MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/comedian-shivareddy9ceb88a2-1b3d-4440-a298-fa8fc69ac549-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/comedian-shivareddy9ceb88a2-1b3d-4440-a298-fa8fc69ac549-415x250-IndiaHerald.jpgశివారెడ్డి..ఒకప్పుడు తెలుగు సినిమా నటుడిగా,మిమిక్రీ ఆర్టిస్టుగా ఎన్నో ప్రోగ్రాం చేసి వేల మంది నవ్వించాడు. మెగాస్టార్ సైతం పొగిడిన కళాకారుడు. దూకుడు, అతడే ఒక సైన్యం వంటి సినిమాల్లో మిమిక్రీ ఆర్టిస్టుగానే కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడుcomedian shivareddy;chiranjeevi;prakash raj;swati;raj;swathi;hyderabad;tollywood;cinema;huzur nagar;media;interview;industry;wife;comedian;hero;letter;karimnagarపొట్ట నింపుకోవడానికి ఆ పని చేయక తప్పడం లేదు : శివారెడ్డిపొట్ట నింపుకోవడానికి ఆ పని చేయక తప్పడం లేదు : శివారెడ్డిcomedian shivareddy;chiranjeevi;prakash raj;swati;raj;swathi;hyderabad;tollywood;cinema;huzur nagar;media;interview;industry;wife;comedian;hero;letter;karimnagarMon, 07 Dec 2020 11:00:00 GMTసినిమా నటుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా ఎన్నో ప్రోగ్రాం చేసి వేలమందిని నవ్వించాడు.  మెగాస్టార్ సైతం పొగిడిన కళాకారుడు. దూకుడు, అతడే ఒక సైన్యం వంటి సినిమాల్లో మిమిక్రీ ఆర్టిస్టుగానే కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతకుముందు రెండు చిన్న సినిమాల్లో హీరోగా కూడా చేసాడు.  సినిమా నటుల, రాజకీయ నాయకుల వాయిస్లు ఇమిటేట్ చేయడంలో దిట్ట. వైస్సార్ వంటి వారిని ఎదురుగా పెట్టుకొని ఆయనచేత శభాష్ అనిపించుకున్న ఆర్టిస్ట్ శివారెడ్డి. ఇక చాలా ఏళ్లుగా శివారెడ్డి ఎక్కడ కనిపించడం లేదు. వందల సినిమాల్లో హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటించి, నవ్వించిన ఈయన ఏం అయ్యాడు ఇప్పుడు అనే ప్రశ్న చాల మందిలో ఉంది.

 ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతం వివరించాడు శివారెడ్డి. తాను సినిమాల్లో నటించాలని, అందరిని నవ్వించాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ చెప్తున్నాడు శివారెడ్డి. నటించాలని నాకు మాత్రం ఉండదా, కానీ ఒక్క అవకాశం ఇచ్చే వారు లేరు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను టాలీవుడ్ లో ఒక కమెడియన్ కావాలనే తొక్కాడని, అతని పేరు చెప్పడానికి ఒప్పుకొని శివారెడ్డి, ప్రస్తుతం పొట్ట నింపుకోవడానికి మిమిక్రీ స్టేజి షోలు చేస్తున్న అంటూ చెప్పుకోచ్చాడు. తాను ఎవరిని చెయ్యి చాచి ఏమి అడిగానని, అలాగే ఇండస్ట్రీలో ఎవరికీ చెడు చేయలేదని, అయినప్పటికీ తనను ఎవరు గుర్తించకపోవడం పట్ల తన ఆవేదన చెప్పుకున్నాడు. ట్యాలెంట్ లేకపోయినప్పటికీ చాలా మందికి ఈ ఇండస్ట్రీ ఎంతో ఇచ్చిందని, నాలాంటి కళాకారున్ని తొక్కేసిందని చెప్పాడు.  చిరంజీవి, ప్రకాష్ రాజ్, దాసరి నారాయణరావు వంటి వారు తనను ఎంతో మెచ్చుకున్నారంటూ తెలిపాడు శివారెడ్డి. ఇక ఈయనకు భార్య స్వాతి మరియు ఒక కూతురు ఉన్నారు. కరీంనగర్ లో పుట్టి పెరిగిన శివారెడ్డి, ప్రస్తుతం హైదరాబాద్ లో జీవిస్తున్నారు.


కాషాయ జెండా ఎగిరేవరకూ ఇదే పోరాటం: తెలంగాణ నేతలతో అమిత్ షా

రేపు భారత్ బంద్...వెల్లువెత్తుతున్న విపక్షాల మద్దతు

బాలీవుడ్‌లో మహిళలకు ప్రాధాన్యం పెరిగింది.. వెల్లడించిన నటి

చంద్రబాబుకు మా చెడ్డ ట్రబులొచ్చింది..?

లోకేష్ లో నిజంగా ఇంత చలనం ఎలా వచ్చింది..?

పాకిస్థాన్‌లో ఘోరం.. పెళ్లి చేసుకోనన్న క్రిస్టియన్ మహిళను దారుణంగా..

ఆ రెండు సినిమాలను అక్క‌డే ప్లాన్ చేసిన నితిన్‌..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>