PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war675a6daa-5aaf-4ef3-853a-6fd93e757512-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war675a6daa-5aaf-4ef3-853a-6fd93e757512-415x250-IndiaHerald.jpgపార్టీల సంగతి పక్కన పెడితే, తెలంగాణలో తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకుని దానికనుగుణంగా రాజకీయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఆయన ఉన్నా, పిసిసి అధ్యక్షుడు అవ్వాలన్నది ఆయన కోరిక . అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది నెరవేరే అవకాశం కనిపించడం లేదని ,దీనికి కారణం రేవంత్ కు పిసిసి పదవి రాకుండా , పార్టీలోని సీనియర్ నాయకులు అడుగడుగునా అడ్డం పడుతూ ఉండడం, అధిష్టానానికి సైతం ఈ విషయంలో సీనియర్ నాయకులు వార్నింగ్ ఇస్తుండడrevanth reddy pcç chief telangana. new party;auto;kumaar;revanth;bharatiya janata party;uttam kumar reddy nalamada;telangana;revanth reddy;congress;రాజీనామా;letter;reddy;partyరేవంత్ రెడ్డి కొత్త పార్టీ ?రేవంత్ రెడ్డి కొత్త పార్టీ ?revanth reddy pcç chief telangana. new party;auto;kumaar;revanth;bharatiya janata party;uttam kumar reddy nalamada;telangana;revanth reddy;congress;రాజీనామా;letter;reddy;partyMon, 07 Dec 2020 09:00:00 GMTపార్టీల సంగతి పక్కన పెడితే, తెలంగాణలో తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకుని దానికనుగుణంగా రాజకీయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఆయన ఉన్నా, పిసిసి అధ్యక్షుడు అవ్వాలన్నది ఆయన కోరిక . అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది నెరవేరే అవకాశం కనిపించడం లేదని ,దీనికి కారణం రేవంత్ కు పిసిసి పదవి రాకుండా , పార్టీలోని సీనియర్ నాయకులు అడుగడుగునా అడ్డం పడుతూ ఉండడం,  అధిష్టానానికి సైతం ఈ విషయంలో సీనియర్ నాయకులు వార్నింగ్ ఇస్తుండడంతో, తనకు ఆ పదవి రాదని , వచ్చినా సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కోవాలని,  అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలం పుంజుకునే అవకాశం కనిపించకపోవడం ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని రేవంత్ విశ్లేషించుకుంటున్నారు. 





తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి దిగజారి పోతున్న సమయంలో, బిజెపి బలం పెంచుకుంటూ వస్తుంది. రేవంత్ సైతం బిజెపిలోకి ముందు వెళ్లేందుకు చూసినా, ఎందుకో వెనక్కి తగ్గిపోయారు. ఇప్పుడు మాత్రం ఆయన సొంతంగా పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయనను సొంతంగా పార్టీ స్థాపించాలి అని కోరుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండడం ఒక కారణం గా కనిపిస్తోంది. తెలంగాణలో బలమైన సామాజిక వర్గం గా ఉన్న రెడ్లు చాలా కాలంగా కొట్టు కోల్పోతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి మంచి గుర్తింపు, ఆధిపత్యం ఉండేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా,  సామాజికంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి వ్యాపారాలు చాలావరకు దెబ్బతిన్నాయి. దీంతో రేవంత్ రెడ్డిని హైలెట్ చేసి ఆయన ద్వారా తెలంగాణలో మరోసారి తమ సత్తా చాటుకోవాలని రెడ్డి సామాజిక వర్గం ఫిక్స్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. 






మొన్నటి వరకు పిసిసి అధ్యక్ష పదవి కోసం రేవంత్ గట్టిగానే ప్రయత్నాలు చేశారు అలాగే పిసిసి చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత తీసుకుంటూ తన పదవికి రాజీనామా చేశారు. ఆపదవి తనకు వస్తుందన్న నమ్మకం కూడా ఇప్పుడు రేవంత్ కు లేదు. అందుకే ప్రాంతీయ పార్టీ స్థాపించి అధికారంలోకి రావాలని రేవంత్ సైతం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది..



అలెర్ట్ అయిన కేసీఆర్...?

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>