PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrba5033e5-1f13-4f87-a9df-f0f08645de1f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrba5033e5-1f13-4f87-a9df-f0f08645de1f-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని సిఎం కేసీఆర్ సూచించారు. రూ.4,800 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. రైతులకు 50 శాతం సబ్సిడీ ఇచ్చి ఆయల్ పామ్ సాగు చేయించనున్నట్లు ఆయన తెలిపారు. నిత్యం సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లోనే ఆయిల్ పామ్ సాగు చేయడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా వల్ల ఆ సదుపాయం రాష్ట్ర రైతాంగం ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని 25 జిలkcr;kcr;nithya new;pragathi;vidya;india;telangana;government;electricity;minister;oil;aqua;good news;reddy;good newwzపామాయిల్ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్పామాయిల్ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్kcr;kcr;nithya new;pragathi;vidya;india;telangana;government;electricity;minister;oil;aqua;good news;reddy;good newwzMon, 07 Dec 2020 21:00:00 GMTతెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని సిఎం కేసీఆర్ సూచించారు. రూ.4,800 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. రైతులకు 50 శాతం సబ్సిడీ ఇచ్చి ఆయల్ పామ్ సాగు చేయించనున్నట్లు ఆయన తెలిపారు. నిత్యం సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లోనే ఆయిల్ పామ్ సాగు చేయడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా వల్ల ఆ సదుపాయం రాష్ట్ర రైతాంగం ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలోని 25 జిల్లాలను ఆయిల్ పామ్ సాగుకు అనువైనవిగా నేషనల్ రీ అసెస్మెంట్ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిందని సిఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచే విధానంపై ప్రగతి భవన్ లో సిఎం సమీక్షా సమావేశం జరిపారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కార్యదర్శి జనార్థన్ రెడ్డి, హర్టికల్చర్ కార్పొరేషన్ ఎండి వెంకట్రామ రెడ్డి , సీడ్ కార్పొరేషన్ ఎండి కేశవులు పాల్గొన్నారు. ఒక ఎకరం వరిని సాగు చేయగలిగే నీటితో 4 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు అని సిఎం పేర్కొన్నారు.

దేశంలో, ప్రపంచంలో ప్రస్తుతం వరి ధాన్యం నిల్వలు అసవరానికి మించి ఉన్నాయి. కాబట్టి వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేయడం మేలు అని ఆయన అన్నారు. “భారతదేశానికి 22 మిలియన్ టన్నుల ఆయిల్ కావాలి. కానీ దేశంలో 7 మిలియన్ టన్నుల ఆయిల్ తీయడానికి అవసరమయ్యే నూనె గింజలు మాత్రమే పండిస్తున్నాం. ప్రతీ ఏడాది 15 మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల ప్రతీ ఏడాది 70 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తున్నది. దిగుమతి చేసుకోవడం వల్ల ఆయిల్ కల్తీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.” అని ఆయన అన్నారు.


రాజుగారు ఇంత సాఫ్ట్ గా ఉంటే అధికారం కష్టమే..?

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>