MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hyper-aadi8484ad88-9b09-4ca8-b37b-fede064ee210-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hyper-aadi8484ad88-9b09-4ca8-b37b-fede064ee210-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ ప్రోగ్రామ్ అంటే చాలు ఎంతోమందికి ఇష్టం. ఆ షో చూస్తూ కనీసం వారానికి రెండు సార్లు అయిన మనస్ఫూర్తిగా నవ్వుకోవచ్చు అని ఎదురుచూసేవాళ్ళు చాలా మందే ఉన్నారు.అందుకనే ఎన్నో సంవత్సరాలనుండి అశేషమైన ప్రేక్షక ఆదరణతో టాప్ రేటింగ్ తో ముందుకు దూసుకెళ్తూనే ఉంది.hyper aadi;jeevitha rajaseskhar;adinarayanareddy;jabardasth;industry;software;father;alitho saradagaజబర్దస్త్ తరువాత హైపర్ ఆది ఆస్తులు ఎన్నో తెలుసా.. !!జబర్దస్త్ తరువాత హైపర్ ఆది ఆస్తులు ఎన్నో తెలుసా.. !!hyper aadi;jeevitha rajaseskhar;adinarayanareddy;jabardasth;industry;software;father;alitho saradagaMon, 07 Dec 2020 17:00:00 GMTజబర్దస్త్ ప్రోగ్రామ్ అంటే చాలు ఎంతోమందికి ఇష్టం. ఆ షో చూస్తూ కనీసం వారానికి రెండు సార్లు అయిన మనస్ఫూర్తిగా నవ్వుకోవచ్చు అని ఎదురుచూసేవాళ్ళు చాలా మందే ఉన్నారు.అందుకనే  ఎన్నో సంవత్సరాలనుండి అశేషమైన ప్రేక్షక ఆదరణతో టాప్ రేటింగ్ తో ముందుకు దూసుకెళ్తూనే ఉంది. అలాగే ఈ షో చాలా మందికి ఒక జీవితాన్ని ఇచ్చింది అనే చెప్పాలి. ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ వల్ల చాలామంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇందులో కంటెస్టెంట్స్ జనంలో పాపులార్టీ సంపాదించడంతో పాటు ఆర్ధికంగా కూడా బాగానే స్థిరపడ్డారు. అంతేకాకుండా చాలా రకాల  షోస్, సినిమాలు కూడా చేస్తూ, రెండు చేతులా బాగానే  సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఈ షో ద్వారా పాపులారిటీతో పాటు ఆస్తులు కూడా సంపాదించుకున్న వారిలో  హైపర్ ఆది ఒకడు.

పంచ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్ గా గుర్తింపు పొందిన ఆది అతి కొద్ది  సమయంలోనే ఒక స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే జబర్దస్త్‌కు రాకముందు హైపర్ అది  జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు అంట. వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే  ఉండేదట. హైపర్ ఆది ఒక మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేసాడు. అయితే ఈ విషయాలన్నీ ఆది నే స్వయంగా అలీతో సరదాగా షో లో  వెల్లడించాడు. అప్పట్లో తను, తన ఇద్దరు అన్నయ్యల చదువు కోసం ఆది తండ్రి ఆస్తులు అన్నీ అమ్మేసారట. దాంతో చేతిలో చిల్లిగవ్వ కూడా  లేకుండా చాలా బాధలు పడ్డామని చెప్పారు. తమకు ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉండేదని, దాన్ని కూడా కుటుంభం పోషణ  కోసమే నాన్న అమ్మేసాడని వివరించాడు.

 అయితే ఇంజనీరింగ్ చదివిన తాను ఇలా జబర్దస్త్‌లోకి వెళ్లడం తన సన్నహితులకు కూడా నచ్చక తిట్టేవారని చెప్పుకొచ్చాడు. కానీ ఆది మాత్రం అవేమి పట్టించుకోకుండా ప్రయత్నం చేసాడట. తనకు  ఛాన్స్ రావడంతో వదల్లేదని, పగలు రాత్రి తేడా లేకుండా స్క్రిప్ట్ రాసుకునేవాడినని ఆది వివరించాడు. మొదట్లో రైటింగ్ సైడ్ వెళ్లి అక్కడ కొన్ని రోజులు పని చేసానని, తర్వాత అదిరే అభి పరిచయంతో జబర్దస్త్‌లోకి వచ్చాడు.తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు .  ఇండస్ట్రీ దయతోనే ఎక్కడైతే తన ఆస్తులు పోయాయో అక్కడే వాటికి రెట్టింపు ఆస్తులను తిరిగి సంపాదించుకున్నాన్నాడట. అంతేకాకుండా తన  సొంత ఊరిలోనే వాళ్ళ నాన్న అమ్మేసిన 3 ఎకరాల స్థలం స్థానంలో ఇప్పుడు 10 ఎకరాలు కొన్నాడంట. సొంతూళ్లో పెద్ద ఇల్లు కూడా ఉందని చెప్పుకొచ్చాడు. మొదట్లో ఆదిగా పరిచయం అయ్యి ఇప్పుడు హైపర్ ఆదిగా ఎదిగాడు.  కామెడీతో అందర్నీ నవ్విస్తూ, తనదైన  పంచులతో ఎప్పుడూ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు మన ఆది.. !!


ఒప్పుకోకపోతే అవార్డులు తిరిగిచ్చేస్తాం..!

ఒక రాజధాని కట్టడానికే డబ్బులు లేవు.. మూడు ఎలా కడతారు?

కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>