PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona5d7d9d97-c3b9-4847-baae-2ef0c022f752-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona5d7d9d97-c3b9-4847-baae-2ef0c022f752-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. అయితే హైదరాబాద్‌లో సెకండ్ వేవ్‌కు దారి తీసే పరిస్థితులు ఉన్నాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలే అందుకు కారణం.corona;deva;hyderabad;bharatiya janata party;narendra modi;congress;huzur nagar;prime minister;tdp;traffic police;june;sakshi;coronavirus;narendraసెకండ్ వే: హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొన్నవారికి కరోనా..!?సెకండ్ వే: హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొన్నవారికి కరోనా..!?corona;deva;hyderabad;bharatiya janata party;narendra modi;congress;huzur nagar;prime minister;tdp;traffic police;june;sakshi;coronavirus;narendraMon, 07 Dec 2020 21:00:00 GMTకరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. అయితే హైదరాబాద్‌లో సెకండ్ వేవ్‌కు దారి తీసే పరిస్థితులు ఉన్నాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలే అందుకు కారణం. ఎస్‌ఆర్ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఒకేసారి ఎనిమిది మంది సిబ్బంది కరోనా వైరస్ బారినపడటం అలజడి రేపుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎస్‌ఆర్‌ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఎనిమిది మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. వీరిలో ఇద్దరు ఎస్‌ఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లు ఉన్నట్లు సమాచారం. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు రెండోసారి కొవిడ్-19 నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. వారిద్దరికీ గత జూన్ నెలలోనే కరోనా సోకగా.. తాజాగా మరోసారి పాజిటివ్ వచ్చినట్లు సాక్షి వెబ్‌ సైట్‌లో ఓ వార్త కథనం రాశారు.

తాజా ఘటన పోలీసు శాఖలో ప్రకంపనలు రేపుతోంది. దీంతో పాటు జీహెచ్ఎంసి ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సుమారు 15 రోజుల పాటు ప్రచార కార్యక్రమాలతో నగరం హోరెత్తింది.

అయితే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయా పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది కరోనా నిబంధనలు పాటించలేదు. కొంత మంది కనీసం మాస్కు కూడా ధరించలేదు. ఇక భౌతిక దూరం సంగతి దేవుడెరుగు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా.. ఎక్కువ మందికి వైరస్ అంటుకునే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అంతకుముందే హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కొనసాగిన తీరు, రాజకీయ పార్టీల వ్యవహార శైలిపై అటు హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.




రాజుగారు ఇంత సాఫ్ట్ గా ఉంటే అధికారం కష్టమే..?

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>