MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-ali-khan-apoloziesbe65e2ff-3411-4f55-9b05-0817e1efc072-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-ali-khan-apoloziesbe65e2ff-3411-4f55-9b05-0817e1efc072-415x250-IndiaHerald.jpgసైఫ్ అలీ ఖాన్, ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, అది తన ఉద్దేశం కాదని తెలియజేశారు. ఒక వేళ తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడి ఉంటే తనని క్షమించమని, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ విజ్ఞప్తి చేశారు. హిందువుల ఇష్టదైవం రాముడు అంటే నాకు కూడా చాలా ప్రీతి మరియు గౌరవం అని ఆయన అన్నారు . నా దృష్టిలో రాముడంటే ధర్మానికి మరియు వీరత్వానికి అద్దం వంటివారు అని పేర్కొన్నారు సైఫ్ అలీ ఖాన్. అటువంటి రాముని గురించి తాను తక్కువ చేసి మాట్లాడబోనని చెప్పారు. sai ali khan apolozies;prabhas;aly khan;saif ali khan;ali;prithy;ramu;bharatiya janata party;adinarayanareddy;bollywood;cinema;director;letter;hindus;party;chitramరావణునిపై చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పిన సైఫ్ అలీ ఖాన్...!రావణునిపై చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పిన సైఫ్ అలీ ఖాన్...!sai ali khan apolozies;prabhas;aly khan;saif ali khan;ali;prithy;ramu;bharatiya janata party;adinarayanareddy;bollywood;cinema;director;letter;hindus;party;chitramMon, 07 Dec 2020 09:00:00 GMTప్రముఖ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో, ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్‌ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. వచ్చే ఏడాది జనవరిలో  ‘ఆదిపురుష్‌’ చిత్రీకరణ ప్రారంభం కానుంది. రామాయణం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరామునిగా దర్శనమివ్వనున్నారు... ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రను పోషిస్తారని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. రావణాసుర పాత్రలో కనిపించనున్న సైఫ్ అలీ ఖాన్ ఇటీవలే ఈ చిత్రం గురించి మాట్లాడుతూ రావణాసురుని గురించి మాట్లాడిన తీరు వివాదాస్పద చర్చకు దారితీసింది. సినిమా కథ గురించి మాట్లాడుతున్న సైఫ్ అలీ ఖాన్...అస‌లు రాముడితో రావ‌ణుడు యుద్ధం చేయడానికి గల కారణం ఏమిటి? అది కరెక్టే అనే కోణంలో చిత్రం ఉంటుంద‌ని రివిల్ చేసేసాడు.

 అంతేకాకుండా రావణాసుని యొక్క మంచి పనులను... అతని మానవత్వాన్ని వ్యక్తపరిచే కొన్ని సంఘటనలను ఈ చిత్రం ద్వారా చూపిస్తున్నామంటూ పేర్కొన్నాడు. రావణాసురుడులో కూడా సద్గుణాలు ఉన్నాయంటూ.... ఆ కోణాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నారు అన్నాడు. దాంతో ఈ విషయం కాస్త వివాదంగా మారింది. రావణుడిని రాక్షసుడిలా భావించే హిందువులు సైఫ్ అలీ ఖాన్ మాటలకు ఏకీభవించలేక పోగా... హిందువుల పురాణాల్లో రాక్షసుడిగా పిలవబడుతున్న రావణుణ్ణి సైఫ్ అలీ ఖాన్ పొగడడంతో... మన పురాణాలను ఎంతగానో నమ్మి, గౌరవించే హిందువులు ఈ విషయాన్ని సహించలేకపోతున్నారు. వీరితో పాటు బిజెపి పార్టీ నాయకులు సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి స్పందించిన బీజేపీ నాయ‌కుడు రామ్‌క‌దం.. ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ వ్యాఖ్యలు త‌న‌ను షాక్‌కు గురి చేశాయంటూ సొసైల్ మీడియాలో పేర్కొన్నారు. అంతేకాదు రాక్షసుడు లాంటి రావ‌ణాసురుడిని మంచివాడుగా చూపిస్తే అస్స‌లు సహించేది లేదని హెచ్చరించాడు. 

ఇలా బిజెపి కార్యకర్తలు సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. దీనికి స్పందించిన సైఫ్ అలీ ఖాన్, ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, అది తన ఉద్దేశం కాదని తెలియజేశారు. ఒక వేళ తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడి ఉంటే తనని క్షమించమని, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ విజ్ఞప్తి చేశారు. హిందువుల ఇష్టదైవం రాముడు అంటే నాకు కూడా చాలా ప్రీతి మరియు గౌరవం అని ఆయన అన్నారు . నా దృష్టిలో రాముడంటే ధర్మానికి మరియు వీరత్వానికి అద్దం వంటివారు అని పేర్కొన్నారు సైఫ్ అలీ ఖాన్. అటువంటి రాముని గురించి తాను తక్కువ చేసి మాట్లాడబోనని చెప్పారు. క‌థ‌ ఎక్కడా వ‌క్రీక‌రించ‌కుండా చెడుపై మంచి సాధించిన రాముని విజ‌యాన్ని... ఆయన ఆదర్శాలను ‘ఆదిపురుష్‌’ చిత్రంలో చూపించనున్నారు’  సైఫ్‌ అలీఖాన్‌ తెలిపారు. ఈ విధంగా సైఫ్ అలీ ఖాన్ తాను వ్యాఖ్యానించిన అంశాల గురించి వివరణ ఇచ్చారు. 


అలెర్ట్ అయిన కేసీఆర్...?

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?

గ్రేటర్ యుద్ధం: మచ్చబొల్లారంలో రీకౌంటింగ్ కోరుతూ బీజేపీ నిరసన!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>