MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/alia-bhat-rajamouli-bahubali831f0d09-208b-455d-a1b9-2a3412afa7a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/alia-bhat-rajamouli-bahubali831f0d09-208b-455d-a1b9-2a3412afa7a9-415x250-IndiaHerald.jpgదర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. బాహుబలి ఫ్రాంచైస్ తర్వాత అదే రేంజ్ లో తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అదీ కాక టాలీవుడ్ లో రెండు బడా ఫ్యామిలీలకు చెందిన కుర్ర హీరోలు ఇద్దరూ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఏకకాలంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి జక్కన్న ప్లాన్ చేశాడు. అందుకు తగ్గట్టుగాtollywood;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;ram pothineni;rajamouli;mumbai;hyderabad;bollywood;tollywood;rrr movie;cinema;bahubali;media;tamil;kannada;hindi;november;october;hero;instagram;heroine;nandamuri taraka rama rao;coronavirusహమ్మయ్య.. ఎట్టకేలకు అలియా మొదలు పెట్టింది !హమ్మయ్య.. ఎట్టకేలకు అలియా మొదలు పెట్టింది !tollywood;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;ram pothineni;rajamouli;mumbai;hyderabad;bollywood;tollywood;rrr movie;cinema;bahubali;media;tamil;kannada;hindi;november;october;hero;instagram;heroine;nandamuri taraka rama rao;coronavirusMon, 07 Dec 2020 12:02:17 GMTదర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. బాహుబలి ఫ్రాంచైస్ తర్వాత అదే రేంజ్ లో తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అదీ కాక టాలీవుడ్ లో రెండు బడా ఫ్యామిలీలకు చెందిన కుర్ర హీరోలు ఇద్దరూ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఏకకాలంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి జక్కన్న ప్లాన్ చేశాడు. 


అందుకు తగ్గట్టుగానే ఆయా భాషలకు చెందిన కీలక నటులను ఈ సినిమాలో నటింప చేస్తున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ విషయానికి వస్తే అక్కడి స్టార్ హీరో అజయ్ దేవగన్ అలానే హీరోయిన్ అలియా భట్ లను ఈ సినిమాలో నటింపచేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ఆమె నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఇప్పటి దాకా ఆమె పాల్గొనలేదు. నవంబర్ మొదట్లోనే ఈమె షూటింగ్ లో పాల్గొంటుందని భావించినా ఆమె వేరే సినిమాల్లో బిజీగా ఉండి ఈ సినిమా షూటింగ్ కి హాజరు కాలేదు. తాజాగా ఆమె ఈ షూటింగ్ కి హాజరు కాబోతున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 


నిన్న ఆమె ముంబై నుంచి హైదరాబాద్ కు వస్తున్నట్లు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. దీంతో ఈ రోజు నుంచి జరగబోయే షూటింగులో ఆమె పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా ఏడు నెలల పాటు ఆగిపోయింది. అక్టోబర్ 5న ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లను పెట్టీ మొదలు పెట్టినా ఈమె మాత్రం షూట్ లో పాల్గొనలేదు.  ఎట్టకేలకు ఆమె హైదరాబాద్ చేరడంతో ఇక చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ తీరినట్లు అయింది.




నేడే త్రివిధ దళాల పతాక దినోత్సవం!

రేపు భారత్ బంద్...వెల్లువెత్తుతున్న విపక్షాల మద్దతు

బాలీవుడ్‌లో మహిళలకు ప్రాధాన్యం పెరిగింది.. వెల్లడించిన నటి

చంద్రబాబుకు మా చెడ్డ ట్రబులొచ్చింది..?

లోకేష్ లో నిజంగా ఇంత చలనం ఎలా వచ్చింది..?

పాకిస్థాన్‌లో ఘోరం.. పెళ్లి చేసుకోనన్న క్రిస్టియన్ మహిళను దారుణంగా..

ఆ రెండు సినిమాలను అక్క‌డే ప్లాన్ చేసిన నితిన్‌..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>