MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithin162fdc9f-bc76-49df-8669-e1f8dc3d9913-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithin162fdc9f-bc76-49df-8669-e1f8dc3d9913-415x250-IndiaHerald.jpgహీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఈ ఏడాది బీష్మ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మూడు సినిమాల‌ను సిద్ధం చేస్తున్నాడు. నిజానికి కోవిడ్ ప్ర‌భావం లేకుండా ఉండుంటే రంగ్ దే సినిమా వేస‌విలో విడుద‌ల‌య్యేది. కానీ నితిన్ సినిమాల‌న్నీ సెట్స్‌పైనే ఉన్నాయి. nithin;venkatesh;nithin;geetha;jeevitha rajaseskhar;mahathi;merlapaaka gandhi;tamannaah bhatia;mohandas karamchand gandhi;cinema;sangeetha;telugu;media;hindi;remake;thriller;cheque;hero;heroine;nithin reddy;reddy;venky atluriఆ రెండు సినిమాలను అక్క‌డే ప్లాన్ చేసిన నితిన్‌..!?ఆ రెండు సినిమాలను అక్క‌డే ప్లాన్ చేసిన నితిన్‌..!?nithin;venkatesh;nithin;geetha;jeevitha rajaseskhar;mahathi;merlapaaka gandhi;tamannaah bhatia;mohandas karamchand gandhi;cinema;sangeetha;telugu;media;hindi;remake;thriller;cheque;hero;heroine;nithin reddy;reddy;venky atluriMon, 07 Dec 2020 10:15:00 GMTహీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఈ ఏడాది బీష్మ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మూడు సినిమాల‌ను సిద్ధం చేస్తున్నాడు. నిజానికి కోవిడ్ ప్ర‌భావం లేకుండా ఉండుంటే రంగ్ దే సినిమా వేస‌విలో విడుద‌ల‌య్యేది. కానీ నితిన్ సినిమాల‌న్నీ సెట్స్‌పైనే ఉన్నాయి. ముఖ్యంగా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న రంగ్‌దే సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.

ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.  అలాగే.. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చెక్ సినిమా కూడా ముగింపు ద‌శ‌కు చేరుకుంది. దీంతో నితిన్ కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. హిందీ చిత్రం ‘అంధాదున్‌' తెలుగు రీమేక్‌లో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.  మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ఠాగూర్ మ‌ధు, నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బాలీవుడ్‌లో టబు చేసిన గ్రేషేడ్స్ ఉన్న పాత్ర‌లో త‌మ‌న్నా న‌టిస్తుంది. అయితే తెలుగులో నభా నటేష్‌, తమన్నా కథానాయికలు. ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలు. నితిన్‌ నటిస్తున్న 30వ చిత్రమిది కావడం విశేషం.

సినిమా షూటింగ్‌ ఆదివారం దుబాయ్‌లో ప్రారంభమైంది.  నాయకానాయికలపై ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు నితిన్‌. పియానిస్ట్‌ అయిన అంధుడి జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ యువరాజ్‌, సంగీతం మహతి స్వరసాగర్‌, సంభాషణలు, దర్శకత్వం మేర్లపాక గాంధీ వహిస్తున్నారు. అలా నితిన్ తను చేయాల్సిన మూడు సినిమల్లో రెండు సినిమాల‌ను దుబాయ్‌లో ప్లాన్ చేసి ఒక దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అనే సామెత‌ను వ‌ర్క్ విష‌యంలో నిజం చేసుకోబోతున్నాడట‌. రంగ్ దే సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయితే అంధాదున్ రీమేక్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కనుంది




ట్రంప్ నోట మరో సారి అదే మాట.. నేనే గెలిచా అంటూ..?

గోవు దానం చేయండి: వైవీ సుబ్బారెడ్డి పిలుపు

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంలో లెక్క తప్పింది: కేటీఆర్

కేజీయఫ్ డైరెక్టర్‌తో మెగాహీరో? నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే!

గ్రేటర్ యుద్ధం: ‘స్వస్తిక్ గుర్తు’ తీర్పుపై జోక్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిలైందా? ఇదే మార్గం!

హరితేజ కనిపించక పోవడానికి కారణం తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>