PoliticsP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kisan-andolanaf9eee13-8e75-465b-8544-7384c1b7a45b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kisan-andolanaf9eee13-8e75-465b-8544-7384c1b7a45b-415x250-IndiaHerald.jpgకేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొంతకాలంగా రైతులు చేస్తున్న ఆందోళనకి రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది. ఎముకలు కొరికే చలిలోనూ న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాడుతున్న రైతులు రేపు భారత్ బంద్ కి పిలుపునిచ్చారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేందుకేనని రైతుల పక్షాన విపక్షాలు ఏకపక్షంగా గళమెత్తుతున్నాయి. అయిదు దఫాలుగా కేంద్రంతో రైతులు సాగించిన చర్చలు అర్ధవంతమైన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆందోళన పెద్ద ఎత్తున సాగుతోంది. ఆ చట్టాల రద్దు తప్పిస్తే ఏ చిన్ని సవరణకు సkisan andolan;kcr;ktr;poorna;rajeev;telangana rashtra samithi trs;india;congress;minister;letter;central government;party;mantraరేపు భారత్ బంద్...వెల్లువెత్తుతున్న విపక్షాల మద్దతురేపు భారత్ బంద్...వెల్లువెత్తుతున్న విపక్షాల మద్దతుkisan andolan;kcr;ktr;poorna;rajeev;telangana rashtra samithi trs;india;congress;minister;letter;central government;party;mantraMon, 07 Dec 2020 11:16:19 GMT
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొంతకాలంగా రైతులు చేస్తున్న ఆందోళనకి రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది. ఎముకలు కొరికే చలిలోనూ న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాడుతున్న రైతులు రేపు భారత్ బంద్ కి పిలుపునిచ్చారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేందుకేనని రైతుల పక్షాన విపక్షాలు ఏకపక్షంగా గళమెత్తుతున్నాయి. అయిదు దఫాలుగా కేంద్రంతో రైతులు సాగించిన చర్చలు అర్ధవంతమైన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆందోళన పెద్ద ఎత్తున సాగుతోంది. ఆ చట్టాల రద్దు తప్పిస్తే ఏ చిన్ని సవరణకు సైతం తాము అంగీకరించేది లేదని ఆందోళన చేస్తున్న రైతులు తెగేసి చెప్తున్నారు. రైతు ఉద్యమానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇందులో భాగంగానే 8 న భారత్ బంద్ కి ప్రతిపక్షాలన్నీ అండదండలందిస్తున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుంటే కేంద్రం తనకు ఇచ్చిన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును తిరిగి ఇచ్చేస్తానంటూ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రకటించారు. ప్రధాన విపక్షం  కాంగ్రెస్ పార్టీతో సహా వివిధ రాజకీయ పార్టీలు రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నాయి.
రైతుల ఉద్యమానికి తమ పార్టీ కూడా మద్దతు పలుకుతోందంటూ తెరాస అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకూ కేంద్రంతో సామరస్యంగా ఉంటూ వస్తున్న టీఆరెస్ ఇకపై కేంద్రంతో ఢీ ante ఢీ అనేందుకు సిద్ధపడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 
భారత్ బంద్ కి సంపూర్ణ సహకారం అందిస్తామంటూ కేసీఆర్ ప్రకటించారు. పార్టీ శ్రేణులు ధర్నాలో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిందంటూ ఇప్పటికే సమాచారమందించారు. రైతుల న్యాయమైన డిమాండ్ కి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. కేంద్రం ఆ చట్టాలను రద్దు చేసేంతవరకూ పోరాడాల్సిందేనంటూ పిలుపు ఇచ్చారు. రైతుల పోరాటానికి సలాం చేస్తున్నామంటూ భారత్ బంద్ లో కేంద్ర వైఖరిని ఎండగడతామన్నారు. 
మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎంపీలు, పార్టీ ఇన్చార్గులు, పార్టీ అనుబంధ రైతు విభాగాల నేతలు భారత్ బంద్ సందర్భంగా జాతీయ రహదార్లపై ఆందోళనలు, ధర్నాలు, నిరసనల్లో పాల్గోవాలన్నారు. లారీలు, ట్రక్కులు, ఇతర రవాణా సంస్థల యజమానులు, అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్ లో పాల్గోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రోజూ ఉదయం తెరిచే వ్యాపారులు బంద్ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు తెరవాల్సి ఉంటుందన్నారు. 



27 ఏళ్ల తరువాత మళ్ళీ ఖల్‌నాయక్‌.. అప్పటి హీరో కొడుకే..

బాలీవుడ్‌లో మహిళలకు ప్రాధాన్యం పెరిగింది.. వెల్లడించిన నటి

చంద్రబాబుకు మా చెడ్డ ట్రబులొచ్చింది..?

లోకేష్ లో నిజంగా ఇంత చలనం ఎలా వచ్చింది..?

పాకిస్థాన్‌లో ఘోరం.. పెళ్లి చేసుకోనన్న క్రిస్టియన్ మహిళను దారుణంగా..

ఆ రెండు సినిమాలను అక్క‌డే ప్లాన్ చేసిన నితిన్‌..!?

ట్రంప్ నోట మరో సారి అదే మాట.. నేనే గెలిచా అంటూ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>