PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/similarities-between-eluru-and-vizag-incidentfaf4b717-d641-4203-898c-106fb7714c0a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/similarities-between-eluru-and-vizag-incidentfaf4b717-d641-4203-898c-106fb7714c0a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఏలూరులో జరిగిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం గా మారింది. ఈ ఘటనకు కారణం ఏంటో తెలియక పోయినా ఇప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యం బారిన పడటంతో కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏలూరు వచ్చి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే త్వరలోనే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బృందం బాధితులను పరామర్శించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం వచ్చి అక్కడున్న ప్రజలతో మాట్లాడి అసలు సమస్య ఏంటిeleuru,central government,ap;amit shah;andhra pradesh;g kishan reddy;amith shah;media;prime minister;minister;central government;international;eluru;reddyఏలూరుకి కేంద్ర బృందం...?ఏలూరుకి కేంద్ర బృందం...?eleuru,central government,ap;amit shah;andhra pradesh;g kishan reddy;amith shah;media;prime minister;minister;central government;international;eluru;reddyMon, 07 Dec 2020 15:26:40 GMTఆంధ్రప్రదేశ్ లో ఏలూరులో జరిగిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం గా మారింది. ఈ ఘటనకు కారణం ఏంటో తెలియక పోయినా ఇప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యం బారిన పడటంతో కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏలూరు వచ్చి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే త్వరలోనే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బృందం బాధితులను పరామర్శించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం వచ్చి అక్కడున్న ప్రజలతో మాట్లాడి అసలు సమస్య ఏంటి అని తెలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలను నిర్వహించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖతో కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి బృందం వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు మరి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలియదు. అయితే ప్రధానమంత్రి కూడా ఈ సంఘటనపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అదే విధంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై ఆరా తీశారని సమాచారం.

కిషన్ రెడ్డిని ఘటనా స్థలానికి వెళ్ళమని ఆయన ఆదేశాలు ఇచ్చారు. పరిస్థితి ఏంటి అనేది త్వరలోనే దీనికి సంబంధించి నివేదికలను పూర్తిస్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. జాతీయ మీడియాలో కూడా దీనికి సంబంధించి ఎక్కువగా కథనాలు వస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా కూడా దీనిపై ఫోకస్ చేయడంతో అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి అసలు కారణం ఏంటి అనేది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు.


స్టార్ హీరో వారసుడికి షాక్ ఇచ్చిన రష్మిక..!

కేసీఆర్ కంటే ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడా: విజయశాంతి

ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

వామ్మో కాజల్ ..హనీ మూన్ లో కూడా ఇంత కక్కుర్తి పడ్డావా..?

బెజవాడను భయపెట్టిన రోడ్డు ప్రమాదాలు

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. చిరుకి బాదే మిగిలింది..?

పెదనాన్న.. నేను.. ఓ సెల్ఫీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>