తి అధికంగా కలిగిన రజనీకి హిందూత్వ పార్టీకి లింకులు కూడా పెడుతున్నారు. ఇక  బీజేపీ పెద్దలను ఆ మధ్య బాగానే రజనీ పొగడ్తలు కురిపించారు. మోడీ, అమిత్ షాలను క్రిష్ణార్జునులు అని కూడా కీర్తించారు. మొత్తానికి చూసుకుంటే రజనీ నా దారి రహదాని అని చెబుతున్నా ఆ దారిలో విరబూసే కమలాలను ఆయన అక్కున చేర్చుకుంటాడా, పక్కన పెట్టి ముందుకు సాగుతారా అన్నదే తమిళ తెరపైన చూడాల్సిన అసలైన  రాజకీయం.

 




తమిళ పాలిటిక్స్‌: రజినీతో పొత్తుకు కమల్ ప్లాన్!

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>