WomenP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/women91c8c067-4a18-4ed5-a4b9-adcf4976cb40-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/women91c8c067-4a18-4ed5-a4b9-adcf4976cb40-415x250-IndiaHerald.jpgవెస్టర్న్ దేశాల్లో మెరైల్ స్ట్రీప్ వంటి 60 ఏళ్లు పైబడిన నటీమణులు ఇప్పటికీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక్కడ మహిళా ప్రాధాన్యమున్న కథలూ తక్కువేం కాదు. కానీ భారత సినిమాల్లో, ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలూ, పాత్రలూ చాలా అరుదు. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ ట్రెండ్ మారుతోందని.. మహిళలకు బాలీవుడ్‌లో పవర్‌ఫుల్ రోల్స్ వస్తున్నాయని ప్రముఖ హిందీ నటి మహీ గిల్ అన్నారు. 40 ఏళ్లు పైబడినా ప్రధాన పాత్రల్లో నటించే ఆఫర్లు ఆమెకు చాలానే వచ్చాయి. దీనిపై ఆమె స్పందించారు.women;anoushka;mahie gill;mumbai;cinema;marriage;december;hindi;remake;horror;house;nijam;bhagamathi;chitramబాలీవుడ్‌లో మహిళలకు ప్రాధాన్యం పెరిగింది.. వెల్లడించిన నటిబాలీవుడ్‌లో మహిళలకు ప్రాధాన్యం పెరిగింది.. వెల్లడించిన నటిwomen;anoushka;mahie gill;mumbai;cinema;marriage;december;hindi;remake;horror;house;nijam;bhagamathi;chitramMon, 07 Dec 2020 11:12:09 GMTహిందీ నటి మహీ గిల్ అన్నారు. 40 ఏళ్లు పైబడినా ప్రధాన పాత్రల్లో నటించే ఆఫర్లు ఆమెకు చాలానే వచ్చాయి. దీనిపై ఆమె స్పందించారు.

 తనకు 40 ఏళ్లు వచ్చేసినట్లు ఎప్పుడూ ఫీల్ అవలేదని.. బహుశా ప్రేక్షకులు కూడా ఇలానే విధంగా ఫీల్ అవుతూ ఉండొచ్చని చమత్కరించారు. బాలీవుడ్‌లో ప్రస్తుతం మహిళల రోల్ చాలా మారిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంతకు ముందు నటికి పెళ్లి అయి పిల్లలు పుడితే ఆమె కెరీర్ అయిపోయిందనే కామెంట్లు వినిపించేవని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మహీ గిల్ చెప్పారు. ‘విద్యాబాలన్‌‌ను చూడండి.. ఆమె చేస్తున్న పని నిజంగా అద్భుతం’ అని కొనియాడారు. అయితే మహిళలు సాధించాల్సింది ఇంకా చాలానే ఉందని కూడా అన్నారు. చేసిన పాత్రలనే చేయాలంటే తనకు కూడా బోర్ కొడుతోందని ఈ సందర్భంగా మహీ గిల్ తెలిపారు. ఇంతవరకు ఎన్నడూ చేయని పాత్రల్లో నటించాలనేది తన కోరిన అని మనసులో ఉన్న మాటను చెప్పుకొచ్చారు. హర్రర్ థ్రిల్లర్లలో ఇప్పటివరకు నటించే అవకాశం రాలేదని.. ఒకవేళ ఈ జానర్‌లో మంచి పాత్ర వస్తే తప్పకుండా నటించేందుకు తాను సిద్దమని మహీ గిల్ అన్నారు.

తనకు స్క్రిప్ట్ వర్క్‌, ప్రొడక్షన్ హౌస్ చాలా ముఖ్యమైన అంశాలని ఆమె తెలిపారు. ఎందుకంటే ఎంతో కష్టపడి నటించిన చిత్రం అనుకున్న స్థాయికి రీచ్ కాకపోతే అప్పటివరకు పడిన శ్రమ అంతా వృధా అయిపోతుందని చెప్పారు. తాను తన రోల్‌కు ఎప్పుడూ ఎక్కువ ప్రాధాన్యమిస్తానని, పెద్ద సినిమాలో ఆశించిన రోల్ రాకపోతే తనకు ఉత్సాహంగా ఉండదని మహీ గిల్ అన్నారు. కాగా.. 2018లో అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రాన్ని బాలీవుడ్‌లో దుర్గామతిగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహీ గిల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 11న ఈ చిత్రం విడుదల కానుంది.


27 ఏళ్ల తరువాత మళ్ళీ ఖల్‌నాయక్‌.. అప్పటి హీరో కొడుకే..

రేపు భారత్ బంద్...వెల్లువెత్తుతున్న విపక్షాల మద్దతు

చంద్రబాబుకు మా చెడ్డ ట్రబులొచ్చింది..?

లోకేష్ లో నిజంగా ఇంత చలనం ఎలా వచ్చింది..?

పాకిస్థాన్‌లో ఘోరం.. పెళ్లి చేసుకోనన్న క్రిస్టియన్ మహిళను దారుణంగా..

ఆ రెండు సినిమాలను అక్క‌డే ప్లాన్ చేసిన నితిన్‌..!?

ట్రంప్ నోట మరో సారి అదే మాట.. నేనే గెలిచా అంటూ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>