PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/countdown-start-to-corona-vaccinefe3196e9-e8ce-474f-89fb-0ed4b798836d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/countdown-start-to-corona-vaccinefe3196e9-e8ce-474f-89fb-0ed4b798836d-415x250-IndiaHerald.jpgప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సీన్‌ సిద్ధమైంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో వ్యాక్సిన్‌ పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇటీవలే ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి బ్రిటన్‌ అనుమతించింది. వీటిని ఈ మంగళవారం నుంచే ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ కార్యక్రమంగా అభివర్ణించింది బ్రిటన్‌. మొదటి విడతలో భాగంగా, ఆరోగ్య సిబ్బందికి, 80ఏళ్ల వయసు పైబడినవారితో పాటు అక్కడి కేర్‌ హోమ్‌ వర్కర్లకు ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నారు. తొలుత మొదటి డcountdown start to corona vaccine;american samoa;donald trumpకరోనా టీకాకు కౌంట్‌డౌన్ !కరోనా టీకాకు కౌంట్‌డౌన్ !countdown start to corona vaccine;american samoa;donald trumpMon, 07 Dec 2020 18:00:00 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సీన్‌ సిద్ధమైంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో వ్యాక్సిన్‌ పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇటీవలే ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి బ్రిటన్‌ అనుమతించింది. వీటిని ఈ మంగళవారం నుంచే ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ కార్యక్రమంగా అభివర్ణించింది బ్రిటన్‌.  మొదటి విడతలో భాగంగా, ఆరోగ్య సిబ్బందికి, 80ఏళ్ల వయసు పైబడినవారితో పాటు అక్కడి కేర్‌ హోమ్‌ వర్కర్లకు ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నారు.  తొలుత మొదటి డోసు ఇచ్చి, 21రోజుల అనంతరం మరో డోసు ఇస్తామని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది.ఈ వారంలోనే దాదాపు 8లక్షల డోసులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు 4కోట్ల డోసులను యూకే ప్రభుత్వం ఆర్డర్‌ చేసింది.

వ్యాక్సీన్‌ పంపిణీలో యూకే తర్వాత అమెరికా ఉంది. ఇప్పటికే అమెరికా ఎఫ్‌డీఏను ఫైజర్‌ అనుమతి కోరగా.. వ్యాక్సిన్‌ వినియోగానికి ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ అనుమతి ఇస్తే.. అమెరికాలో ఈ శుక్రవారం నుంచే వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌ సమర్థతపై గురువారం జరుగనున్న సమావేశంలో ఎఫ్‌డీఏ వ్యాక్సిన్‌ అనుమతికే ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్‌ పంపిణీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా స్పందించారు. వచ్చే వారంలోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని జార్జియాలో జరిగిన ర్యాలీలో ఆయన వెల్లడించారు. ఇతర ప్రభుత్వ హయాంలో ఐతే వ్యాక్సిన్‌ రావడానికి మరో ఐదేళ్లు పట్టేదని.. కేవలం ఏడు నెలల్లోనే మేము వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇంత తొందరగా వ్యాక్సిన్‌ వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరని.. దానిని తాము సాధ్యం చేసి చూపించామంటూ ట్రంప్‌ గొప్పలు చెప్పుకుంటున్నారు. 


వరుస సినిమాలతో జోరుగా ఉన్న బాలకృష్ణ..?

ఉపాధ్యాయలోకానికి పాఠశాల విద్యాశాఖ భారీ షాక్...

ఒక్క రాజధానికే డబ్బులు లేవు..మరి మూడు రాజధానులకు ఎక్కడివి ??

నటి రజిత తల్లి కూడా మనకు నచ్చిన హీరోయిన్ అని మీకు తెలుసా..?

అతిత్వరలో రైతుల అకౌంట్లో 'రైతుబంధు' నిధులు!

గ్రేటర్ యుద్ధం: ఎట్టకేలకు హైకోర్టు నిర్ణయంతో నేరేడ్ మేట్ డివిజన్ ఫలితానికి మార్గం సుగుమం!

కొడాలి నానీని టార్గెట్ చేసిన టీడీపీ మహిళా నేత




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>