PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/amaravathi1ce057f2-baf5-4083-a2cb-07048d6c487c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/amaravathi1ce057f2-baf5-4083-a2cb-07048d6c487c-415x250-IndiaHerald.jpgమరావతి ఉద్యమం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అమరావతి అనుకూల వర్గం ఓవైపు, మూడు రాజధానులకు మద్దతిస్తున్న బహుజన పరిరక్షణ సమితి మరోవైపు.. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ దశలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో పరిస్థితి చక్కబడింది. లేకపోతే.. మరింత ఇబ్బందికర వాతావరణం నెలకొనేదని తెలుస్తోంది. amaravathi;ganga;suresh;ganges;nandigam suresh;amaravati;mp;police;capital;village;car;letter;tdp;gharshana;ranarangam;bapatla;adimulapu sureshరణరంగంగా మారిన అవరావతి.. అసలేం జరిగింది..?రణరంగంగా మారిన అవరావతి.. అసలేం జరిగింది..?amaravathi;ganga;suresh;ganges;nandigam suresh;amaravati;mp;police;capital;village;car;letter;tdp;gharshana;ranarangam;bapatla;adimulapu sureshMon, 07 Dec 2020 07:00:00 GMTఅమరావతి ఉద్యమం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అమరావతి అనుకూల వర్గం ఓవైపు, మూడు రాజధానులకు మద్దతిస్తున్న బహుజన పరిరక్షణ సమితి మరోవైపు.. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ దశలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో పరిస్థితి చక్కబడింది. లేకపోతే.. మరింత ఇబ్బందికర వాతావరణం నెలకొనేదని తెలుస్తోంది.

ఇంతకీ ఏం జరిగింది..?
ఇంటింటికి అమరావతి అనే పేరుతో ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి అమరావతి ఆవశ్యకత తెలిపేలా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాజధాని మహిళలు. ఉద్దండరాయునిపాలెంలో ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టి పెట్టి అమరావతి ఉద్యమానికి మద్దతు కోరారు. ఈ క్రమంలో గ్రామంలోని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ ఇంటి సమీపంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఎంపీ నందిగం సురేష్ ఇంటిపై అమరావతి రైతులు దాడికి వెళ్తున్నారనే వార్తతో.. బహుజన పరిరక్షణ సమితి నేతలు అక్కడికి వచ్చారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొంది. అక్కడ్నించి అందరూ ఉద్దండరాయుని పాలెంలోని దీక్షా శిబిరాన్ని చేరుకున్నారు. కాసేపటికి మూడు రాజధానుల ఉద్యమ కారుల్ని పోలీసులు అక్కడినుంచి పంపించివేశారు. అయితే అంతలోనే మహిళలపై రాళ్లదాడి జరిగిందనే వార్తలొచ్చాయి. దీంతో అమరావతి రైతులు రాస్తారోకో చేపట్టారు.

అటు మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమం చేస్తున్న బహుజన పరిరక్షణ సమితి నేతలు కూడా తమపై దాడులు జరుగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలు చేస్తున్న దాడులను తక్షణం నిరోధించాలంటూ దళిత సంఘాల నాయకులు బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ‌కు వినతిపత్రం అందించారు. దళితులపై ప్రతిసారీ దాడులుచేస్తూ భయపెడుతున్నారని, వారిని తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. రాజధాని అమరావతి రైతుల ముసుగులో టీడీపీ నాయకులు బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ పై మరోసారి దాడిచేసేందుకు యత్నించారంటూ దళిత సంఘాల నాయకులు విమర్శించారు. మొత్తమ్మీద అమరావతి ఉద్యమం ఏడాది మైలురాయికి చేరుకుంటున్న దశలో ఒక్కసారిగా పరిస్థితు ఆందోళనకరంగా మారుతోంది. 


మేయర్ పదవికి ఇంతమందా ? అలా ఇరుక్కుపోయిన కేసిఆర్ ?

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>