Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/own-housec0e56b84-f372-4435-badc-2a77410ee869-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/own-housec0e56b84-f372-4435-badc-2a77410ee869-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఓ కల. తమకంటూ ఓ ఇల్లు ఉండాలని అందరూ అనుకుంటూ వుంటారు. అయితే చాలండికి సొంతిల్లు కొనుక్కునే ఆర్థిక స్థోమత ఉండదు. దాంతో వాళ్ళ కల కలగానే మిగిలిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా ఇల్లు తక్కువ ధరకు దొరికితే.. own house;village;population;local languageరూ.90కే సొంతిల్లు.. కానీ ఓ షరతురూ.90కే సొంతిల్లు.. కానీ ఓ షరతుown house;village;population;local languageMon, 07 Dec 2020 22:35:00 GMT
ఇటలీలోని ఒక గ్రామంలో కేవలం రూ. 90కే ఒక్కో ఇంటిని విక్రయిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇటలీలోని మోలిఝో పరిధిలోని క్యాస్ట్రోపిగనానో గ్రామ జనాభా కేవలం 900. అక్కడి చాలా ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం గ్రామంలోని ఇళ్లను విక్రయించాలని నిర్ణయించింది. ఒక్కో ఇంటిని రూ. 90కే విక్రయస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఇళ్లను కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఒక షరతు విధించింది. ఆ ఇళ్లను కొనుగోలు చేసేవారు వాటికి మరమ్మతులు చేయించుకోవడంతోపాటు, అదే ఇంట్లో ఉండాలి.


ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు ఇళ్లు అందిస్తున్న గ్రామంగా క్యాస్ట్రోపిగనానో పేరొందింది. 1930లో ఈ గ్రామంలో 2,500 మంది ఉండేవారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత చాలా మంది ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. 1960 తరువాత ఉపాధి కోసం యువకులు ఇక్కడి నుంచి వలసలు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ గ్రామంలోని జనాభాలో 60 శాతం మంది 70 ఏళ్ల పైబడినవారే ఉన్నారు. దీంతో స్థానిక పరిపాలనా అధికారులు ఈ గ్రామానికి తిరిగి పూర్వపు కళ తీసుకురావాలని తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకే తక్కువ ధరకే గ్రామంలోని ఇళ్లను విక్రయించాలని నిర్ణయించారు. కాగా ఈ గ్రామం అందమైన సముద్ర తీరంలో ఉండటంతోపాటు, అందమైన రిసార్టులు కూడా ఉన్నాయి.


పరిపాలనా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఇళ్లను కొనుగోలు చేసేవారు మూడేళ్లలో వాటికి మరమ్మతులు చేయించాలి. లేనిపక్షంలో ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోవాలి. అలాగే ఈ ఇంటిని కొనుగోలు చేయాలకునే వారు ముందుగా 2000 యూరోలు(రూ.1,78,930) డిపాజిట్ చెల్లించాల్సి వుంటుంది. ఈ సొమ్ము మనదే అయిన ప్రభుత్వం వద్ద ఉంటుంది.


కీళ్ల నొప్పులు తగ్గి ఎముకలు దృఢంగా వుండటానికి ఈ ఆహార పదార్ధాలు తీసుకోండి...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>