PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/congressb95efe02-e043-47e6-9d33-81d5895b14a2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/congressb95efe02-e043-47e6-9d33-81d5895b14a2-415x250-IndiaHerald.jpgజీహెచ్ఎంసీ ఎన్నికల్లో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్‌ పార్టీకి కేవలం రెండు స్థానాలు మాత్రమే దక్కడంతో ఆ పార్టీ ఇప్పటికే తీవ్ర మనస్థాపానికి గురి అయింది.ఈ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తన టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసి అధిష్టానానికి లేఖ పంపారు. తాజాగా హస్తం పార్టీకి మరో సీనియర్‌ నేత విజయశాంతి హ్యాండ్ ఇచ్చేశారు. అలాగే ఇక ఏఐసీసీ సభ్యుడు, తెలంగాణ పీసీసీ ట్రెజరర్‌ గూడూరు నారాయణరెడ్డి సోమవారం పార్టీని వీడారుcongress;view;amit shah;kumaar;vijayashanti;delhi;hyderabad;telangana;hosta;congress;రాజీనామా;capital;tpcc;minister;letter;central government;reddy;partyవిజయశాంతి బాటలో హస్తానికి హ్యాండ్ ఇచ్చిన మరో సీనియర్ నేత!విజయశాంతి బాటలో హస్తానికి హ్యాండ్ ఇచ్చిన మరో సీనియర్ నేత!congress;view;amit shah;kumaar;vijayashanti;delhi;hyderabad;telangana;hosta;congress;రాజీనామా;capital;tpcc;minister;letter;central government;reddy;partyMon, 07 Dec 2020 16:15:00 GMTతెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఇటీవలే ముగిసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసీ ) న్నికల్లో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్‌ పార్టీకి కేవలం రెండు స్థానాలు మాత్రమే దక్కడంతో ఆ పార్టీ ఇప్పటికే తీవ్ర మనస్థాపానికి గురి అయింది. ఇక ఆ పార్టీకి వరుసపెట్టి షాక్‌లు తగులుతున్నాయి. మొదటగా ఈ ఎన్నికల ఫలితాల అనంతరం వెంటనే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తన టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసి అధిష్టానానికి లేఖ పంపారు. తాజాగా హస్తం పార్టీకి మరో సీనియర్‌ నేత విజయశాంతి హ్యాండ్ ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే ఇక ఏఐసీసీ సభ్యుడు, తెలంగాణ పీసీసీ ట్రెజరర్‌ గూడూరు నారాయణరెడ్డి సోమవారం పార్టీని వీడారు. ఈమేరకు ఆయన తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. త్వరలోనే నారాయణరెడ్డి బీజేపీలో చేరనున్నారు. గతంలోనే నారాయణరెడ్డి కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం కూడా జరిగింది. మరోవైపు విజయశాంతి కూడా కాషాయ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.




కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి తాజాగా సోమవారం బీజేపీలో చేరారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. తెలంగాణతో పాటు త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లోనూ విజయశాంతితో ప్రచారం చేయించాలనే వ్యూహంలో కమలనాధులు ఉన్నారు. అంతకుముందు దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో విజయశాంతి భేటీ అయ్యారు. ఢిల్లీ లోని ఆయన నివాసంలో కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ లతో కలిసి వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిశారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై, విషయాలపై అమిత్ షాతో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.




జగన్ అమూల్ తీసుకొచ్చే కారణం అదేనా...?

కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?

పెదనాన్న.. నేను.. ఓ సెల్ఫీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>