MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rajini-kanth-super-star-biopicb6ac97c1-024a-427b-9be9-e11ce13c4e8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rajini-kanth-super-star-biopicb6ac97c1-024a-427b-9be9-e11ce13c4e8f-415x250-IndiaHerald.jpgసూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ఇండస్ర్టీని ఎలకా ముందు బస్ కండక్టర్‌గా పనిచేశారన్న సంగతి అందరికీ తెలిసిందే. కర్ణాటక కి చెందిన రజిని తమిళ సినిమాల్లో నటిస్తూ దక్షిణాది సూపర్‌స్టార్‌గా ఎంతో క్రేజ్ సంపాదించి నెంబర్ వన్ హీరో అయ్యాడు. అయితే సూపర్ స్టార్ కాకముందు ఆయన జీవితంలో అందమైన ప్రేమకథ ఉందన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సినిమా స్టోరీని తలపించే ఆ ప్రేమకథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వివరాల్లోకి వెళితే.... ​మన సూపర్ స్టార్ అప్పుడు బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న రోజులవి. ఆయrajni-kanth;rajinikanth;jeevitha rajaseskhar;prema;india;karnataka - bengaluru;cinema;rajani kanth;bus;tamil;bengaluru 1;love;hero;letter;natakam;love story;loverతన లవర్ వల్లే రజిని సూపర్ స్టార్ అయ్యారట.. ఆకట్టుకుంటున్న రజిని లవ్ స్టోరీ..!తన లవర్ వల్లే రజిని సూపర్ స్టార్ అయ్యారట.. ఆకట్టుకుంటున్న రజిని లవ్ స్టోరీ..!rajni-kanth;rajinikanth;jeevitha rajaseskhar;prema;india;karnataka - bengaluru;cinema;rajani kanth;bus;tamil;bengaluru 1;love;hero;letter;natakam;love story;loverMon, 07 Dec 2020 14:00:00 GMTసూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ఇండస్ర్టీని ఎలకా ముందు  బస్ కండక్టర్‌గా పనిచేశారన్న సంగతి అందరికీ తెలిసిందే. కర్ణాటక కి  చెందిన రజిని తమిళ సినిమాల్లో నటిస్తూ దక్షిణాది సూపర్‌స్టార్‌గా ఎంతో క్రేజ్ సంపాదించి నెంబర్ వన్ హీరో అయ్యాడు. అయితే సూపర్ స్టార్  కాకముందు ఆయన జీవితంలో అందమైన ప్రేమకథ ఉందన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సినిమా స్టోరీని తలపించే ఆ ప్రేమకథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వివరాల్లోకి వెళితే....

మన సూపర్ స్టార్ అప్పుడు  బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న రోజులవి. ఆయన డ్యూటీ చేసే బస్సులోనే నిర్మల అనే వైద్య విద్యార్థిని రోజూ ప్రయాణించేది. ఈ క్రమంలోనే వారిద్దరికి పరిచయం ఏర్పడింది. అది ఒక అందమైన  ప్రేమకు దారితీసింది.సూపర్ స్టార్  రోజూ డ్యూటీ ముగిశాక ఆమెను పార్కులో కలుసుకుని ప్రేమ ఊసులు చెప్పేవారట. ఓ రోజు సాయంత్రం ఆమెను థియేటర్‌కు రమ్మని చెప్పడంతో ఆమె ఒంటరిగా అక్కడికి వెళ్లారు. అదే సమయంలో అక్కడ ఓ నాటకం జరుగుతోందట. ఆ నాటకంలో ఓ వేషం వేశారట సూపర్ స్టార్. రజినీకాంత్‌ నటన, స్టైల్‌ని చూసి నిర్మల మైమరచిపోయిందట.

కొన్ని రోజుల  తర్వాత మన సూపర్ స్టార్ ‌కు చెన్నైలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఓ లెటర్ వచ్చింది. ఈ విషయాన్ని ప్రియురాలికి చెప్పిన ఆయన.. తాను అప్లై చేయకుండానే  ఆఫర్ లెటర్ ఎలా వచ్చిందోనని అయోమయంలో పడ్డారట . నటనపై నీకున్న ఆసక్తిని గమనించి నీ పేరు మీద నేనే దరఖాస్తు చేశా, సర్‌ప్రైజ్ చేద్దామనే నీకు చెప్పలేదు.. అని నిర్మల చెప్పడంతో రజినీ షాకయ్యారు. అక్కడ ట్రైనింగ్ తీసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని, తనకు అంత ఆర్థిక స్తోమత లేదని ఆయన చెప్పారు. అయితే జీవితాంతం బస్ కండక్టర్‌గానే ఉండిపోతావా?. అని నిర్మల ఆయనను మోటివేట్ చేసి  చెన్నైకి పంపించారు. రజినీ ఖర్చుల కోసం ఆమె అప్పుడప్పుడు డబ్బులు కూడా  పంపించేవారట.

తరువాత  ట్రైనింగ్ అయ్యాక చాలా  కష్టాలు పడి  చివరికి సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు.  షూటింగుల్లో వున్నప్పుడు  ప్రియురాలి నుంచి వచ్చిన లేఖలను భద్రంగా దాచుకుంటూ ఆమెకు ప్రత్యుత్తరాలు రాసేవారు. హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో ఆమె నుంచి ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. దీంతో కొద్దిరోజుల తర్వాత బెంగళూరు వెళ్లిన రజినీకాంత్ నిర్మల ఇంటికి వెళ్లగా అక్కడ మరో ఫ్యామిలీ కనిపించింది. దీంతో చుట్టుపక్కల వారిని ఆరా తీయగా నిర్మల కుటుంబం చాలారోజుల క్రితమే ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని, ఎక్కడికి వెళ్లారో తెలియదని చెప్పారట.నిర్మల కోసం సూపర్ స్టార్ బెంగళూరులో చాలా వెతికారట కాని ఆమె ఆచూకీ తెలియలేదట. నిర్మల జ్ఞాపకాలు తనతోనే ఉంచుకున్న రజినీ ఆమె ఇచ్చిన స్ఫూర్తితో సాధారణ హీరో నుంచి సూపర్‌స్టార్‌గా మారారు. అయితే తాను సూపర్ స్టార్ అవ్వడానికి కారణమైన  నిర్మలను మళ్లీ కలుసుకోలేకపోవడం తనను ఎప్పుడూ ఎంతగానో బాధిస్తూ  ఉంటుందని సూపర్ స్టార్  ఒకానొక సమయంలో  చెప్పారు.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వరద సాయం

గర్భం పోయేందుకు మాత్ర వేసుకున్న బాలిక.. చివరికి ప్రాణం పోయింది.?

వచ్చే నెల జనవరిలో రెండు, ఏప్రిల్ నెల నాటికి మరో రెండు కరోనా వ్యాక్సిన్లు సిద్ధం!

ఆండ్రు రస్సెల్ కన్నా.. ఆ యువ ఆటగాడు చాలా బెటర్.?

తెలుగు రాష్ట్రాల సమస్యపై సుప్రీం కీలక తీర్పు

బిగ్‌బాస్4లో చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. పిలిచిన నాగ్?

హైదరాబాద్ మేయర్ అయ్యే ఆ లేడీ ఎవరు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>