PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andrapradeshad9e27f7-96ca-4517-b62f-9804dc8d946a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andrapradeshad9e27f7-96ca-4517-b62f-9804dc8d946a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ పై అంతు చిక్కని వ్యాధి కన్ను పడింది..నిన్న మొన్నటి వరకు కరోనా భయంలో బ్రతికిన ప్రజలు ఇప్పుడు మరో వింత జబ్బుతో భాధించ పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోనే మహమ్మారి జబ్బు గత రెండు రోజులుగా భాదిస్తుంది. ఈ వ్యాధి కారణంగా దాదాపు 300 మంది ఆసుపత్రిలో చేరారు. అందులో 117 మంది కోలుకున్నారు. ఒకరు మృతి చెందగా, పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ విషయం పై ఇప్పటికే రాజకీయ నేతలు కీలక చర్చలను చేస్తున్నారు. andrapradesh;ashok;godavari river;andhra pradesh;district;west godavari;huzur nagar;minister;central government;eluru;reddy;arundhati;petta;vకేంద్రాన్ని కదిలించిన ఏలూరు అస్వస్థత..పెరుగుతున్న మృతుల సంఖ్య..కేంద్రాన్ని కదిలించిన ఏలూరు అస్వస్థత..పెరుగుతున్న మృతుల సంఖ్య..andrapradesh;ashok;godavari river;andhra pradesh;district;west godavari;huzur nagar;minister;central government;eluru;reddy;arundhati;petta;vMon, 07 Dec 2020 12:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ పై అంతు చిక్కని వ్యాధి కన్ను పడింది..నిన్న మొన్నటి వరకు కరోనా భయంలో బ్రతికిన ప్రజలు ఇప్పుడు మరో వింత జబ్బుతో భాధించ పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోనే మహమ్మారి జబ్బు గత రెండు రోజులుగా భాదిస్తుంది. ఈ వ్యాధి కారణంగా దాదాపు 300 మంది ఆసుపత్రిలో చేరారు. అందులో 117 మంది కోలుకున్నారు. ఒకరు మృతి చెందగా, పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ విషయం పై ఇప్పటికే రాజకీయ నేతలు కీలక చర్చలను చేస్తున్నారు.



తాజాగా ఈ విషయం పై కేంద్రం స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఆరా తీశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఫోన్‌లో చర్చించారు. ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏపీ గవర్నర్‌ కార్యాలయంతో కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. గవర్నర్‌ నుంచి ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక వచ్చాక కేంద్రం సహకారం పూర్తిగా లభిస్తుందని ఆయన తెలిపారు.



ఏలూరులోని దక్షిణ వీధి, తూర్పు వీధి, పడమర వీధి, అశోక్ నగర్, అరుంధతి పేట తదితర ప్రాంతాలకు చెందిన వందలాది మంది ప్రజలు ఆకస్మికంగా కళ్లు తిరిగి పడిపోవడం, నురగలు కక్కుతూ పడిపోవడం, వాంతులు, తలపోటు మొదలగు లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో 40 ఏళ్లు దాటిన వారి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి ఎంటి అనేది అంతుచిక్కడం లేదని , దాని వల్లే వైద్యం చేయలేక పోతున్నామని వారు అంటున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఏలూరులో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది..




నేడే త్రివిధ దళాల పతాక దినోత్సవం!

రేపు భారత్ బంద్...వెల్లువెత్తుతున్న విపక్షాల మద్దతు

బాలీవుడ్‌లో మహిళలకు ప్రాధాన్యం పెరిగింది.. వెల్లడించిన నటి

చంద్రబాబుకు మా చెడ్డ ట్రబులొచ్చింది..?

లోకేష్ లో నిజంగా ఇంత చలనం ఎలా వచ్చింది..?

పాకిస్థాన్‌లో ఘోరం.. పెళ్లి చేసుకోనన్న క్రిస్టియన్ మహిళను దారుణంగా..

ఆ రెండు సినిమాలను అక్క‌డే ప్లాన్ చేసిన నితిన్‌..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>