Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_actors/gopichanda322b5c2-83a9-4450-b938-e4aa9c4aa611-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_actors/gopichanda322b5c2-83a9-4450-b938-e4aa9c4aa611-415x250-IndiaHerald.jpgకరోనా నేపథ్యంలో ఎంతోమంది నటీనటులు తమ అభిమానులకు అండగా నిలుస్తున్నారు. ఆర్థికంగా చేయూతనందిస్తున్నారు. టాలీవుడ్ హీరో గోపిచంద్ కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయారు. కరోనా బారినపడి కుటుంబ పోషణ భారంగా మారిన ఓ అభిమాని కష్టాన్ని తీర్చేందుకు..gopichand;gopichand;tollywood;cinema;telugu;cheque;hero;racchaఅభిమానిని ఆదుకున్న గోపిచంద్.. కానీ...అభిమానిని ఆదుకున్న గోపిచంద్.. కానీ...gopichand;gopichand;tollywood;cinema;telugu;cheque;hero;racchaMon, 07 Dec 2020 15:33:00 GMTకరోనా నేపథ్యంలో ఎంతోమంది నటీనటులు తమ అభిమానులకు అండగా నిలుస్తున్నారు. ఆర్థికంగా చేయూతనందిస్తున్నారు. టాలీవుడ్ హీరో గోపిచంద్ కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయారు. కరోనా బారినపడి కుటుంబ పోషణ భారంగా మారిన ఓ అభిమాని కష్టాన్ని తీర్చేందుకు స్వయంగా కదిలారు. ఇప్పుడీ విషయం వైరల్ కావడంతో నెటిజన్లు గోపీచంద్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 


సినిమా హీరోలంటే అనేకమందికి పిచ్చి అభిమానం ఉంటుంది. వాళ్ల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు అభిమానులు చేసే రచ్చ అంత ఇంతా కాదు. థియేటర్ల ముందు కటౌట్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం, పుట్టినరోజుకు కేకులు కట్ చేయడం, రక్తదానాలు చేయడం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. మరి అలాంటి అభిమానులకు కష్టం వస్తే హీరోలు మాత్రం ఊరుకుంటారా.. కష్టాల్లో ఉన్నారని తెలియగానే వారిని ఆదుకుని తమ గొప్ప మనసును చాటుకుంటారు. హీరో గోపీచంద్ కూడా ఇప్పుడు ఆ కోవలోకే చేరారు. తన అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని రూ.2లక్షల ఆర్థిక సాయం చేశారు. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్‌నగర్ లో చక్కర్లు కొడుతోంది.



కరీంనగర్‌కు ఓ యువకుడు గోపీచంద్‌కు వీరాభిమాని. ఇటీవల అతడికి కరోనా సోకడంతో వైద్యం కోసం భారీగా ఖర్చుచేసి అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ విషయం గోపీచంద్‌కు తెలియడంతో వెంటనే రూ.2లక్షల చెక్ పంపించారట. తన అభిమాన హీరో చేసిన ఆర్థిక సాయంతో అతడు ఆటో కొనుక్కుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.



 అయితే ఈ విషయాన్ని గోపీచంద్ కానీ ఆయన టీం కానీ ఎక్కడా బయట పెట్టలేదు. అయితే సాయం పొందిన వ్యక్తి మాత్రం ఈ విషయాన్ని అందరికీ చెప్పుకున్నాడు. దీంతో విఆహాయం వెలుగులోకి వచ్చింది.



ఎవరికైనా చిన్న సాయం చేసినా తెగ పబ్లిసిటీ చేసుకోవడం చాలామందికి అలవాటు. కానీ గోపిచంద్ మాత్రం అభిమాని కష్టాన్ని తీర్చే సాయం చేసి కూడా బయటికి చెప్పుకోలేదు. హ్యాట్సాఫ్ గోపిచంద్.




జగన్ అమూల్ తీసుకొచ్చే కారణం అదేనా...?

కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?

పెదనాన్న.. నేను.. ఓ సెల్ఫీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>