PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/parliamentnewbuildingelavuntundidcacc143-11b7-4125-995d-d2779b0fc6cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/parliamentnewbuildingelavuntundidcacc143-11b7-4125-995d-d2779b0fc6cb-415x250-IndiaHerald.jpgభారత్ 75వ స్వాతంత్ర్య వేడుకలు (వజ్రోత్సవాలు) 2022 ఆగస్టు 15న జరగబోతున్నాయి. ఆ సమయానికి కొత్త పార్లమెంట్ భవనంలోనే ఉభయ సభల సమావేశాలు జరిగేలా కొత్త భవనం నిర్మించాలని మోడీ సర్కార్ ప్లాన్ చేసింది. కొత్త పార్లమెంట్ లో ఒకేసారి 1345మంది సభ్యులు ఉమ్మడి పార్లమెంట్ లో కూర్చేనే స్థాయిలో సువిశాలంగా సెంట్రల్ మాల్ ను నిర్మిస్తున్నారు. దీన్ని రాష్ట్రపతి భవన్ కు దక్షిణాన ప్రధానమంత్రి అధికారిక నివాసం.. ఉపరాష్ట్రపతికి కొత్త అధికార నివాసం ఏర్పాటు చేస్తూ ఈ ప్రాజెక్టుకు ‘సెంట్రల్ విస్తా’ అని పేరు పెట్టారు.new parliament;modi;india;narendra modi;prime minister;parliment;parliamentNew parliamentNew parliamentnew parliament;modi;india;narendra modi;prime minister;parliment;parliamentMon, 07 Dec 2020 07:03:25 GMTనూతన పార్లమెంట్ భవన్ ఇలా ఉంటుంది

భారత్ 75వ స్వాతంత్ర్య వేడుకలు (వజ్రోత్సవాలు) 2022 ఆగస్టు 15న జరగబోతున్నాయి. ఆ సమయానికి కొత్త పార్లమెంట్ భవనంలోనే ఉభయ సభల సమావేశాలు జరిగేలా కొత్త భవనం నిర్మించాలని మోడీ సర్కార్ ప్లాన్ చేసింది.

కొత్త పార్లమెంట్ లో ఒకేసారి 1345మంది సభ్యులు ఉమ్మడి పార్లమెంట్ లో కూర్చేనే స్థాయిలో సువిశాలంగా సెంట్రల్ మాల్ ను నిర్మిస్తున్నారు. దీన్ని రాష్ట్రపతి భవన్ కు దక్షిణాన ప్రధానమంత్రి అధికారిక నివాసం.. ఉపరాష్ట్రపతికి కొత్త అధికార నివాసం ఏర్పాటు చేస్తూ ఈ ప్రాజెక్టుకు ‘సెంట్రల్ విస్తా’ అని పేరు పెట్టారు.

ప్రస్తుత పార్లమెంట్ భవనం.. ప్రపంచ వారసత్వ సంపదగా ఉంది. దీంతో దీన్ని చెక్కు చెదరకుండా భావితరాలకు అందించాలి. అందుకే మోడీ సర్కార్.. అవసరాలకు సరిపోని ప్రస్తుత పార్లమెంట్ స్థానంలో కొత్త పార్లమెంట్ భవనం నిర్మించాలని యోచిస్తున్నారు.

దేశానికి కొత్త పార్లమెంట్ నిర్మించాలని మోడీ సర్కార్ పట్టుదలతో ఉంది.. భారతీయత ఉట్టిపడేలా దీన్ని తీర్చిదిద్దబోతోంది. నూతన పార్లమెంట్ భవనానికి గుర్తుగా నిలిచే పార్లమెంట్ భవనానికి ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 10న శంకుస్థాపన చేయనున్నారు.

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును ‘టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్’రూ.861.90 కోట్లకు దక్కించుకుంది. ఏడాదిలో ఈ పార్లమెంట్ కొత్త భవన నిర్మాణం పూర్తి చేయాలని కండీషన్ పెట్టారు. దీనికి హెచ్.సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూపకల్పన చేసింది.

ప్రస్తుతం వినియోగిస్తున్న పార్లమెంట్ 93 ఏళ్ల నాటి పాతది. బ్రిటీష్ వారి హయాంలో కట్టినది. భారత స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు.




శబరిమల భక్తుల కు కరోనా పరీక్ష లు

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>